Jobs in Telangana High Court : హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court For The State of Telangana) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జడ్జీలు మరియు రిజిస్ట్రార్లకు 65 మంది కోర్టు మాస్టర్లు/పర్సనల్ సెక్రెటరీల (Court Masters and Personal Secretaries) నియామకానికి నోటిఫికేషన్ (Notification No.302/2022) జారీ చేసింది. షార్ట్ హ్యాండ్ లో స్కిల్ టెస్ట్ మరియు ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహించి వాటిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Reservation Wise Vacancies
- ఓసీ(OC) – 29
(ఇందులో 8 పోస్టులు మహిళలకు, 4 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కు, మూడు పోస్టులు మహిళలకు కేటాయించారు.) - మాజీ సైనికులు (Ex Servicemem) – 02
- క్రీడాకారులకు (Sports Quota) – 01
- అంధులు (మహిళ) (Blindness or Low Vision) – 01
- వినికిడి లోపం గలవారు (Hearing Impaired) – 01
- లోకోమోటార్ డిజేబిలిటీ లేదా సెరెబ్రల్ పాల్సి (Locomotor Disability or Cerebral Palsy) – 01
- బీసీ-ఏ (BC-A) – 05 (ఇందులో 2 పోస్టులు మహిళలకు)
- బీసీ-బీ (BC-B) – 05 (ఇందులో 2 పోస్టులు మహిళలకు)
- బీసీ-సీ (BC-C) – 01
- బీసీ-డీ (BC-D) – 04 (ఇందులో 2 పోస్టులు మహిళలకు)
- బీసీ-ఈ (BC-E) – 02 (ఇందులో ఒక పోస్టు మహిళకు)
- ఎస్సీ (SC) – 09 (ఇందులో 3 పోస్టులు మహిళలకు)
- ఎస్టీ (ST) – 04 (ఇందులో 2 పోస్టులు మహిళలకు)
Scale of Pay
రూ.54,220 – 1,33,630
Qualifications
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) లేదా ప్రొవిన్షియల్/సెంట్రల్/స్టేట్ యాక్ట్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థలో ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా సబ్జెక్టుల్లో
డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వం నిర్వహించిన ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ పరీక్షలో నిమిషానికి 180 పదాలు టైప్ చేయగలిగిన వారు అర్హులు. ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ పరీక్షలో నిమిషానికి 150 పదాలు టైప్ చేయగలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అర్హత సాధించి ఉండాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. జూలై 1, 2022 నాటికి అభ్యర్థులు పై అర్హతలన్నీ కలిగి ఉండాలి. భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎలాంటి అనారోగ్య సమస్యలు కలిగి ఉండకూడదు.
Age Limit
అభ్యర్థుల వయసు జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులకు వయసులో ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
మాజీ సైనికులకు (Ex Servicemem) సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
క్రీడాకారులకు (Sports Quota) వారి కేటగిరీని అనుసరించి వయసులో సడలింపు ఉంటుంది.
Examination Fee
ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. క్రీడాకారులు, మాజీ సైనికులు సైతం తమ కేటగిరీ ప్రకారం పరీక్ష ఫీజు చెల్లించాలి. ఈ పరీక్ష ఫీజును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యేలా The Registrar (Recruitment), High Court For The State of Telangana పేరిట డీడీ తీయాలి.
Selection Procedur
ఈ పోస్టులకు ఉద్యోగుల ఎంపిక స్కిల్ టెస్ట్, ఓరల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. షార్ట్ హ్యాండ్ లో ఇంగ్లిష్ పదాలు మూడు నిమిషాల వ్యవధిలో 180 పదాలు, నాలుగు నిమిషాల వ్యవధిలో 150 పదాలు టైప్ చేయాలి. స్కిల్ టెస్ట్ 40 నుంచి 45 నిమిషాల పాటు నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ కు 80 మార్కులు, ఓరల్ ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తారు.
స్కిల్ టెస్ట్ లో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 45 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 35 మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అవుతారు. క్రీడాకారులు, మాజీ సైనికులు సైతం తమ కేటగిరీ ప్రకారం మార్కులు సాధించాలి.
డిక్టేషన్ మరియు ట్రాన్స్ క్రిష్టప్ తో కూడిన షార్ట్ హ్యాండ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఓరల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు Telangana High Court వెబ్ సైట్ (https://tshc.gov.in/)ను ఓపెన్ చేసి అందులో Notification No.302/2022) పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ తోపాటు అప్లికేషన్ ఫాం కూడా వస్తుంది. అప్లికేషన్ ఫాంను ఏ4 సైజ్ వైట్ పేపర్ పై ప్రింట్ తీసుకోవాలి. దానిపై రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి అందులోని వివరాలన్నీ నింపాలి. అనంతరం ఆ అప్లికేషన్ ఫాంకు విద్యార్హతలు, కేటగిరి, వయసు సడలింపునకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి జతచేయాలి.
అప్లికేషన్ ఫాంతో పాటు ఆ మొత్తం సర్టిఫికెట్లు, రెండు సెల్ఫ్ అడ్రస్ ఎనవలప్ కవర్లను ఒక ఎనవలప్ కవర్ లో పెట్టాలి. ఆ కవర్ పైన APPLICATION FOR THE POST OF COURT MASTER/PERSONAL SECRETARY-2022 అని రాసి, To The Registrar (Recruitment), High Court For The State of Telangana at Hyderabad – 500066 చిరునామాకు జూలై 22, 2022 సాయంత్రం 5 గంటల లోపు స్పీడ్ పోస్టు ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ, లేదా నేరుగా వెళ్లి గానీ అందజేయాలి.
Important Points
- రెండు ఫొటోలను డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ లపై అంటించాలి.
- అప్లికేషన్ ఫాం పైన అంటించిన ఫొటోతో పాటు హాల్ టికెట్ లపై అంటించిన ఫొటోలపై కూడా గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించాలి.
- ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
- దరఖాస్తుల పరిశీలన అనంతరం స్కిల్ టెస్ట్ లో పాసై ఇంటర్వ్యూకు ఆహ్వానించబడిన అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలు మరొక సెట్
- గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి ఇంటర్వ్యూ సమయంలో అందజేయాలి.
– Jobs in Telangana High Court