LabTechnician Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​ గ్రేడ్​-II (Lab-Technician Grade-II) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1,284 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. రాత పరీక్ష(కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​), వెయిటేజీ మార్కులు, సర్టిఫికెషన్​ వెరిఫికేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డిపార్ట్​మెంట్లు వారీగా ఖాళీలు

1. డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ / డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ – 1,088
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్​ – 183
3. ఎంఎన్​జే ఇనిస్టిట్యూట్​​ ఆఫ్ ఆంకాలజీ అండ్​ రీజనల్​ క్యాన్సర్​ సెంటర్​ (MNJIO&RCC) – 13

జోన్ల వారీగా పోస్టులు

  • డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ / డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ – 1,088
    జోన్​-I –187, జోన్​-II – 111, జోన్​- III – 145, జోన్​-IV–159, జోన్​-V–137, జోన్​-VI–180, జోన్​-VII–169
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్​ – 183
    జోన్​-I –31, జోన్​-II – 24, జోన్​- III – 28, జోన్​-IV–32, జోన్​-V–12, జోన్​-VI–40, జోన్​-VII–16
  • ఎంఎన్​జే ఇనిస్టిట్యూట్​​ ఆఫ్ ఆంకాలజీ అండ్​ రీజనల్​ క్యాన్సర్​ సెంటర్​ – 13

అర్హతలు

నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి అభ్యర్థులు ఈ కింది అర్హతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి.

  • (a) Certificate in Laboratory Technician Course
  • (b) MLT(VOC)/Intermediate (MLT Vocational) with one-year clinical training/apprenticeship training
  • (c) Diploma in Medical Lab-Technician Course (DMLT)
  • (d) B.Sc (MLT)/M.SC(MLT)
  • (e) Diploma in Medical Lab (Clinical Pathology) Technician Course
  • (f) Bachelor in Medical Laboratory Technology (BMLT)
  • (g) P.G.Diploma in Medical Laboratory Technology
  • (h) P.G.Diploma in Clinical Biochemistry
  • (i) B.Sc (Microbiology) / M.Sc (Microbiology)
  • (j) M.Sc in Medical Biochemistry
  • (k) M.Sc in Clinical Microbiology
  • (l) M.Sc in Biochemistry

అలాగే, అభ్యర్థులు తెలంగాణ పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ చేసికొని ఉండాలి. ఆ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

వయసు

  • ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు జూలై 01, 2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • మాజీ సైనికులు (Ex-Servicemen), ఎన్సీసీ (N.C.C) అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు సడలింపు ఉంది.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు సడలింపు ఉంది.
  • దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
  • ప్రస్తుతం ఇతర డిపార్ట్​మెంట్లలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సర్వీసు పీరియెడ్​ను బట్టి ఐదు (05) సంవత్సరాలు సడలింపు ఉంది.
  • ఆర్టీసీ ఉద్యోగులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.

జీతం నెలకు

  • డైరెక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​ అండ్​ ఫ్యామిలీ వెల్ఫేర్​ / డైరెక్టర్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్​ లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.32,820 – రూ. 96,890 చెల్లిస్తారు.
  • ఎంఎన్​జే ఇనిస్టిట్యూట్​​ ఆఫ్ ఆంకాలజీ అండ్​ రీజనల్​ క్యాన్సర్​ సెంటర్ లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.31,040 – రూ.92,050 చెల్లిస్తారు​.

ఉద్యోగాలకు ఎంపిక విధానం

  • మొత్తం 100 పాయింట్ల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్ఠంగా 80 మార్కులు కేటాయిస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆసుపత్రులు, వివిధ కార్యక్రమాలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయిస్తారు.
  • గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2 పాయింట్లు కేటాయిస్తారు.
  • నోటిఫికేషన్​ వెలువడిన తేదీ నాటికి కనీసం 6 నెలలు పనిచేస్తేనే ఈ మార్కులు కేటాయిస్తారు. అయితే, ఈ మార్కులకు సంబంధించి సంబంధిత విభాగం హెచ్​ ఓ డీ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి

  • ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన వెబ్ సైట్ (https://mhsrb.telangana.gov.in) లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • విద్యార్హతలు, అనుభవనంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
  • అలాగే, ఎగ్జామినేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.200 ఆన్ లైన్ లో చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్​ 5, 2024 సాయంత్రం 5 గంటల వరకు.
  • అక్టోబర్​ 7, 2024 ఉదయం 10:00 గంటల నుంచి అక్టోబర్​ 8, 2024 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్​ ఎడిట్​ ఆప్షన్​ ఇస్తారు.
  • నవంబర్​ 10, 2024న రాత పరీక్ష ఉంటుంది.

ఏఏ సర్టిఫికెట్లు అప్​ లోడ్​ చేయాలి

  • ఆధార్ కార్డు
  • ఎస్సెస్సీ మెమో (డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం)
  • క్వాలిఫైయింగ్​ ఎగ్జామ్​ సర్టిఫికెట్​
  • క్వాలిఫైయింగ్​ ఎగ్జామ్ మార్కుల మెమో
  • తెలంగాణ పారా మెడికల్​ బోర్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు)

  • స్టడీ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)

  • ఒకవేళ ప్రైవేటు స్కూళ్లలో చదివినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
  • కులం సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు)
  • నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ (బీసీ అభ్యర్థులు మాత్రమే)
  • ఆదాయం సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే)
  • స్పోర్ట్స్ సర్టిఫికెట్ (స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కలిగిన వారు మాత్రమే)

  • సదరమ్ సర్టిఫికెట్ (దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే)
  • సర్వీస్ సర్టిఫికెట్ (ఎక్స్​ సర్వీస్​ మెన్​ అభ్యర్థులు మాత్రమే)
  • సర్వీస్ సర్టిఫికెట్ (ఎన్ సీ సీ అభ్యర్థులు మాత్రమే)
  • సర్వీస్ సర్టిఫికెట్ (ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు)

  • అభ్యర్థి ఫొటో (జేపీజీ/జేపీఈజీ/పీ ఎన్​ జీ ఫార్మాట్​ లో)
  • అభ్యర్థి సంతకం (జేపీజీ/జేపీఈజీ/ పీఎన్ ఫార్మాట్లో)

ముఖ్య గమనిక

  • పై సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్ కాపీలను మాత్రమే అప్ లోడ్ చేయాలి.
  • ఒక్క సారి అప్​ లోడ్​ చేసిన సర్టిఫికెట్​ మళ్లీ చేయడానికి ఉండదు.
  • క్లియర్ గా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. ఇవే సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • రెసిడెన్స్, కులం, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్లన్నీ అభ్యర్థులు తమ సొంత మండలం నుంచి మాత్రమే తీసుకోవాలి.
  • వివాహం జరిగిన మహిళా అభ్యర్థులు కూడా తమ సొంత మండలం నుంచి మాత్రమే తీసుకోవాలి.
  • భర్త గ్రామం, మండలం నుంచి తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లుబాటు కావు.
  • అప్లికేషన్​ లో కూడా మహిళా అభ్యర్థులు తండ్రి పేరు మాత్రమే రాయాలి. భర్త పేరు రాయకూడదు.

Lab Technician Jobs in Telangana