Admissions in Basara RGUKT : తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Rajiv Gandhi University of Knowledge Technologies-RGUKT) (
Basara IIIT) 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగాం (6-Year Integrated B. Tech Program)లో
ప్రవేశాలకు షెడ్యూల్ జారీ చేసింది. జూన్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. జూన్ 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Eligibility
- 2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫస్ట్ అటెంప్ట్ లో పాసైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు.
- భారతీయ పౌరసత్వం కలిగి ఉండి ఇతర దేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్లోబల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకొన్న తెలంగాణ విద్యార్థులు కూడా జనరల్ కేటగిరీగా పరిగణించబడతారు.
Admission Procedure
- 2023–24 విద్యాసంవత్సరంలో 1500 అడ్మిషన్లను కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా మరో 150 సీట్లు ఉంటాయి.
- విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ (GPA)లో మెరిట్, మరియు ప్రతి సబ్జెక్టులో పొందిన గ్రేడ్ ఆధారంగా, అలాగే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
- ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లతో పాటు నాన్ రెసిడెన్షియల్ సర్కారు స్కూళ్లలో చదివిన విద్యార్థులకు 10వ తరగతిలో సాధించిన జీపీఏకి అదనంగా 0.4 స్కోర్ జోడిస్తారు.
- మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్ర (లోకల్) విద్యార్థులకు కేటాయిస్తారు.
- మిగిలిన 15 శాతం సీట్లు అన్ రిజర్వుడ్ కేటగిరీకి కేటాయిచేస్తారు.
- వీటిని మెరిట్ ఆధారంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
-
జీపీఏ పాయింట్లు సేమ్ వచ్చిన స్టూడెంట్లకు మ్యాథ్స్ లో వచ్చిన గ్రేడ్ ఆధారంగా, ఆ తర్వాత సైన్స్, ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టుల్లో వచ్చిన జీపీఏ ఆధారంగా సీట్లు అలాట్ చేస్తారు.
-
అప్పటికీ సేమ్ మార్కులుంటే పుట్టిన తేదీ ఆధారంగా సీనియర్లకు అవకాశం ఇస్తారు.
Application Fee
దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర రాష్ట్రాలు, గ్లోబల్ విద్యార్థులు రూ.1,500, ఎన్ఆర్ఐ, ఇంటర్నేషనల్ విద్యార్థులు వంద యూఎస్ డాలర్లు చెల్లించాలి.
Last Date
- జనరల్ కేటగిరీ విద్యార్థులు జూన్ 19లోగా అప్లై చేసుకోవాలి.
- దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎన్సీసీ కేటగిరీ విద్యార్థులు జూన్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
- సెలెక్షన్ లిస్టును జూన్ 26న ప్రకటిస్తారు. జులై 1 నుంచి కౌన్సెలింగ్ ఉంటుంది.
- అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే జూన్ 1వ తేదీన హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు.
- ఫోన్ నెంబర్లు ఇస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
– Admissions in Basara RGUKT