Assistant Manager Jobs in SEBIA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Assistant Manager Jobs in SEBI : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) (Securities and Exchange Board of India-SEBI) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ (Information Technology Stream) లో ఆఫీసర్ గ్రేడ్-ఏ (అసిస్టెంట్ మేనేజర్) (Officer Grade-A (Assistant Manager)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 24 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Reservation Wise Vacancies

అన్ రిజర్వుడ్ (UR) – 11
ఓబీసీ (OBC) – 05
ఎస్సీ (SC) – 04
ఎస్టీ (ST) – 03
ఈడబ్ల్యూఎస్ (EWS) – 1
(B&LV-01, D&HH-1, LV-1)

Eligibility

  • ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
  • బ్యాచిలర్ డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్ట్
  • గ్రాడ్యుయేషన్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండు సంవత్సరాల కాలవ్యవధి అయి ఉండాలి.

Age Limit

  • జూన్ 30, 2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
  • జూలై 01, 1992న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ(నాన్ క్రిమీలేయర్లకు మూడు (03), దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Mode of Selection

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక విధానం మూడు దశలలో ఉంటుంది.
1. ఫేజ్-I (ఆన్ లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్)
2. ఫేజ్-II (అన్ లైన్ ఎగ్జామినేషన్)
3. ఫేజ్-III (ఇంటర్వ్యూ)
(తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/రంగారెడ్డి, విజయవాడ, విశాఖపట్నం)

Pay Scale

రూ.44500-2500(4)-54500-2850(7)-74450-EB-2850(4)-85850-3300(1)-89150 (17 years) + ఇతర అలవెన్సులు.
(రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది)

Application Fee

అన్ రిజర్వుడ్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ – రూ.1000
ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ – రూ.100

How to Apply

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు SEBI వెబ్ సైట్ www.sebi.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని, అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫొటో, సంతకం, వేలిముద్ర, డిక్లరేషన్ అప్ లోడ్ చేయాలి.
ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కే పంపిస్తారు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. అలాగే, రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ను కూడా నోట్ చేసుకోవాలి.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31, 2022
ఫేజ్-I (ఆన్ లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్) & పేపర్-1 ఎగ్జామ్ (ఫేజ్-II ఆన్ లైన్ ఎగ్జామినేషన్) : ఆగస్టు 27, 2022 (శనివారం)
పేపర్-2 ఎగ్జామ్ (ఫేజ్-II ఆన్ లైన్ ఎగ్జామినేషన్) సెప్టెంబర్ 24, 2022 (శనివారం)

– Assistant Manager Jobs in SEBI