Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్ (ఇంగ్లిష్ మీడియం) మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ – 2024 (Telangana State Residential Junior College Common Entrance Test – 2024) (టీఎస్ ఆర్జేసీ సెట్ – 2024..TSRJC CET–2024) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35 గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అందులో బాలికల కళాశాలలు 20, బాలుర కళాశాలలు 15 ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ(MPC), బీపీసీ(BPC), ఎంఈసీ(MEC) గ్రూపులలో ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా విద్యా బోధన చేస్తారు. ఎంపీసీ గ్రూపులో 1,496 సీట్లు, బీపీసీ గ్రూపులో 1,440 సీట్లు, ఎంఈసీ గ్రూపులో 60 సీట్లు ఉంటాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 2024 మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ అటెమ్ట్లో పాస్ కావాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు 6 జీపీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు 5 జీపీఏ సాధించాలి. అన్ని కేటగిరీల విద్యార్థులు ఇంగ్లిష్ సబ్జెక్టులో 4 జీపీఏ సాధించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోనే చదివి ఉండాలి.
ఆసక్తి కలిగిన విద్యార్థులు http://tsrjdc.cgg.gov.in. వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రాస్పెక్టస్, యూజర్ మాన్యువల్ పూర్తిగా చదివి.. అందులో సూచించిన విధంగా అప్లై చేసుకోవాలి. పరీక్ష ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ముందుగా పరీక్ష ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో పూర్తి చేయాల్సిన ఫాంను ప్రాస్పెక్టస్ లో (Prospectus – TSRJC CET-2024) ఇచ్చారు. ముందు దానిని నమూనాగా పూర్తిచేసి ఆ తర్వాత ఆన్లైన్లో నింపాలి. అలాగే, యూజర్ మ్యాన్యువల్ కూడా ఇచ్చారు. దాంట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 16, 2024 చివరి తేదీ.
వెబ్సైట్ : https://tsrjdc.cgg.gov.in
- Admissions in Residential Junior Colleges
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…
Jobs in ESI Dispensaries : తెలంగాణ ప్రభుత్వ బీమా వైద్య సేవల శాఖ (Government of Telangana Insurance…
Nursing Officer in AIIMS : ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical…
Para Medical Jobs in Shar : భారత ప్రభుత్వ (Government of India) స్పేస్ డిపార్ట్మెంట్ (Department of…
Admissions in MPH Course : వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of…
Long Term IIT Coaching : హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ…