Free Coaching in TSSCSCA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Free Coaching in TSSCSC : తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ (Telangana State Scheduled Castes Study Circle-TSSCSC) 2022-23 కాలానికి గాను బ్యాంకింగ్ (Banking), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తోపాటు స్టేట్ సర్వీసెస్ (TSPSC) ఉద్యోగాలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ (SC, ST, BC, Minority) అభ్యర్థులకు ఐదు (05) నెలల ఫౌండేషన్ కోర్సు (Foundation Course) లో ఉచిత కోచింగ్ (Free Coaching) ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Rc.No.TSSCSC/35/2022) జారీ చేసింది. ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో పదకొండు (11) శిక్షణ కేంద్రాల్లో కోచింగ్ ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Number of Seats

రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో కోచింగ్ ఇస్తారు. ఒక్కో శిక్షణ కేంద్రంలో వంద (100) మందికి శిక్షణ ఇస్తారు.
నల్గొండలోని శిక్షణ కేంద్రంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులకు, వరంగల్ లోని శిక్షణ కేంద్రంలో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల అభ్యర్థులకు, కరీంనగర్ లోని శిక్షణ కేంద్రంలో కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అభ్యర్థులకు, మహబూబ్ నగర్ లోని శిక్షణ కేంద్రంలో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల అభ్యర్థులకు, నిజామాబాద్ లోని శిక్షణ కేంద్రంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అభ్యర్థులకు, ఆదిలాబాద్ లోని  శిక్షణ కేంద్రంలో నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులకు, ఖమ్మంలోని శిక్షణ కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు, రంగారెడ్డిలోని శిక్షణ కేంద్రంలో మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభ్యర్థులకు, సిద్దిపేటలోని శిక్షణ కేంద్రంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు, సూర్యాపేట జిల్లాలోని శిక్షణ కేంద్రంలో సూర్యాపేట జిల్లా అభ్యర్థులకు, జగిత్వాల జిల్లాలోని శిక్షణ కేంద్రంలో జగిత్యాల జిల్లా అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.

Eligibility

అభ్యర్థులు ఏదైనా విభాగంలో మూడేళ్ల గ్రాడ్యుయేషన్ (B.A/ B.Com/ B.Sc) లేదా నాలుగేళ్ల ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ (B.Tech/B.Pharma/ B.Sc(Ag) ఉత్తీర్ణులైనవారు అర్హులు.
అభ్యర్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక (సెప్టెంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు) ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు.
ఇది ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్సు. కాబట్టి అభ్యర్థులు 2022-23 సంవత్సరంలో ఇతర విద్యా సంస్థల్లో ఎలాంటి కోర్సులు అభ్యసించకూడదు. అలాగే, ఎలాంటి ఉద్యోగం చేయకూడదు.
మరోచోట ఇలాంటి ప్రభుత్వ కోచింగ్ తీసుకోకూడదు.
అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీసెస్, ఆర్ఆర్డీ, ఎస్సెస్సీ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
ఇంతకు ముందు హైదరాబాద్ లోగానీ, జిల్లాల్లో గానీ ఐదు (05) నెలల ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకొని ఉండకూడదు.

Age Limit

  • బీసీ అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • దివ్యాంగ అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉండాలి.

Entrance Examination

  • ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ టైప్ లో మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
  • 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులు ఇస్తారు. పరీక్ష 2 గంటలలో రాయాల్సి ఉంటుంది.
  • జనరల్ స్టడీస్ నుంచి 55 ప్రశ్నలు, జనరల్ ఎబిలిటీ నుంచి 45 ప్రశ్నలు ఇస్తారు.
  • జనరల్ స్టడీస్ లో కరెంట్ అఫైర్స్, భారత దేశ, తెలంగాణ చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ అండ్ స్టేట్ ఎకానమీ, జనరల్ సైన్స్ (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సోషల్ ఎక్స్ క్లూజన్, ఇష్యూస్ అండ్ పాలసీస్) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • అలాగే, జనరల్ ఎబిలిటీలో అర్థమెటిక్, రీజనింగ్, అప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మరియు తెలుగు భాషలలో ఉంటుంది.
  • ప్రవేశ పరీక్ష అక్టోబర్ 02, 2022 తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.

How to Apply

  • ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్ కు చెందిన వెబ్ సైట్ (http://tsstudycircle.co.in/) ను ఓపెన్ చేయాలి.
  • అందులో Foundation Course Detailed Notification దాని పక్కన Apply Online స్క్రోల్ అవుతుంటాయి.
  • అందులో Apply Online పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మళ్లీ Apply Online పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలన్నీ పూరించాలి.
  • అభ్యర్థి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ మరియు వయసు, జెండర్, కులం మరియు ఉప కులం, నేటివ్ జిల్లా, దివ్యాంగులా?, వైవాహిక స్థితి, తండ్రి/గార్డియన్ వార్షిక ఆదాయం, గ్రాడ్యుయేషన్ లో ఏ సబ్జెక్టు? ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
  • అలాగే, అభ్యర్థి చిరునామా, పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు హాల్ టికెట్ నెంబర్, పూర్తి మార్కులు సాధించిన మార్కులు, గ్రేడ్, పర్సంటేజీ, పాసైన సంవత్సరం, చదివిన సంస్థ, ప్రాంతం, బోర్డు/ యూనివర్సిటీ తదితర వివరాలు తెలియజేయాలి.
  • ఇంతకు ముందు హైదరాబాద్ లో గానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని ఎస్సీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకొని ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేసి పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి.
  • రాత పరీక్ష కేంద్రాన్ని అభ్యర్థులు తమ నేటివ్ జిల్లానే ఎంచుకోవాలి.
  • జిల్లాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉండదు.
  • అనంతరం ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
    1. అభ్యర్థి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
    2. అభ్యర్థి సంతకం
    3. ఎస్సెస్సీ మార్కుల మెమో
    4. కులం సర్టిఫికెట్
    5. ఇటీవలే తీసుకున్న ఆదాయం సర్టిఫికెట్
    6. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్
    7. డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమోలు
    8. ఆధార్ కార్డ్
  • పై అన్ని సర్టిఫికెట్లు స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో 1 ఎంబీ సైజ్ లోపు ఉండేలా చూసుకొని అప్ లోడ్ చేయాలి.
  • సర్టిఫికెట్లలో ఉన్న సమాచారాన్ని మాత్రమే ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి.
  • అడ్మిషన్ సమయంలో సర్టిఫికెట్లను, ఆన్ లైన్ ఫాంలో ఇచ్చిన సమాచారాన్ని చెక్ చేస్తారు.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2022
ప్రవేశ పరీక్ష: అక్టోబర్ 02, 2022
కోచింగ్ వ్యవధి : ఐదు (05) నెలలు (అక్టోబర్ 19, 2022 నుంచి మార్చి 18, 2022 వరకు)

పూర్తి వివరాలకు ఆయా శిక్షణ కేంద్రాల డెరెక్టర్లను ఫోన్ లో సంప్రదించవచ్చు. 
నల్గొండ – 9396621492, వరంగల్ – 9866918656, కరీంనగర్ – 9885218053, మహబూబ్ నగర్ – 8500334470, నిజామాబాద్ – 9491468799, ఆదిలాబాద్ – 9494149416, ఖమ్మం – 9848494290, రంగారెడ్డి – 9000919109, సూర్యాపేట – 9989129935, సిద్దిపేట – 7989332923, జగిత్యాల – 9959264770.

– Free Coaching in TSSCSC