Constable Jobs in Delhi : దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్ (డ్రైవర్) (Constable (Driver)) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission-SSC) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1,411 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Reservation Wise Vacancies
Gen/UR (604) : Open – 543, Ex-Serviceman- 61
EWS (142) : Open – 128, Ex-Serviceman-14
OBC (353) : Open – 318, Ex-Serviceman-35
SC (262) : Open 236, Ex-Serviceman-26
ST (50) : Open – 45, Ex-Serviceman-05
Qualifications
10+2 (సీనియర్ సెకండరీ) పాసై ఉండాలి. హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. హెవీ వెహికిల్ ను నడపడంతో పాటు నిర్వహణలోనూ అనుభవం ఉండాలి.
Pay Scale : నెలకు రూ.21,700 – 69,100 (పే లెవల్-13)
Age Limit
అభ్యర్థులు జూలై 2, 1992కు తర్వాత, జూలై 1, 2022 లోపు జన్మించి ఉండాలి. గరిష్ఠ వయసు జూలై 1, 2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ క్రీడాకారులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ, మాజీ సైనికులకులకు మూడు (03) సంవత్సరాలు సడలింపు ఉంది.
Selection Procedure
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం, కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో జబాబుకు ఒక మార్కు ఇస్తారు. పరీక్ష 90 నిమిషాలలో రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు నాలుగు విభాగాల నుంచి అడుగుతారు. పార్ట్-ఏలో జనరల్ అవేర్ నెస్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్-బీలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్-సీలో న్యుమరికల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు, పార్డ్-డీలో రోడ్ సెన్స్, వెహికిల్ మెయింటనెన్స్, ట్రాఫిక్ రూల్స్/ సిగ్నల్స్ వెహికిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పెట్రోల్ అనడ్ డిజిల్ వెహికిల్, సీఎన్ ఆపరేటెడ్ వెహికిల్, నాయిజ్ పొల్యూషన్ సబ్జెక్టుల నుంచి 50 మార్కులు ఇస్తారు.
How to Apply
అభ్యర్థులు కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ (https://ssc.nic.in.) ను ఓపెన్ చేసి అందులో కుడివైపున కిందిభాగంలో కనిపిస్తున్న Register Now పై క్లిక్ చేయాలి. అందులో వివరాలు నింపి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, ఎస్సెస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి. అలాగే, జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Importanat Dates
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 29, 2022 (రాత్రి 11 గంటల వరకు)
దరఖాస్తు చెల్లింపునకు చివరి తేదీ: జూలై 30, 2022
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అక్టోబర్ నెలలో ఉంటుంది.
Website : https://ssc.nic.in/
– Constable Jobs in Delhi