Admissions in AIISH Mysore

Admissions in AIISH Mysore : కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లోగల ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ (All India Institute of Speech and Hearing-AIISH) డిప్లొమా, డిగ్రీ, పీజీ అకడమిక్ ప్రోగామ్ లలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రోగామ్ లకు ఎంపికైన వారికి శిక్షణతో పాటు స్టైపెండ్ కూడా ఇస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీని ఇనిస్టిట్యూట్ కు పంపించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షల ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. హైదరాబాద్ లో పరీక్ష కేంద్రం ఉంటుంది.

Diploma Programmes

ప్రోగ్రామ్ పేరు: డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ అండ్ ఇయర్ మౌల్డ్ టెక్నాలజీ
(Diploma in Hearing Aid and Ear Mould Technology (DHA & ET))
సీట్ల సంఖ్య: ఇరవై ఎనిమిది (28)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ మెరిట్ (General Merit) -11, ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections) – 03, ఎస్సీ (Scheduled Caste)-04 ఎన్టీ (Scheduled Tribe) – 02, ఓబీసీ (Other Backward Class)-08
అర్హతలు: 12వ తరగతిలో ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణత. లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా. లేదా ఏదైనా డెంటల్ టెక్నీషియన్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో ఐటీఐ డిప్లొమా.
వయసు: జూలై 1, 2022 నాటికి 24 సంవత్సరాలు మించకూడదు.
ప్రోగామ్ వ్యవధి: ఒక్క సంవత్సరం
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు పది నెలల పాటు నెలకు రూ.250 చెల్లిస్తారు.

ప్రోగ్రామ్ పేరు: డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్ మెంట్)
(Diploma in Early Childhood Special Education (Hearing Impairment) (DECSE [HI]))
సీట్ల సంఖ్య: ఇరవై ఎనిమిది (28)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ మెరిట్ (General Merit) -11, ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections)-03, ఎస్సీ (Scheduled Caste)-04 ఎన్డీ (Scheduled Tribe)- 02, ఓబీసీ (Other Backward Class)-08
అర్హతలు: 50 శాతం మార్కులతో 12వ తరగతి (10+2)లో ఉత్తీర్ణత.
వయసు: జూలై 1, 2022 నాటికి 24 సంవత్సరాలు మించకూడదు.
ప్రోగామ్ వ్యవధి: ఒక్క సంవత్సరం
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు పది నెలల పాటు నెలకు రూ.250 చెల్లిస్తారు.

ప్రోగ్రామ్ పేరు: డిప్లొమా ఇన్ హియరింగ్, లాంగ్వేజ్ అండ్ స్పీచ్ – వీడియో కాన్ఫరెన్స్ మోడ్
(Diploma in Hearing, Language and Speech-DHLS)
సీట్ల సంఖ్య: AIISH లో ముప్పై(30), ఇతర స్టీడీ సెంటర్లలో ఇరవై ఎనిమిది (28)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ మెరిట్ (General Merit) -11, AIISH సెంటర్ లో అదనంగా మరో సీటు కేటాయిస్తారు. ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections)-03, ఎస్సీ (Scheduled Caste)-04 ఎస్టీ (Scheduled Tribe)-02, ఓబీసీ (Other Backward Class)-08.
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం లేదా కంప్యూటర్ సైన్స్ లో 12వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: జూలై 1, 2022 నాటికి 21 సంవత్సరాలు మించకూడదు.
ప్రోగామ్ వ్యవధి: ఒక్క సంవత్సరం
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు పది నెలల పాటు నెలకు రూ.250 చెల్లిస్తారు.

Bachelor Degree Programmes

ప్రోగ్రామ్ పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ఫాథాలజీ
(Bachelor of Audiology and Speech Language Pathology – (B.ASLP))
సీట్ల సంఖ్య: ఎనభై (80)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ కేటగిరీలో జనరల్-10, ఎఫ్ఎస్(సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్)-10, నార్త్ ఈస్ట్ స్టేట్ జనరల్-1, ఎస్ఎస్-1, డిప్లొమా ఇన్ ది ఏరియా అఫ్ స్పీచ్ అండ్ పాయరింగ్ జనరల్-1, ఎఫ్ఎస్-1, దివ్యాంగులు (ఆర్థోపెడిక్) జనరల్-1, ఎస్ఎస్-1, విదేశీ విద్యార్థులు జనరల్-3, ఎస్ఎస్-3, ఈడబ్ల్యూఎస్ జనరల్-4, ఎస్ఎస్-4, ఎస్సీ జనరల్-6, ఎఫ్ఎస్-6, ఎస్టీ జనరల్-3, ఎఫ్ఎస్-3, ఓబీసీ జనరల్-11, ఎస్ఎస్-11
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమెస్ట్రీతో పాటు గణితం లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా
ఎలాక్ట్రానిక్స్ లేదా సైకాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో అందుకు సమానమైన కోర్సును 50శాతం మార్కులతో పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది.
ప్రోగామ్ వ్యవధి: నాలుగు సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు, ఏడాది ఇంటర్న్ షిప్).
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడు సంవ్సరాలు పది నెలల పాటు నెలకు రూ.800 చెల్లిస్తారు. ఇంటర్న్ షిప్ సమయంలో నెలకు రూ.5వేలు చెల్లిస్తారు.

