Contract Job

Project Engineer Jobs in ECIL

Project Engineer Jobs : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited-ECIL) ప్రాజెక్ట్ ఇంజినీర్ (Project Engineer) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఆరు (06) పోస్టుల భర్తీకి ప్రకటన (Advt.No.22/2022) విడుదలైంది. విద్యార్హ‌త‌ల్లో సాధించిన మార్కులు, సంబంధిత విభాగంలో ప‌ని అనుభ‌వం, ఇంటర్వ్యూ, స‌ర్టిఫికెట్ వెరికేష‌న్ నిర్వ‌హించి ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

Vacancies

మొత్తం పోస్టులు ఆరు (06). UR-03, OBC-01, SC-01

Salary

మొదటి సంవత్సరం నెలకు రూ.40,000
రెండో సంవత్సరం నెలకు రూ.45,000
మూడో సంవత్సరం నెలకు రూ.50,000
నాలుగో సంవత్సరం నెలకు రూ.55,000
వీటితోపాటు పీఎఫ్‌, టీఏ, డీఏ త‌దిత‌ర స‌దుపాయాలు కూడా క‌ల్పిస్తారు.

Qualifications

ఎల‌క్ట్రానిక్స్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్ లో బీఈ లేదా బీటెక్ ఫ‌స్ట్ క్లాస్ (క‌నీసం 60 శాతం మార్కులు)లో ఉత్తీర్ణులు కావాలి. అలాగే, సెప్టెంబ‌ర్ 30, 2022 నాటికి SMT లైన్ లో ఆప‌రేష‌న్స్ మరియు ప్రోగ్రామింగ్‌లో మూడు (03) సంవ‌త్స‌రాల ప‌ని అనుభ‌వం ఉండాలి.

Age Limit

ఈ Project Engineer Jobs కు అభ్యర్థుల వయసు సెప్టెంబ‌ర్ 30, 2022 నాటికి 33 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవ‌త్స‌రాలు, ఎస్సీ అభ్యర్థులకు ఐదు (05) సంవ‌త్స‌రాలు, దివ్యాంగుల‌కు ప‌ది (10) సంవ‌త్స‌రాల స‌డ‌లింపు ఉంది.

How to Attend Interview

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ECILకు చెందిన వెబ్ సైట్ (www.ecil.co.in) ను ఓపెన్ చేయాలి. అందులో Careers పై క్లిక్ చేయాలి. అందులో Current Job Openings పై క్లిక్ చేయాలి. అందులో Advt.No.22/2022లో ఉన్న Application Formను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి అందులోని వివరాలన్నీ నింపాలి. ఆ అప్లికేషన్ ఫాంతో పాటు ఎస్సెస్సీ మెమో, ఏదైనా గుర్తింపు కార్డు, ఎస్సెస్సీ, ఇంట‌ర్మీడియ‌ట్‌, బీఈ/బీటెక్ సర్టిఫికెట్లు, మార్క‌ల మెమోలు, సీజీపీఏ క‌న్వ‌ర్ష‌న్ స‌ర్టిఫికెట్‌, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు, కేట‌గిరీ సర్టిఫికెట్ ల‌ను తీసుకొని అక్టోబర్ 15, 2022 (శ‌నివారం) ఉదయం 9:30 గంటలకు ఈ కింద చిరునామా కు వెళ్లాలి.
Administration Building,
Electronics Corporation of India Limited, NFC Road, ECIL Post, Hyderabad-500062.

అన్ని ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్లాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఉద‌యం 11:30 గంట‌ల‌కు పూర్త‌వుతుంది. ఆ తర్వాత సర్టిఫికెట్లు పరిశీలించి అర్హులైన వారిని ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు.

Important Points

  • ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు నాలుగు సంవత్సరాలు హైద‌రాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది.
Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago