Jobs in NIMSA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in NIMS : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) సైంటిస్ట్-బీ (నాన్ మెడికల్) (Scientist B (Non-Med)), రిసెర్చ్ అసిస్టెంట్ (Research Assistant), లేబోరేటరీ టెక్నీషియన్ (Laboratory Technician), డాటా ఎంట్రీ ఆపరేటర్ (Data Entry Operator) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Rc.No.SRC/AC-3/582/2022) జారీ చేసింది. మొత్తం ఐదు (05) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పనిలో అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

1. Scientist B (Non-Med) – 01
2. Research Assistant – 01
3. Laboratory Technician – 02
4. Data Entry Operator – 01

Scientist B (Non-Med)

అర్హతలు: మైక్రోబయాలజీ/ మాలిక్యులర్ బయాలజీలో ఫస్ట్ క్లాస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. అలాగే, మైక్రోబయాలజీ/ మాలిక్యులర్ బయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ ఫార్మకాలజీలో సెకండ్ క్లాస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై.. గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మైక్రోబయాలజీ/ మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్‌డీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: మాలిక్యులర్ బయాలజీ విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
వయసు : 35 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.54,300

Research Assistant

అర్హతలు: లైఫ్ సైన్సెస్ లో ఎమ్మెస్సీ చేసిన వారు అర్హులు.
అనుభవం: గుర్తింపు పొందిన సంస్థలో మెడికల్ ఫీల్డ్ లో రిసెర్చ్ అనుభవం ఉండాలి.
వయసు : 30 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000

Laboratory Technician

అర్హతలు: సైన్స్ సబ్జెక్టులో ఇంటర్మీడియట్ పాసై.. మెడికల్ లాబోరేటరీ టెక్నాలజీలో రెండు సంవత్సరాల డిప్లొమా చేసిన వారు అర్హులు.
అనుభవం: గుర్తింపు పొందిన సంస్థలో క్లినికల్ మైక్రోబయాలజీ లాబోరేటరీలో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయసు: 30 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000

Data Entry Operator

అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి DOEACC ‘A’ స్థాయితో గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ప్రభుత్వ, అటానమస్, PSU లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థలో EDP పనిలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు. కంప్యూటర్ స్పీడ్ పరీక్షలోనూ ఉత్తీర్ణులు కావాలి.
అనుభవం: డాటా ఎంట్రీ విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. హెల్త్ కేర్ విభాగంలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 28 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.18,000

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో ఎడమవైపున స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Notification for Scientist-B – Research Assistant – Laboratory Technicians and Data Entry Operator పై క్లిక్ చేయాలి. అందులో Download పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో దిగువ భాగంలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకొని అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు అటెస్ట్ చేయించి జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఈ కింది అడ్రస్ కు పోస్టు ద్వారా గానీ, నేరుగా గానీ వెళ్లి అందజేయాలి.
The Dean,
Nizam’s Institute of Medical Sciences,
Panjagutta, Hyderabad – 500082, TS.

Importanat Points

ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి భవిష్యత్తులో నిమ్స్ చేపట్టబోయే రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ఇంటర్వ్యూకు అలాగే, జాయినింగ్ కోసం వచ్చే సమయంలో టీఏ, డీఏ లాంటివి ఇవ్వరు. అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ : అక్టోబ‌ర్ 12, 2022 (సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు)