Contract Job

General Duty Medical Officer Jobs in NTPC

Medical Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జ్యోతినగర్ లో గల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (National Thermal Power Corporation Limited-NTPC)కు చెందిన ధన్వంతరి ఆసుపత్రి (Dhanwantari Hospital) లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (General Duty Medical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం రెండు (02) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

Details of Post

1.General Duty Medical Officer – 02

Vacancies

మొత్తం ఖాళీలు : రెండు (02). ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

Qualification

Bachelor of Medicine, Bachelor of Surgery (MBBS) ఉత్తీర్ణులై, ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ చేసిన వారు అర్హులు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Salary

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,23,000 స్థిర వేతనం చెల్లిస్తారు.

How to Attend Interview

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, రిజర్వుడ్ కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలతో బయోడేటాను మరియు విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించి సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Interview Date & Time :

అక్టోబర్ 21, 2022,
ఉదయం 9 గంటల నుంచి

Interview Venue :
First Floor, CMO Office, Dhanwantari Hospital, NTPC Township, Jyothi Nagar, Ramagundam, Peddapalli Disrict, Telangana- 505215

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే adhocrstps@gmail.com కు మెయిల్ చేసి తెలుసుకోవచ్చు.

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • మొదట నియామక తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత అభ్యర్థి పనితీరు మరియు సంస్థ అవసరాలను బట్టి మరో సంవత్సరం పొడిగించవచ్చు.
  • ఈ ఉద్యోగానికి ఫుల్ టైం ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకొనేందుకు అనుమతించరు.
  • సెల్ఫ్ మెడికల్ సౌకర్యం ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులకు లభ్యతను బట్టి టౌన్ షిప్ లో వసతి కల్పిస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ టీఏ, డీఏ లాంటివి చెల్లించదు.
  • అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.
  • ఎలాంటి ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి కారణాలు తెలపకుండా, నియామక ప్రక్రియను రద్దు చేయడానికి లేదా మార్పు చేయడానికి లేదా సవరించడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, రామగుండం నకు కలదు.

– Medical Officer Jobs

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago