Jobs in NIAB : హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (National Institute of Animal Biotechnology-NIAB) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ (Direct recruitment) ద్వారా సర్వీస్ & మెయింటెనెన్స్ ఇంజినీర్ (Service & Maintenance Engineer), ఆఫీస్ అసిస్టెంట్ (Office Assistants), క్లర్క్ (Clerks), సపోర్టింగ్ స్టాఫ్ (Supporting Staff) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.36/2022) జారీ చేసింది. మొత్తం ఏడు (07) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts & Vacancies
1. Service & Maintenance Engineer – 01 (UR)
2. Office Assistants – 02 (UR-01, OBC-01)
3. Supporting Staff – 02 (UR)
4. Clerks – 02 (UR)
Service & Maintenance Engineer
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీలో సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు.
అనుభవం: HT/LT ఎలక్ట్రికల్ పరికరాలు/ఎయిర్ కండిషనింగ్ పరికరాలు/భవనాలు తదితర వాటి నిర్వహణలో మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి. పబ్లిక్ అండర్ టేకింగ్ లు/సంస్థల్లో నిర్మాణ నియమాలు/మాన్యువల్ పై పరిజ్ఞానం ఉన్నవారికి, R&D సంస్థలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 35 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: పే లెవల్ 7 (7వ సెంట్రల్ పే కమిషన్ (7సీపీసీ) ప్రకారం చెల్లిస్తారు)
Office Assistants
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు.
అనుభవం: ప్రభుత్వ సంస్థలో అడ్మినిస్ట్రేషన్/ఎస్టాబ్లిష్ మెంట్/అకౌంట్స్/స్టోర్స్ పర్చేస్/ అకడమిక్ లో ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన అనుభవం
ఉండాలి. టైప్ రైటింగ్ లోయర్ లో నిమిషానికి 30 ఇంగ్లిష్/హిందీ పదాలు టైప్ చేయగలిగేవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 35 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: పే లెవల్ 6 (7వ సెంట్రల్ పే కమిషన్ (సీపీసీ) ప్రకారం చెల్లిస్తారు)
Supporting Staff
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీలో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు.
అనుభవం: ప్రభుత్వ సంస్థలో అడ్మినిస్ట్రేషన్/ఎస్టాబ్లిష్ మెంట్/అకౌంట్స్/స్టోర్స్/ పర్చేస్/అకడమిక్ లో ఐదు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి. టైప్ రైటింగ్ లోయర్ లో నిమిషానికి 30 ఇంగ్లిష్/హిందీ పదాలు టైప్ చేయగలిగేవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 25 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: పే లెవల్ 5 (7వ సెంట్రల్ పే కమిషన్ (7సీపీసీ) ప్రకారం చెల్లిస్తారు)
Clerks
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే, టైప్ రైటింగ్ లోయర్ లో నిమిషానికి 30 ఇంగ్లిష్/ హిందీ పదాలు టైప్ చేయగలగాలి.
వయసు: 25 సంవత్సరాల లోపు ఉండాలి.
జీతం: పే లెవల్ 4 (7వ సెంట్రల్ పే కమిషన్ (7సీపీసీ) ప్రకారం చెల్లిస్తారు)
Application fee
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ రిజర్వుడ్ అభ్యర్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని ఏదైనా జాతీయ బ్యాంకులో మూడు నెలల కాల పరిమితి వరకు చెల్లుబాటు అయ్యేలా ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, హైదరాబాద్ పేరిట డీడీ తీయాలి. గచ్చిబౌలిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (కోడ్ నెం.PUNB0498700) లో తీయవచ్చు. లేదా ఇనిస్టిట్యూట్ లింక్ (https://epayments.in.worldline.com/niab.) ద్వారా ఆన్ లైన్ లో కూడా చెల్లించవచ్చు. దివ్యాంగులు, డిపార్ట్ మెంట్ అభ్యర్థులు అప్లికేషన్
ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ వెబ్సైట్ (www.niab.res.in) ను ఓపెన్ చేసి అందులో దిగువన ఎడమవైపున NEWS విభాగంలో స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Recruitment of Service & Maintenance Engineer, Office Assistants, Clerks & Supporting Staff నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. అందులో Apply Online పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అందులో If you are a fresh user, click here to register పై క్లిక్ చేసి యూజర్ నేమ్, ఈ-మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Online Payment Link పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అనంతరం మళ్లీ Apply Online పై క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకున్న యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, ఫొటో, విద్యార్హతలు, అనుభవం, కులం, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్ లోడ్ చేయాలి.
డీడీ తీసిన అభ్యర్థులు డీడీ వెనక భాగంలో ప్రకటన సంఖ్య (Advt.No.36/2022), అభ్యర్థి పేరు, కేటగిరీ, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు రాసి, దానిని ఎనవలప్ కవర్ లో పెట్టి.. కవర్ పైన దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు రాసి ఈ కింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించాలి.
The Director,
National Institute of Animal Biotechnology.
Sy.No. 37, Opp. Journalist Colony,
Extended Q City Road, Gowlidoddi, Gachibowli,
Hyderabad, Telangana, India 500032.
Importanat Points
- ఈ పోస్టులకు భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది.
- రెండు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
- పైన సూచించిన వేతనంతో పాటు అలవెన్సులు ఉంటాయి.
- ప్రస్తుతం ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
- వయసు, అనుభవం ఆన్ లైన్ దరఖాస్తు ముగింపు తేదీ నాటికి లెక్కిస్తారు.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
- ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రక్రియలో ఏమైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే [email protected]. కు మెయిల్ చేసి పరిష్కారం పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తునకు చివరి తేదీ : అక్టోబర్ 25, 2022 సాయంత్రం 5గంటల వరకు
– Jobs in NIAB