Jobs in Jangaon Court

Jobs in Jangaon Court : జనగామ జిల్లా కేంద్రంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (పోక్సో) (Fast Track Special Court (POCSO)) లో సీనియర్ సూపరింటెండెంట్ (హెడ్ క్లర్క్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Dis.No.765/2022/Admn) విడుదైలంది. మొత్తం పన్నెండు (12) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. పోస్టులను బట్టి టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, డ్రైవింగ్ టెస్ట్ లతో పాటు ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో రిటైర్డ్ జ్యుడీషియల్ ఎంప్లాయిస్ కు ప్రాధాన్యం ఇస్తారు.

Details of Posts

1. Senior Superintendent (Head Clerk)
2. Stenographer Grade-III
3. Senior Assistant
4. Junior Assistant
5. Typist
6. Driver
7. Office Subordinate/ Attender

Senior Superintendent (Head Clerk)

పోస్టుల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
జీతం: నెలకు రూ.40,000

Stenographer Grade-III

పోస్టుల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ మరియు ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ లో తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ పరీక్షలో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులైనవారు అందుబాటులో లేకుంటే లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులైనవారికి అవకాశం కల్పిస్తారు. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
జీతం: నెలకు రూ.22,750

Senior Assistant

పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.22,750

Junior Assistant

పోస్టుల సంఖ్య: రెండు (02)
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
జీతం: నెలకు రూ.19,500

Typist

పోస్టుల సంఖ్య : రెండు (02)
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లో తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఎగ్జామినేషన్ పరీక్షలో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులైనవారు అందుబాటులో లేకుంటే లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులైనవారికి అవకాశం కల్పిస్తారు. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
జీతం: నెలకు రూ.19,500

Driver

పోస్టుల సంఖ్య: ఒకటి (01)
అర్హతలు: పదో తరగతి పాసై ఉండాలి. తెలుగు మరియు ఉర్దూ/ హిందీ లేదా ఇంగ్లిష్ లో చదవడం రాయడం వచ్చి ఉండాలి. అలాగే, లైట్ మోటార్
వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
జీతం: నెలకు రూ.19,500

Office Subordinate/ Attender

పోస్టుల సంఖ్య: నాలుగు (04)
అర్హతలు: 7వ తరగతి నుంచి 10వ తరగతి ఏదైనా ఒక పరీక్ష పాసై ఉండాలి. పదో తరగతి కంటే పై చదువులు చదివినవారు అనర్హులు.
జీతం: నెలకు రూ.15,600

Selection Criteria

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -3, టైపిస్ట్ ఉద్యోగాలకు టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ లో పరీక్ష నిర్వహించి అందులో క్వాలిఫై అయినవారికి ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
డ్రైవర్ పోస్టుకు డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి క్వాలిఫై అయినవారికి ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్టులకు 20 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే విద్యార్హతల్లో మార్కుల ఆధారంగా షార్ట్ చేసి అర్హులైనవారిని ఓరల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

Age Limit

ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్
అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు https://districts.ecourts.gov.in/jangoan లింక్ ను ఓపెన్ చేయాలి. అందులో స్క్రోల్ అవుతున్న Applications are invited from the Retired Judicial Employees and also from the Outsiders of eligible Candidates of Jangaon District. నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి. అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ఎంప్లాయి మెంట్ కార్డు, లోకల్, నాన్ లోకల్ సర్టిఫికెట్ అటెస్టేషన్ చేయించి జతచేయాలి. అలాగే, రూ.25 సెల్ఫ్ అడ్రస్ రిజిస్టర్డ్ పోస్టు కవర్ కూడా పెట్టాలి. ఈ అన్ని సర్టిఫికెట్లు సీల్డ్ కవర్ లో పెట్టి ఆ కవర్ ను నవంబర్ 04, 2022 సాయంత్రం 5 గంటల లోపు చేరేలా Principal Disrict & Sessions Judge, Nizamabad చిరునామాకు రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ పంపించాలి.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైన.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • జనగామ జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు పనిచేయాల్సి ఉంటుంది.

– Jobs in Jangaon Court