Jobs in Tuniki KVK

Jobs in Tuniki KVK : తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో గల డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రంలో (Dr. Ramanaidu-Ekalavya Foundation, Krishi Vigyan Kendra) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advertisement No.01/2022) జారీ అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు అఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ (Senior Scientist & Head )
2. సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (అగ్రోనమీ) (Subject Matter Specialist/T-6 (Agronomy))
3. ప్రోగ్రామ్ అసిస్టెంట్(సాయిల్ సైన్స్) (Program Assistant (Soil Science))
4. ఆఫీస్ అసిస్టెంట్ (Office Assistant)
5. స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ (Skilled Supporting Staff (SSS))

Senior Scientist & Head

పోస్టు పేరు: సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్
వయసు: 47 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: Pay Band-4, 37400-67000, GP-9000 [6th CPC], Level-13A(Grade Pay 9000) in 7th CPC
అర్హతలు: డాక్టోరల్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉండాలి.

Subject Matter Specialist/T-6 (Agronomy)

పోస్టు పేరు: సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (అగ్రోనమీ)
వయసు: 35 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: Pay Band-3, 15600-39100, GP-5400 [6th CPC], Pay Level-10(Grade Pay 5400) in 7th CPC
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్(అగ్రోనమీ)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. కృషి
విజ్ఞాన కేంద్రంలో రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

Program Assistant (Soil Science)

పోస్టు పేరు: ప్రోగ్రామ్ అసిస్టెంట్(సాయిల్ సైన్స్)
వయసు: 30 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: Pay Band-2 9300-34800, GP-4200 [6th CPC], Pay Level-6(Grade Pay 4200) in 7th CPC
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి. ఎమ్మెస్సీ (సాయిల్ సైన్స్) చేసిన
వారికి, కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు సంవత్సరాల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Office Assistant

పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్
వయసు: 30 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: Pay Band-2 9300-34800, GP-4200 [6th CPC], Pay Level-6(Grade Pay 4200) in 7th CPC
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ఏదైనా సంస్థలో కంప్యూటర్ అకౌంట్స్ లో పనిచేసి ఉండాలి.

Skilled Supporting Staff

పోస్టు పేరు: స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్
వయసు: 18 నుంచి 25 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: Pay Band-1 5200-20200, GP-1800 [6th CPC], Pay Level-1 (Grade Pay 1800) in 7th CPC
అర్హతలు: మెట్రిక్యులేషన్ పాస్ లేదా అందుకు సమానమైన కోర్సు లేదా ఐటీఐ పాసై ఉండాలి. వ్యవసాయ నేపథ్యం ఉండాలి.

ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు అలాగే, మహిళలు, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. స్థానిక భాష మాట్లాడేవారికి ప్రాధాన్యం ఉంటుంది.

How to Apply

అర్హులైన అసక్తిగల అభ్యర్థులు డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్, కృషి విజ్ఞాన కేంద్రం వెబ్ సైట్ (https://kvkmedak.org) లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిపై రీసెంట్ పార్ట్ పోర్ట్ సైజ్ ఫొటోను అంటించి, అందులోని వివరాలన్నింటినీ పూర్తిగా నింపాలి. అలాగే, విద్యార్హతలు, మార్కుల పర్సంటేజీ, గ్రేడ్, అనుభవం, కేటగిరి, పుట్టిన తేదీ, వైకల్యం తదితర అన్ని ధ్రువీకరణ పత్రాలను సెల్ఫ్ అటెస్ట్
చేసి అప్లికేషన్ ఫాంకు జతచేయాలి. ప్రస్తుతం ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పే స్లిప్ ను కూడా జతచేయాలి. వాటన్నింటినీ జూన్ 25, 2022లోపు చేరేలా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంకు పోస్టు ద్వారా మాత్రమే పంపించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం తదుపరి ప్రక్రియ ఉంటుంది. మిగతా సమాచారం కోసం అభ్యర్థులు కృషి విజ్ఞాన కేంద్రం వెబ్ సైట్ (https://kvkmedak.org) తరచూ చూస్తుండాలి.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:

Senior Scientist & Head,
Dr. Ramanaidu-Ekalavya Foundation,
Krishi Vigyan Kendra, Tuniki(V),
Kowdipally (M), Medak (D), Telangana-502 316
Phone: 75690 39441, e-mail: [email protected],

Last date of receipt of application: 25 June, 2022

– Jobs in Tuniki KVK