294 Jobs in HPCL : భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (Hindustan Petroleum Corporation Limited-HPCL) పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 294 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో మెకానికల్, సివిల్ ఇంజినీర్లు, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. మెకానికల్ ఇంజినీర్ (Mechanical Engineer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 103
వయసు: 25 సంవత్సరాలు
అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు.
2. ఎలక్ట్రికల్ ఇంజినీర్ (Electrical Engineer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 42
వయసు: 25 సంవత్సరాలు
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు.
3. ఇనిమెంటేషన్ ఇంజినీర్ (Instrumentation Engineer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 30
వయసు: 25 సంవత్సరాలు
అర్హతలు: ఇనిస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు.
4. సివిల్ ఇంజినీర్ (Civil Engineer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 25
వయసు: 25 సంవత్సరాలు
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు.
5. కెమికల్ ఇంజినీర్ (Chemical Engineer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 7
వయసు: 25 సంవత్సరాలు
అర్హతలు: కెమికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాలు పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు.
6. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆఫీసర్ (Information Systems Officer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 5
వయసు: 25 సంవత్సరాలు
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ఐటీ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు.
1.సేఫ్టీ ఆఫీసర్-ఉత్తర ప్రదేశ్ (Safety Officer-Uttar Pradesh)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 6
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: మెకానికల్/సివిల్/ ఇనిస్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/కెమికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసిన వారు అర్హులు. మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం ఇండిస్ట్రియల్ సేఫ్టీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, దేవనాగరి లిపి, హిందీ భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
2.సేఫ్టీ ఆఫీసర్-తమిళనాడు (Safety Officer-Tamil Nadu)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 1
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: మెకానికల్/సివిల్/ఇనిస్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/కెమికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసిన వారు అర్హులు. మరియు తమిళనాడు రాష్ట్ర ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం ఇండిస్ట్రియల్ సేఫ్టీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, తమిళ
భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
3.సేఫ్టీ ఆఫీసర్-కేరళ (Safety Officer-Kerala)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 5
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: మెకానికల్/సివిల్/ఇనిస్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్/కెమికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసిన వారు అర్హులు. మరియు కేరళ రాష్ట్ర ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం. ఇండిస్ట్రియల్ సేఫ్టీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, మళయాల భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
4.సేఫ్టీ ఆఫీసర్-గోవా (Safety Officer- Goa)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 1
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: మెకానికల్/సివిల్/ఇనిస్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్/కెమికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసిన వారు అర్హులు. మరియు గోవా రాష్ట్ర ఫ్యాక్టరీ నిబంధనల ప్రకారం ఇండిస్ట్రియల్ సేఫ్టీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, గోవాలో స్థానిక భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
5.ఫైర్ & సేఫ్టీ ఆఫీసర్ (Fire & Safety Officer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 2
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: ఫైర్ లేదా ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్ లో బీ.ఈ/బీ.టెక్ ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. అలాగే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థలో ఇండిస్ట్రియల్ సేఫ్టీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, మరాఠీ భాషలో పరిజ్ఞానం తప్పనిసరి.
1.క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ (Quality Control Officer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 27
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనలిటికల్/ఫిజికల్/ఆర్గానిక్/ఇనార్గానిక్). రెండు (02) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
2. బ్లైండింగ్ ఆఫీసర్ (Blending Officer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 5
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనలిటికల్/ఫిజికల్/ఆర్గానిక్/ఇనార్గానిక్). రెండు (02) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
3.చార్టర్డ్ అకౌంటెంట్ (Chartered Accountant)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 15
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో చార్టర్డ్ అకౌంటెట్ (CA) గా క్వాలిఫై అయిన వారు అర్హులు. అలాగే, ICAI మెంబర్ షిప్ మరియు ఆర్టికల్ షిప్ పూర్తిచేసి ఉండాలి.
4.హెచ్ఆర్ ఆఫీసర్ (HR Officer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 8
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు:హెచ్ఆర్/పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియిల్ రిలేషన్స్/సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. రెండు (02) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. ఎంబీఏతో పాటు హెచార్/పర్సనల్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ చేసిన వారు కూడా అర్హులే.
5. వెల్ఫేర్ ఆఫీసర్ – విశాఖ రిఫైనరీ (Welfare Officer- Visakh
Refinery)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య: 1
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: ఏదైనా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్/సైన్స్/కామర్స్ సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. లేదా లా చేసి ఉండాలి. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కార్మిక సంక్షేమానికి సంబంధించిన కేస్ లా, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఎం ఒక సబ్జెక్టుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అదే విధంగా తెలుగు భాషలో పరిజ్ఞానం ఉడాలి.
