Jobs in Mamnoor KVKA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in Mamnoor KVK : పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(PV Narasimha Rao Telangana Veterinary University-TSVU)కి చెందిన‌ వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Vigyana Kendra(KVK), Mamnoor, Warangal)లో వెటర్నరీ మెడిసిన్ (Veterinary Medicine), యానిమల్ సైన్సెస్ (Animal Sciences), ప్లాంట్ ప్రొటెక్షన్ (Plant Protection), ఫిషరీస్ (Fisheries) విభాగాలలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ (Subject Matter Specialist-SMS) ఉద్యోగాల భర్తీకి యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం నాలుగు (04) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

Posts & Vacancies

1. Subject Matter Specialist / T6 (Veterinary) – 01
2. Subject Matter Specialist / T6 (Veterinary Medicine) – 01
3. Subject Matter Specialist / T6 (Plant Protection) – 01
4. Subject Matter Specialist / T6 (Fisheries) – 01

Educational Qualifications

1.Subject Matter Specialist (Veterinary) :

  • Bachelor degree in Veterinary Science (5 Years duration)
  • MVSc degree in the field of LPM/ AGB / ANN / Veterinary & AH Extension

2.Subject Matter Specialist (Veterinary Medicine) :

  • Bachelor degree in Veterinary Science (5 Years duration)
  • MVSc degree in the field of Veterinary Medicine

3.Subject Matter Specialist (Plant Protection) :

  • Bachelor degree in Agriculture (4 Years duration) from ICAR accredited University.
  • Master’s degree in the subject of Agriculture Entomology / Pathology from ICAR accredited University.

4.Subject Matter Specialist (Fisheries) :

  • Bachelor degree in Fisheries Science (4 Years duration) from ICAR accredited University.
  • Master’s degree in the subject of Aquaculture from ICAR accredited University.
  • పై పోస్టులన్నింటికీ NET ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
  • అభ్యర్థులకు తెలుగులో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

Salaray

ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 జీతం ఇస్తారు. అదే విధంగా DA మరియు HRA కూడా చెల్లిస్తారు.

How to Apply

ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వెబ్ సైట్ (https://tsvu.nic.in/) లో నోటిఫికేషన్ తో పాటు పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అన్ని ఒరిజినల్ ధ్రుపత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం షార్ట్ లిస్టింగ్ చేసి అర్హులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.

Interview Date, Time, Venue

ఈ పోస్టుల ఎంపికకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో అక్టోబర్ 10, 2022న ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత అభ్యర్థి పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి ఇవ్వరు. తమ
  • సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.

Interview Date, Time : 10.10.2022, 11 AM

Venue :
Administrative Building,
PV Narasimha Rao Telangana Veterinary University, Rajendranagar, Hyderabad – 500 030.

– Jobs in Mamnoor KVK