NEET Coaching for ST StudentsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

NEET Coaching for ST Students : హైదరాబాద్ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Residential Educational Institutions Society-TTWREIS) రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల (Scheduled Tribes ST) విద్యార్థినీ విద్యార్థులకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-2023) కు లాంగ్ టర్మ్ కోచింగ్ (Long Term NEET Coaching) (OPEM-Operation Emerald) ఇచ్చేందుకు నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి 2022-23 విద్యా సంవత్సరంలో NEET-2023 కు హాజరు కాబోయే ST విద్యార్థినీ విద్యార్థులు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. NEET- 2022 వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఈ కోచింగ్ కు ఎంపిక చేస్తారు.
మొత్తం 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తికలిగిన విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Number of Seats

హైదరాబాద్ లోని హయత్ నగర్ లో గల TTWR PVIG COE (Boys), TTWR PVTG COE (Girls) కాలేజీల్లో ఈ శిక్షణ ఇస్తారు. మొత్తం 150 మందికి ఈ శిక్షణ ఇస్తారు. ఇందులో 100 సీట్లు ST కేటగిరీ విద్యార్థినీ విద్యార్థులకు కేటాయిస్తారు. 50 సీట్లు బాలురకు, 50 సీట్లు బాలికలకు కేటాయిస్తారు. అలాగే, మరో 50 సీట్లు PVTG కేటగిరీ విద్యార్థినీ విద్యార్థులకు కేటాయిస్తారు. 25 సీట్లు బాలురకు, 25 సీట్లు బాలికలకు కేటాయిస్తారు.

Eligibility

ఇంటర్మీడియట్ పూర్తిచేసి NEET-2022 రాసి ఉండాలి.
NEET-2022లో 300 మార్కులు సాధించి ఉండాలి.
PVTG విద్యార్థులకు ఎలాంటి కట్ ఆఫ్ మార్కులు లేవు.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
ఇంతకుముందు OPEM ప్రోగ్రాంలో శిక్షణ తీసుకొని ఉండకూడదు.

How to Apply

  • ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్థులు TTWREIS వెబ్ సైట్ (https://tgtwgurukulam.telangana.gov.in/)ను ఓపెన్ చేయాలి.
  • అందులో ఎడమ వైపున స్కోల్ అవుతున్న Apply Online for NEET LONGTERM COACHING-2023 పై క్లిక్ చేయాలి.
  • అందులో ముందుగా కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Click here : To Pay online application fee పై క్లిక్ చేయాలి.
  • అందులో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, కులం, ఉప కులం వివరాలు నింపి, చెక్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.100 చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Click here : To submit online application పై క్లిక్ చేయాలి.
  • అందులో పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది.
  • అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి, NEET-2022 స్కోర్ కార్డ్ ను అప్ లోడ్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి.
  • NEET-2022 స్కోర్ కార్డ్ అప్ లోడ్ చేయని అప్లికేషన్ ఫాంలను తిరిస్కరిస్తారు.

Important Points

ఎంపికైన అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తారు. అలాగే, సంస్థ వెబ్ సైట్ లోనూ పెడతారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు ఆహ్వానిస్తారు.
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో గల TTWR PVTG COE (Boys) కాలేజీలో బాలురకు, TTWR PVTG COE (Girls) కాలేజీలో బాలికలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
80 శాతం సీట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TTWREIS) కు చెందిన కాలేజీలు, మరియు ఇతర ప్రభుత్వ కాలేజీల్లో
చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు.

Important Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 03, 2022
అర్హులైన విద్యార్థుల జాబితా ప్రకటన : అక్టోబర్ 04, 2022
సర్టిఫికెట్ల పరిశీలన : అక్టోబర్ 07, 2022
తరగతులు ప్రారంభం : అక్టోబర్ 08, 2022

– NEET Coaching for ST Students