ప్రోగ్రామ్ పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్-స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్ మెంట్)
(Bachelor of Education – Special Education (Hearing Impairment) – B.Ed. Spl. Ed.(HI))
సీట్ల సంఖ్య: ఇరవై రెండు (22)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ కేటగిరీ-9, జనరల్ మెరిట్ లో జనరల్-2, ఎఫ్ఎస్-4, ఇన్ సర్వీస్/డిప్యూటేషన్ జనరల్ 2, దివ్యాంగులు (ఆర్థోపెడిక్) జనరల్-1, ఈడబ్ల్యూఎస్ జనరల్-1, ఎస్ఎస్-1, ఎస్సీ జనరల్ -2, ఎఫ్ఎస్-1, ఎస్టీ జనరల్-1, ఎఫ్ఎస్-1, ఓబీసీ జనరల్-3, ఎఫ్ఎస్-3 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది. విద్యార్హతల్లో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
వయసు: జూలై 1, 2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
ప్రోగామ్ వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు).
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు పది నెలల పాటు నెలకు రూ.400 చెల్లిస్తారు.

M.Sc Programmes

ప్రోగ్రామ్ లు: ఎం.ఎస్సీ (స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ) (M.Sc.(Speech-Language Pathology) ఎం.ఎస్సీ (ఆడియాలజీ) (M.Sc. (Audiology))
సీట్ల సంఖ్య: ఒక్కో ప్రోగామ్ లో నలభై నాలుగు (44)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ మెరిట్ లో జనరల్, ఎఫ్ఎస్-9, ఈడబ్ల్యూఎస్ జనరల్ 2, ఎఫ్ఎస్-2, ఎస్సీ జనరల్ 4, ఎస్ఎస్-3, ఎస్టీ జనరల్-2, ఎఫ్ఎస్-1, ఓబీసీ జనరల్-6, ఎఫ్ఎస్-6
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బీఏఎస్ఎల్పీ లేదా బీఎస్సీ (స్పీచ్ అండ్ హియరింగ్ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
ప్రోగామ్ వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు).
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు పది నెలల పాటు నెలకు రూ.1.300 చెల్లిస్తారు.

ప్రోగ్రామ్ పేరు: మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్ మెంట్) Master of Education Special Education (Hearing Impairment) – M.Ed. Spl. Ed. (HI)
సీట్ల సంఖ్య: ఇరవై రెండు (22)
రిజర్వేషన్ల ప్రకారం సీట్లు: జనరల్ మెరిట్ లో జనరల్ -3, ఎఫ్ఎస్-4, ఇన్ సర్వీస్/డిప్యూటేషన్ జనరల్-2, ఈడబ్ల్యూఎస్ జనరల్-1, ఎఫ్ఎస్-1, ఎస్సీ జనరల్-2, ఎఫ్ఎస్-1, ఎస్టీ జనరల్-1, ఎఫ్ఎస్-1, ఓబీసీ జనరల్-3, ఎఫ్ఎస్-3
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్ మెంట్) ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయసు: జూలై 1, 2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
ప్రోగామ్ వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు).
స్టైపెండ్: ప్రోగామ్ కు ఎంపికైన విద్యార్థులకు పది నెలల పాటు నెలకు రూ.650 చెల్లిస్తారు.

Application Fee

బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ, ఎంఎస్సీ(ఆడియాలజీ), ఎంస్పీ (స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకొనే జనరల్ అభ్యర్థులు రూ.925 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది. ఎం. ఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్
ఇంపెయిర్ మెంట్), బీ.ఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (హియరింగ్ ఇంపెయిర్ మెంట్), డిప్లొమా ఇన్ హియరింగ్ ఎయిడ్ అండ్ ఇయర్ మౌల్డ్ టెక్నాలజీ,
డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ హియరింగ్, లాంగ్వేజ్ అండ్ స్పీచ్ కోర్సులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు రూ.625 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.

How to Apply

B.ASLP, M.Sc. (Audiology/Speech – Language Pathology) ప్రోగామ్ లకు అభ్యర్థులు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ వెబ్ సైట్ (www.aiishmysore.in) వెబ్ సైట్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత నిర్ణీత ఫార్మాట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకొన్న తర్వాత హార్డ్ కాపీని ఇనిస్టిట్యూట్ కు పంపించాలి. ఇతర ప్రోగ్రామ్ లకు ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకొని దానిని పూర్తిగా నింపి, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి ఇనిస్టిట్యూట్ కు పంపించాలి.

Important Dates

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15, 2022
హార్డ్ కాపీ చేరాల్సిన చివరి తేదీ: జూలై 31, 2022
ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ: జూలై 24, 2022 (ఆదివారం)

హార్డ్ కాపీ పంపించాల్సిన చిరునామా:
ది డైరెక్టర్, ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, మానసగంగోత్రి, మైసూర్, కర్ణాటక-570006

– Admissions in AIISH Mysore