Jobs in Coal India Limited : భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited (CIL)) వివిధ విభాగాలలో 481 మేనేజ్మెంట్ ట్రెయినీ (Management Trainee) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advertisement No: 3/2022) జారీ చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Departments
1.పర్సనల్ అండ్ హెచ్ఐర్ (Personnel & HR)
2. ఎన్విరాన్మెంట్ (Environment)
3. మెటీరియల్స్ మేనేజ్మెంట్ (Materials Management)
4. మార్కెటింగ్ అండ్ సేల్స్ (Marketing & Sales)
5.కమ్యూనిటీ డెవలప్మెంట్ (Community Development)
6. లీగల్ (Legal)
7.పబ్లిక్ రిలేషన్స్ (Public Relations)
8. కంపెనీ సెక్రెటరీ (Company Secretary)
Departments Wise Vacancies
పర్సనల్ అండ్ హెచార్: మొత్తం పోస్టులు (138)
జనరల్/అన్ రిజర్వుడ్ – 60
ఈడబ్ల్యూఎస్ – 14
ఎస్సీ – 20
ఎస్టీ – 8
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 36
ఎన్విరాన్మెంట్: మొత్తం పోస్టులు (68)
జనరల్/అన్ రిజర్వుడ్ – 30
ఈడబ్ల్యూఎస్ – 7
ఎస్సీ – 10
ఎస్టీ – 5
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 16
మెటీరియల్స్ మేనేజ్మెంట్: మొత్తం పోస్టులు (115)
జనరల్/అన్ రిజర్వుడ్ – 53
ఈడబ్ల్యూఎస్ – 11
ఎస్సీ – 14
ఎస్టీ – 8
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 29
మార్కెటింగ్ అండ్ సేల్స్: మొత్తం పోస్టులు (17)
జనరల్/అన్ రిజర్వుడ్ – 10
ఈడబ్ల్యూఎస్ – 2
ఎస్సీ – 2
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 3
కమ్యూనిటీ డెవలప్మెంట్: మొత్తం పోస్టులు (79)
జనరల్/అన్ రిజర్వుడ్ – 33
ఈడబ్ల్యూఎస్ – 8
ఎస్సీ – 11
ఎస్టీ – 6
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 21
లీగల్: మొత్తం పోస్టులు (54)
జనరల్/అన్ రిజర్వుడ్ – 21
ఈడబ్ల్యూఎస్ – 5
ఎస్సీ – 8
ఎస్టీ – 6
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 14
పబ్లిక్ రిలేషన్స్: మొత్తం పోస్టులు (6)
జనరల్/అన్ రిజర్వుడ్ – 3
ఎస్టీ – 1
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 2
కంపెనీ సెక్రెటరీ: మొత్తం పోస్టులు (4)
జనరల్/అన్ రిజర్వుడ్ – 3
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) – 1
Eligibility
పర్సనల్ అండ్ హెచ్ఆర్: హెచ్ఆర్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/పర్సనల్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/పీజీ డిప్లొమా/పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేసిన గ్రాడ్యుయేట్లు అర్హులు. లేదా హెచ్ఆర్(మేజర్)లో స్పెషలైజేషన్ తో పాటు MHROD లేదా ఎంబీఏ లేదా మాస్టర్ అఫ్ సోషల్ చేసిన వారు కూడా అర్హులే.
ఎన్విరాన్మెంట్: గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో 60 శాతం మార్కులతో ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. లేదా ఏదైనా ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ లో పీజీ డిగ్రీ/డిప్లొమా చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
మెటీరియల్స్ మేనేజ్మెంట్: ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు మేనేజ్మెంట్ లో రెండు సంవత్సరాల ఫుల్ టైం ఎంబీఏ/పీజీ డిప్లొమా చేసిన అర్హులు.
మార్కెటింగ్ అండ్ సేల్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో మార్కెటింగ్(మేజర్)లో స్పెషలైజేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో రెండు సంవత్సరాల ఫుల్ టైం ఎంబీఏ/ పీజీ డిప్లొమా చేసిన అర్హులు.
కమ్యూనిటీ డెవలప్మెంట్: కమ్యూనిటీ డెవలప్మెంట్/రూరల్ డెవలప్మెంట్/కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్/ అర్బన్ అండ్
రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ / డెవలప్మెంట్ మేనేజ్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్ లో ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వారు అర్హులు. లేదా, కమ్యూనిటీ డెవలప్మెంట్/రూరల్ డెవలప్మెంట్/కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్/ అర్బన్ అండ్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్/రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ / డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లో స్పెషలైజేషన్ తో పాటు సోషల్ వర్క్ లో రెండు సంవత్సరాల పుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వారు అర్హులు.
లీగల్: మూడు లేదా ఐదు సంవత్సరాల లా డిగ్రీ చేసిన వారు అర్హులు.
పబ్లిక్ రిలేషన్స్: జర్మలిజం/మాస్ కమ్యూనికేషన్/ పబ్లిక్ రిలేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వారు అర్హులు.
కంపెనీ సెక్రెటరీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో ఏదైనా గ్రూపులో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, ICSI అసోసియేట్/ఫెలో
మెంబర్ షిప్ తో కంపెనీ సెక్రెటరీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లిస్టెడ్ కంపెనీలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
అభ్యర్థులు పై కోర్సులన్నీ గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ ఫుల్ టైం కోర్సు చేసి ఉండాలి.
Age Limit
జనరల్ (అన్ రిజర్వుడ్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయసు మే 31, 2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు పది నుంచి 15 సంవత్సరాల సడలింపు ఉంది.
Application Fee
జనరల్ (అన్ రిజర్వుడ్), ఓబీసీ (క్రిమీలేయర్ అండ్ నాన్ క్రిమీలేయర్), ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రూ.180 జీఎస్టీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
How to Apply
అర్హులైన అభ్యర్థులు కోల్ ఇండియా లిమిటెడ్ వెబ్ సైట్ (www.coalindia.in)ను ఓపెన్ చేసి అందులోని Career With CILపై క్లిక్ చేసి, Jobs at Coal India పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జూలై 8, 2022 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్టు 7, 2022 దరఖాస్తుల సమర్పణకు చివరి తేది.
– Jobs in Coal India Limited