Documents for Staff Nurse Posts : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,204 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసుకోబోయే ముందే అభ్యర్థులు ఈ కింది సర్టిఫికెట్లు తీసుకొని ఉండాలి.
Required Certificates
1. ఆధార్ కార్డు
2. ఎస్సెస్సీ మెమో (డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం)
3. జీఎన్ఎం లేదా బీ.ఎస్సీ(నర్సింగ్) సర్టిఫికెట్ (ప్రొవిజినల్)
4. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
5. ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అభ్యర్థులు)
6. స్టడీ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
7. ఒకవేళ ప్రైవేటు స్కూళ్లలో చదివినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
8. కులం సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు)
9. నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ (బీసీ అభ్యర్థులు మాత్రమే)
10. ఆదాయం మరియు అనెట్ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే)
11. స్పోర్ట్స్ సర్టిఫికెట్ (స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కలిగిన వారు మాత్రమే)
12. సదరమ్ సర్టిఫికెట్ (దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే)
13. సర్వీస్ సర్టిఫికెట్ (ఎన్ సీ సీ అభ్యర్థులు మాత్రమే)
14. సర్వీస్ సర్టిఫికెట్ (ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు)
15. అభ్యర్థి ఫొటో (జేపీజీ/జేపీఈజీ/పీఎనీ ఫార్మాట్లో)
16. అభ్యర్థి సంతకం (జేపీజీ/జేపీఈజీ/ పీఎన్ ఫార్మాట్లో)
పై సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్ కాపీలను మాత్రమే అప్ లోడ్ చేయాలి. క్లియర్ గా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. ఇవే సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Experience Certificate (Contract/Out Sourcing Employees)
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ స్కీమ్ లలో ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారు, గతంలో పనిచేసిన వారు ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ను బట్టే వారికి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు కేటాయిస్తారు. కనీసం 6 నెలలు పనిచేస్తేనే ఈ మార్కులు కేటాయిస్తారు. అయితే, ఈ మార్కులకు సంబంధించి సంబంధిత విభాగం హెచ్ వో డీ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సంబంధిత అభ్యర్థులు సంబంధిత విభాగం హెచ్ వో డీకి దరఖాస్తు చేసుకోవాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ నోటిఫికేషన్ లో అందుబాటులో ఉంది. దానిని డౌన్ లోడ్ చేసుకొని వివరాలు పూరించి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వారు ఇచ్చిన సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాలి.
Competent authority to issue Experience Certificate
సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, నేషనల్ హెల్త్ మిషన్, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కంట్రోల్ నడిచే ప్రోగ్రామ్ లలో పనిచేస్తున వారు సంబంధిత జిల్లా వైద్యాధికారి (District Medical and Health Officer) జారీ చేసిన ధ్రువీకరణ పత్రం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, టీవీవీ పరిధిలోని హాస్పిటల్స్ లో ఎన్ హెచ్ ఎం స్కీమ్ లో ఎంసీహెచ్ బ్లాకులు, ఎస్ ఎన్ సీ యూ, సీమాంక్ యూనిట్లలో పనిచేసే వారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరిండెంట్ జారీ చేసిన సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి. డీఎంఈ పరిధిలోని హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారు సంబంధిత టీచింగ్ హాస్పిటల్ సూపరిండెంట్ జారీ చేసిన సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
Teaching and specialty hospitals
టీచింగ్ మరియు స్పెషాలిటీ హాస్పిటల్స్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారు సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ జారీ చేసిన సర్టిఫికెట్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పనిచేస్తున్న వారు డైరెక్టర్, నిమ్స్ జారీ చేసిన సర్టిఫికెట్, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ లో పనిచేస్తున్న వారు డైరెక్టర్, MNJIO&RCC జారీ చేసిన సర్టిఫికెట్, IPM కింద ల్యాబ్‌లలో పనిచేస్తున్న వారు డైరెక్టర్, IPM జారీ చేసిన సర్టిఫికెట్, తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పనిచేస్తున్న వారు PD, TSACS జారీ చేసిన సర్టిఫికెట్, TSRTC హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారు MD, TSRTC జారీ చేసిన సర్టిఫికెట్, సింగరేణి కాలరీస్ కంపెనీ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న వారు CMD, SCCL జారీ చేసిన సర్టిఫికెట్, ESI ఆసుపత్రులలో పనిచేస్తున్న వారు డైరెక్టర్, ESI జారీ చేసిన సర్టిఫికెట్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ & ఎంప్లాయీ అండ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ లలో పనిచేస్తున్న వారు CEO, AHCT జారీ చేసిన సర్టిఫికెట్, ఆయుష్ లో పనిచేస్తున్న వారు డైరెక్టర్ ఆయుష్ జారీ చేసిన సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి
Non-Creamy Layer Certificate
నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ ప్రొఫార్మాను కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు.
దానిని కూడా డౌన్ లోడ్ చేసుకొని అదే ఫార్మాట్ లో తీసుకోవాలి.
ఈ సర్టిఫికెట్ తహసీల్దార్ ఆఫీసులో ఇస్తారు. ఇది మ్యానువల్ గా రాసి ఇస్తారు.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన ఆదాయం మరియు అసెట్ సర్టిఫికెట్ ప్రొఫార్మాను కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు.
దానిని కూడా డౌన్ లోడ్ చేసుకొని అదే ఫార్మాట్ లో తీసుకోవాలి.
ఈ సర్టిఫికెట్ ను కూడా తహసీల్దార్ ఆఫీసులో ఇస్తారు.
– Documents for Staff Nurse Posts
Websit : https://mhsrb.telangana.gov.in/