6. వెల్ఫేర్ ఆఫీసర్ – ముంబై రిఫైనరీ (Welfare Officer- Visakh Refinery)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 1.
వయసు: 27 సంవత్సరాలు
అర్హతలు: మహారాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సోషల్ సైన్స్ లో డిగ్రీ లేదా బిప్లొమా చేసి ఉండాలి. అదే విధంగా మరాఠీ భాషలో పరిజ్ఞానం ఉండాలి.
7. లా ఆఫీసర్ (Law Officer)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 5
వయసు: 26 సంవత్సరాలు
అర్హతలు: గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత న్యాయశాస్త్రంలో మూడు సంవత్సరాల రెగ్యులర్ కోర్సు చేసిన వారు, అదే విధంగా 12వ తరగతి తర్వాత న్యాయశాస్త్రంలో ఐదు సంవత్సరాల కోర్సు చేసిన వారు అర్హులు. అలాగే, ఏడాది కాలం అనుభవం ఉండాలి.
8. లా ఆఫీసర్ – హెచ్ఆర్ (Law Officer-HR)
గ్రేడ్: E2
పోస్టుల సంఖ్య 2
వయసు: 26 సంవత్సరాలు
అర్హతలు: గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత న్యాయశాస్త్రంలో మూడు సంవత్సరాల రెగ్యులర్ కోర్సు చేసిన వారు, అదే విధంగా 12వ తరగతి తర్వాత న్యాయశాస్త్రంలో ఐదు సంవత్సరాల కోర్సు చేసిన వారు అర్హులు. అలాగే, ఏడాది కాలం అనుభవం ఉండాలి.
9. మేనేజర్/ సీనియర్ మేనేజర్-ఎలక్ట్రికల్ (Manager/ Sr.Manager-Electrical)
గ్రేడ్: మేనేజర్-ఎలక్ట్రికల్-C, సీనియర్ మేనేజర్-ఎలక్ట్రికల్-D
పోస్టుల సంఖ్య: 3
వయసు: మేనేజర్-ఎలక్ట్రికల్ పోస్టుకు 34 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్-ఎలక్ట్రికల్ పోస్టుకు 37 సంవత్సరాలు.
అర్హతలు: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. నాలుగు (04) సంవత్సరాల పూర్తి సమయం రెగ్యులర్ కోర్సు చేసినవారు అర్హులు. అలాగే, మేనేజర్-ఎలక్ట్రికల్ పోస్టు అభ్యర్థులకు తొమ్మిది సంవత్సరాల అనుభవం, సీనియర్ మేనేజర్-ఎలక్ట్రికల్ పోస్టు అభ్యర్థులకు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
పైన సూచించిన వయసు జనరల్ అభ్యర్థులకు మాత్రమే. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీల వారికి వయసులో సడలింపు ఉంటుంది.
E2 గ్రేడ్ రూ.50,000 – రూ.1,60,000,
C గ్రేడ్ రూ.80,000 – రూ.2,20,000
D గ్రేడ్ రూ.90,000 – రూ.2,40,000
షార్ట్ లిస్టింగ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లా ఆఫీసర్లకు మూట్ కోర్ట్ ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ తర్వాత అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు పిలుస్తారు. ఈ టెస్ట్ రెండు విభాగాలుగా ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాలలో పరీక్ష నిర్వహిస్తారు.
ఆసక్తి కలిగిన విద్యార్థులు HPCL వెబ్ సైట్ (www.hindustanpetroleum.com)ను ఓపెన్ చేసి అందులోని Careers పై క్లిక్ చేసి అందులో Job Openings పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Our Current Openings కింద ఉన్న Recruitment of Officers – 2022-23 పై క్లిక్ చేయాలి. అందులో Click here to Apply పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ లింక్ జూన్ 23, 2022 మధ్యాహ్నం 12 గంటల నుంచి జూలై 22, 2022 రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కే పంపిస్తారు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. అప్లికేషన్ ఫాంలోని అన్ని వివరాలు పూర్తిగా నింపాలి.
అన్ రిజర్వుడ్, ఓబీసీ(నాన్ క్రిమిలేయర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ యాప్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే careers@hpcl.in ఈ-మెయిలు మెయిల్ చేసి పరిష్కారం పొందవచ్చు. సబ్జెక్టులో “Position Name – Application Number” ఎంటర్ చేయాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 22 జూలై, 2022 (రాత్రి 11:59 గంటల వరకు)
– 294 Jobs in HPCL
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…