Electronics Corporation of India Limited

Driver Jobs in ECIL : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited-ECIL) లైట్ వెహికిల్ డ్రైవర్ (Light Vehicle Driver) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.10/2022) జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Post Details

పోస్టు పేరు: లైట్ వెహికిల్ డ్రైవర్ (Light Vehicle Driver)

Number of Posts

మొత్తం పోస్టులు నాలుగు (04). అన్ రిజర్వుడ్ (Unreserved-UR)-03, ఓబీసీ (Other Backward Classes-OBC)-01. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.

Age Limit

దరఖాస్తు చేసుకొనే నాటికి అన్ రిజర్వుడ్ అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ECILలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న
కాంట్రాక్టు లేబర్ కు వయసులో సడలింపు ఇచ్చారు. వారి వయసు దరఖాస్తు చేసుకొనే నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. వారు కాంట్రాక్టుకు సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.

Qualification

అభ్యర్థులు పదో తరగతి/ఎస్సెస్సీ పాసై ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్స్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ లో కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి. వీటితో పాటు వాహనాలలో తలెత్తే చిన్నచిన్న లోపాలను సరిచేయగల పరిజ్ఞానం కూడా ఉండాలి.

Salary

నెలకు రూ.18,500. ప్రతి సంవత్సరం 3 శాతం ఇంక్రిమెంట్ ఉంటుంది. వేతనంతో పాటు పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి.

Selection Criteria

  • అభ్యర్థుల ఎంపిక రెండు దశలలో ఉంటుంది.
  • రాత పరీక్ష మరియు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
  • అర్హులైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:4 నిష్పత్తిలో డ్రైవింగ్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు.
  • రాత పరీక్ష తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కు పిలుస్తారు.

Written Test

రాత పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషలలో ఇస్తారు. పరీక్ష అబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కు కట్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాత పరీక్ష తేదీ, స్థలం, సమయం ఈ-మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్లు ECIL వెబ్ సైట్ (http//careers.ecil.co.in.) నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు అధార్ కార్డ్, పాన్ కార్డ్, వోటర్ ఐడీ, డైవింగ్ లైసెన్స్ లలో ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ తో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

Application Fee

అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లేదా అఫ్ లైన్ మోడ్ లో చెల్లించవచ్చు. అన్ రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ECIL వెబ్ సైట్ లో పొందుపరిచిన లింక్ ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఒక్కసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వబడదు.

How to Apply

అర్హులైన అభ్యర్థులు మరియు ECIL ఇంటర్నల్ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ECIL వెబ్ సైట్ (http://careers.ecil.co.in, www.ecil.co.in) లలోకి లాగిన్ అయ్యి సంబంధిత నోటిఫికేషన్ (Advt.No.10/2022)పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం జేపీజీ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి. ఫొటో 4×3 సెం.మీ. సైజ్ లో బ్లూ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. సైజ్ 100 కేబీలోపు ఉండాలి. సంతకం 50 కేబీలోపు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ 25 జూన్, 2022 (మధ్యాహ్నం 2 గంటల వరకు). దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులు ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.

అభ్యర్థులు సరిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫాం, ఫీజు చెల్లించిన రశీదు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్య సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అందజేయాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: 25 జూన్, 2022 (మధ్యాహ్నం 2 గంటల వరకు)

– Driver Jobs in ECIL