Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare Residential Educational Institutions Society – TSWREIS) ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (Centre of Excellence – COEs) కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామన్ ఎంట్రెన్స్-–2024 ద్వారా వీటిలో ప్రవేశాలు కల్పిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో ఇంగ్లిష్ మీడియంలో ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ(IIT), నీట్ (NEET) తదితర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
College Wise Seats
Boys Institutions :
1.Gowlidoddi, Rangareddy District – MPC – 120, BPC -120
2.Chiklur, Rangareddy District – MPC – 40, BPC – 40
3.Ibrahimpatnam, Rangareddy District – MEC – 40, CEC – 40
4.Hayathnagar, Rangareddy District – MPC – 40, BPC – 40
5.Alugunoor, Karimnagar District – MPC – 40, BPC – 40
6.Manakondur, Karimnagar District – MPC – 40, BPC – 40
7.Shaikpet, Hyderabad District – MPC – 40, BPC – 40
8.Bellampalli, Mancherial District – MPC – 40, BPC – 40
9.Palvancha, Bhadradri Kothagudem District – MPC – 40, BPC – 40
10.Wardhannapet, Warangal Rural District – MPC – 40, BPC – 40
11.Hathnoora JC, Sangareddy District – MPC – 40, BPC – 40
12.Kondapur, Sangareddy District – MPC – 40, BPC – 40
13.JP Nagar, Nagarkurnool District – MPC – 40, BPC – 40
14.Madanapuram, Wanaparthy District – MPC – 40, BPC – 40
15.Itikyala, Jogulamba Gadwala District – MPC – 40, BPC – 40
16.Bhiknoor, Kamareddy District – MPC – 40, BPC – 40
17.Bhongir, Yadadri-Bhongir District – MPC – 40, BPC – 40
18. Chandur at SLBC Nalgonda, Nalgonda District – MPC – 40, BPC – 40
Girls Institutions :
1.Gowlidoddi, Rangareddy District – MPC – 120, BPC -120, MEC – 80
2.Alugunoor, Karimnagar District – MPC – 40, BPC – 40
3.Mahendrahills, Hyderabad District – MPC – 40, BPC – 40
4.Narsingi, Rangareddy District – MPC – 40, BPC – 40
5.Adilabad, Adilabad District – MPC – 40, BPC – 40
6.Khammam JC, Khammam District – MPC – 80, BPC – 80
7.Danavaigudem, Khammam District – MPC – 40, BPC – 40
8.Hanumakonda/Madikonda, Warangal Urban District – MPC – 40, BPC – 40
9.RK Puram, Hyderabad District – MPC – 40, BPC – 40
10.Kammadanam, Rangareddy District – MPC – 40, BPC – 40
11.Saroornagar, Hyderabad District – MPC – 40, BPC – 40
12.Nallakanche, Rangareddy District – MPC – 40, BPC – 40
14.13.Vikarabad/Kothagadi, Vikarabad District – MPC – 40, BPC – 40
15.Mittapally, Siddipet District – MPC – 40, BPC – 40
16.Mulugu, Siddipet District – MPC – 40, BPC – 40
17.Chitkul, Mahaboobnagar District – MPC – 40, BPC – 40
18.Jadcherla, Mahaboobnagar District – MPC – 40, BPC – 40
19.Dharmaram, Nizamabad District – MPC – 40, BPC – 40
20.GV Gudem (Nalgonda), Nalgonda District – MPC – 40, BPC – 40
21.Kistapur Medchal, Medchal District – MPC – 40, BPC – 40
Eligibility
- మార్చి-2024లో SSC పబ్లిక్ ఎగ్జామ్స్‌కు హాజరు కాబోయే విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
- రెగ్యులర్ ప్రాతిపదికన ICSE/CBSEలలో 10వ తరగతి చదువుతున్న వారు కూడా అర్హులే. అయితే, విద్యార్థులు తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలి.
- విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించకూడదు.
- ఇంగ్లిష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Age Limit
- విద్యార్థుల వయసు ఆగస్టు 31, 2024 వరకు 17 సంవత్సరాలు మించకూడదు.
- ఎస్సీ, ఎస్టీ, కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
Community Wise Reservation
ఎంట్రెన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన విద్యార్థులలో ఎస్సీ విద్యార్థులకు 30 సీట్లు (75 శాతం), ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు ఒక సీటు (2 శాతం), ఎస్టీ విద్యార్థులకు 02 సీట్లు (6 శాతం), బీసీ విద్యార్థులకు 05 సీట్లు (12 శాతం), మైనారిటీ విద్యార్థులకు ఒక సీటు (3 శాతం), ఓసీ/ఈబీసీ విద్యార్థులకు ఒక సీటు (2 శాతం) కేటాయిస్తారు.
How to Apply
- ఆసక్తి కలిగిన విద్యార్థులు TSWREIS వెబ్ సైట్లు (www.tswreis.ac.in or https://tsswreisjc.cgg.gov.in.) ఓపెన్ చేయాలి.
- అందులో Online Application TSWR COE CET – 2023 పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Online Payment Link పై క్లిక్ చేయాలి.
- అందులో వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Online Application Link పై క్లిక్ చేసి అందులో వివరాలు ఎంటర్ చేసి, ఫొటో, సంతకం అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 15, జనవరి 2024.
Website : https://www.tswreis.ac.in/