Bank Jobs

Junior Associate Jobs in SBI

Junior Associate Jobs in SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India-SBI) దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ లలో పనిచేసేందుకు జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) (Junior Associate (Customer Support & Sales)) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ (Advt. No. CRPD/CR/2022-23/15) జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 5,008 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఏ రాష్ట్రంలోని అభ్యర్థులు ఆ రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్స్) ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Name

Junior Associate (Customer Support & Sales)

Circle Wise Vacancies

మొత్తం పోస్టులు – 5008. అహ్మదాబాద్- 357, బెంగళూరు- 316, భోపాల్- 481, బెంగాల్- 376, భువనేశ్వర్- 170, చండీగఢ్ – 225, చెన్నై- 362, ఢిల్లీ – 152, హైదరాబాద్- 225, జైపుర్ – 284, కేరళ – 273, ల‌ఖ్ న‌వూ/ ఢిల్లీ – 631, మహారాష్ట్ర/ ముంబయి మెట్రో- 747, మహారాష్ట్ర- 50, నార్త్ ఈస్టర్న్- 359.

Hyd Circle Posts

హైదరాబాద్ సర్కిల్ లో మొత్తం 225 పోస్టులు ఉన్నాయి. ఇందులో SC-36, ST-16, OBC-60, EWS-22, General-91 పోస్టులు కేటాయించారు.

Qualifications

ఏదైనా విభాగంలో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20, 2022 నాటికి డిగ్రీ రిజల్ట్స్ రావాలి. హైదరాబాద్ సర్కిల్ లోని పోస్టులకు పోటీ పడేవారు తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగాలకు పోటీపడే వారు అక్కడి స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.

Age Limit

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు ఆగస్టు 01, 2022 నాటికి 20 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Pay Scale

రూ.17,900-1000/3-20,900-1,230/3-24,590-1.490/4-30,550-1,730/7-42,600-3,270/1-45,930-1,990/1-47,920.

Selection Procedure

  • ఈ పోస్టులకు అభ్యర్థులను రెండు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫేజ్-1లో ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్-2లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
  • నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానిక వన్ బై ఫోర్త్ మార్కు కట్ చేస్తారు. అయితే, మెయిన్స్ లో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తారు.
  • హైదరాబాద్ సర్కిల్ లోని పోస్టులకు పోటీ పడేవారు తెలుగు, ఉర్దూ భాషలలో పరీక్ష రాయవచ్చు.
  • పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నర్సారావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాలలో ఉంటాయి.
  • తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ పట్టణాలలో ఉంటాయి.

How to Apply

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా SBI వెబ్ సైట్ https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers లోకి లాగిన్ కావాలి.
  • సరైన ఈ-మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాల్ లెటర్, ఇంటర్వ్యూ వివరాలు ఈ-మెయిల్ ఐడీకి మాత్రమే పంపిస్తారు.
  • రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో ఫీజు చెల్లించవచ్చు.
  • అనంతరం అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ తో అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే, విద్యార్హతలు, కేటగిరీ తదితర సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే 022-2282027 నంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 27, 2022

– Junior Associate Jobs in SBI

Kautilya Creative

Share
Published by
Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago