Medical Officer Jobs in ONGC : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (Oil and Natural Gas Corporation Limited- ONGC) మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt. No. RJY- 01/2022 (R&P)) జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి యూనిట్ లో ఒప్పంద ప్రాతిపదికన (Contract Basis) మొత్తం ముప్పై మూడు (33) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులు జూన్ 30, 2024 వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. మెడికల్ ఆఫీసర్ – ఫీల్డ్ డ్యూటీ (ఎఫ్ఎంవో) (ఫుల్ టైమ్)
Medical Officer – Field Duty (FMO) (Full Time)
2. మెడికల్ ఆఫీసర్ – అక్యుపేషనల్ హెల్త్ (ఓహెచ్) (ఫుల్ టైమ్)
Medical Officer – Occupational Health (OH) (Full Time)
3. మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (ఫుల్ టైం)
Medical Officer – General Duty (GDMO) (Full Time)
4.మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (పార్ట్ టైం)
Medical Officer- General Duty (GDMO) (Part Time)
మెడికల్ ఆఫీసర్ – ఫీల్డ్ డ్యూటీ (ఎఫ్ఎంవో)(ఫుల్ టైమ్) – ముప్పై (30). అన్ రిజర్వుడ్ (Unreserved-UR)-14, ఈడబ్ల్యూఎస్ (Economically
Weaker Sections-EWS) – 03, ఓబీసీ (Other Backward Classes-EWS)-07, ఎస్సీ (Scheduled Castes-SC)-04. ఎస్టీ (Scheduled
Tribes-ST)-02. మెడికల్ ఆఫీసర్ – అక్యుపేషనల్ హెల్త్ (ఓహెచ్) (ఫుల్ టైమ్) – ఒకటి (01) అన్ రిజర్వుడ్(UR). మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (ఫుల్ టైం) – ఒకటి (01) అన్ రిజర్వుడ్(UR). మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (పార్ట్ టైం) – ఒకటి (01) అన్ రిజర్వుడ్ (UR).
ఎంబీబీఎస్ (Bachelor of Medicine and Bachelor of Surgery- MBBS)
మెడికల్ ఆఫీసర్ – ఫీల్డ్ డ్యూటీ (ఎఫ్ఎంవో)(ఫుల్ టైమ్) – రూ.1,05,000, మెడికల్ ఆఫీసర్– ఆక్యుపేషనల్ హెల్త్ (ఓహెచ్) ఫుల్ టైమ్) – రూ.1,00,000, మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (ఫుల్ టైం)- రూ.1,00,000, మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (పార్ట్ టైం) – రూ.50,000.
ఏడాది తర్వాత మెడికల్ ఆఫీసర్ – ఫీల్డ్ డ్యూటీ, మెడికల్ ఆఫీసర్ – అక్యుపేషనల్ హెల్త్, మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (ఫుల్ టైం)కి రూ.1500, మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ (జీడీఎంవో) (పార్ట్ టైం)కి – రూ.600 పెంచుతారు.
ఈ పోస్టులకు గరిష్ఠ వయో పరిమితి ఏమీ లేదు. ఆక్యుపేషనల్ హెల్త్ లేదా పబ్లిక్ హెల్త్ లేదా అక్యుపేషనల్ మెడిసిన్ లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ పోస్టుకు పీడబ్ల్యూబీడీ (Persons with Benchmark Disabilities-PWBD) Category C (OA, OL, BL, OAL, CP, LC, DW, AAV), D (SLD), E (Combination of C to D) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, మెడికల్ ఆఫీసర్ – అక్యుపేషనల్ హెల్త్ పోస్టుకు Category B (HH), C (OL, DW, AAV), D (ASD(M), SLD, MI), E (Combination of C to D) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతల్లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులలో 70 మార్కులు విద్యార్హతలకు, 30 మార్కులు
ఇంటర్వ్యూకు కేటాయిస్తారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ONGC వెబ్ సైట్ (www.ongcindia.com) లోకి లాగిన్ అయ్యి ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్లనే ఉపయోగించాలి. ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం అన్ని వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్లకు మాత్రమే పంపిస్తారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెబ్ సైట్ లో పొందు పరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకొని దానిలో అన్ని వివరాలు నింపి సంతకం చేయాలి. ఆ ఫాంతో పాటు విద్యార్హతలు, అనుభవం, కేటగిరీ, వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు ONGC ఈ-మెయిల్ (rjycontractmedics@ongc.co.in) కు పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్ లో సెండ్ చేయాలి.
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 12 జూన్, 2022 (సాయంత్రం 6గంటల వరకు)
సర్టిఫికెట్లు మెయిల్ చేసేందుకు చివరి తేదీ: 12 జూన్, 2022 (రాత్రి 11:59 గంటల వరకు)
– Medical Officer Jobs in ONGC
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…