Jobs in Space Central Schools : భారత ప్రభుత్వ (Government of India) స్పేస్ డిపార్ట్ మెంట్ (Department of Space) పరిధిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (Indian Space Research Organisation-ISRO) కు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో సతీష్ ధావన్ స్పేస్ రిసెర్చ్ అర్గనైజేషన్ (Satish Dhawan Space Centre – SDSC SHAR) ఆధ్వర్యంలో శ్రీహరికోట, సూళ్లూరుపేటలో కొనసాగుతున్న స్పేస్ సెంట్రల్ స్కూల్స్ (Space Central Schools) లో పీజీటీ (PGT), టీజీటీ (TGT), ప్రైమరీ టీచర్ (Primary Teacher) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advertisement No. SDSC SHAR/RMT/01/2022) జారీ చేసింది. మొత్తం 19 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts & Vacancies
1. Post Graduate Teacher – 05
- PGT (Mathematics) – 02 (UR – 01, OBC – 01)
- PGT (Physics) – 01 (UR)
- PGT (Biology) – 01 (SC)
- PGT (Chemistry) – 01 (UR)
2. Trained Graduate Teacher – 09
- TGT (Mathematics) – 02 (UR – 01, EWS – 01)
- TGT (Hindi) – 02 (UR – 01, OBC – 01)
- TGT (English) – 01 (UR)
- TGT (Chemistry) – 01 (UR)
- TGT (Biology) – 01 (UR)
- TGT (PET-Male) – 01 (OBC)
- TGT (PET-Female) – 01 (SC)
3. Primary Teacher – 05
Total -05 (UR – 03, OBC – 01, EWS – 01)
ఇందులో ఒక పోస్టు దివ్యాంగులకు (PWBD-LD/CP) కేటాయించారు.
PGT Qualifications
PGT (Mathematics):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మ్యాథమెటిక్స్ లో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్/ అప్లైడ్ మ్యాథమెటిక్స్ 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో మ్యాథమెటిక్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
PGT (Physics):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఫిజిక్స్ లో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/ న్యూక్లియర్ ఫిజిక్స్/ ఎలాక్ట్రానిక్స్ లో 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో ఫిజిక్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
PGT (Biology):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ అఫ్ ఎడ్యుకేషన్ లో బోటనీ లేదా జువాలజీలో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బోటనీ/ జువాలజీ/ లైఫ్ సైన్స్/ బయో సైన్సెస్/ జెనెటిక్స్/ మైక్రో బయాలజీ/ బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ/ ప్లాంట్ ఫిజియాలజీలో 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో బోటనీ మరియు జువాలజీ సబ్జెక్టులను చదివి ఉండాలి.
PGT (Chemistry):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కెమిస్ట్రీ లో ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ M.Sc కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీలో 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో కెమిస్ట్రీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
TGT Qualifications
TGT (Mathematics):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మ్యాథమెటిక్స్ లో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులలో ఏవైనా రెండు సబ్జెక్టులతో కలిపి మ్యాథమెటిక్స్ లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో మ్యాథమెటిక్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
TGT (Hindi):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో హిందీలో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, 50 శాతం మార్కులతో హిందీలో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో హిందీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
TGT (English):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇంగ్లిష్ లో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, 50 శాతం మార్కులతో ఇంగ్లిష్ లో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో ఇంగ్లిష్ ని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
TGT (Chemistry):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కెమిస్ట్రీలో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, 50 శాతం మార్కులతో బోటని మరియు జువాలజీతో పాటు కెమిస్ట్రీ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో కెమిస్ట్రీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
TGT (Biology):
NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బోటని మరియు జువాలజీ సబ్జెక్టులతో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు లేదా, బోటని మరియు జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఏవైనా రెండు సబ్జెక్టులతో కలిపి 50 శాతం మార్కులతో బోటని మరియు జువాలజీ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో అన్ని సంవత్సరాలలో బోటని లేదా జువాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
TGT (PET-Male) & TGT (PET-Female):
ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు.
Primary Teacher Qualifications
50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పాసై, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా చేసిన వారు, లేదా నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ అఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) చేసిన వారు, లేదా రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన వారు, లేదా గ్రాడ్యుయేషన్ తో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) చేసిన వారు అర్హులు.
Note : అభ్యర్థులు పై విద్యార్హలతో పాటు..
- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో B.Ed చేసి ఉండాలి.
- ఇంగ్లిష్ మీడియంలో బోధించే నైపుణ్యం ఉండాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం.
- ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు CBSE / NCTE నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET), పేపర్-II పాసై ఉండాలి.
Salary
1. Post Graduate Teacher – రూ.47,600 – రూ.1.51,100
2. Trained Graduate Teacher – రూ.44,900 – రూ.1,42,400
3. Primary Teacher – రూ.35,400 – రూ.1.12,400
Age Limit
ఆగస్టు 28, 2022 నాటికి..
PGT అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఉండాలి.
TGT అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి.
Primary Teacher అభ్యర్థుల వయసు సంవత్సరాల నుంచి 30 సంవ త్సరాల లోపు ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. మాజీ సైనికులు, దివ్యాంగులకు
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
How to Apply
ఆసక్తి కలిగిన అభ్యర్థులు SHAR కు సంబంధించిన వెబ్ సైట్ (https://www.shar.gov.in/(or) https://apps.shar.gov) లలోకి లాగిన్ అయ్యి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
Application Fee
అప్లికేషన్ ఫీజు నిమిత్తం అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. రాత పరీక్షకు ఎంఎకైన మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులకు ఫీజు తిరిగి ఇస్తారు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు రూ.500 చెల్లిస్తారు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 28, 2022
– Jobs in Space Central Schools