Jobs in Secunderabad Cantonment Board : భారత రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry Of Defence, Govt. of India)కు చెందిన సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు (Secunderabad Cantonment Board) డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Direct Recruitment) ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్), ఎలక్ట్రిషియన్, ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (No.SCB/GEN/Recruitment/2022-23/2429) జారీ చేసింది. మొత్తం ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Assistant Engineer (Electrical)
2. Electrician
3. Tax Collector
Reservation Wise Vacancies
Assistant Engineer (Electrical) – 01 (UR)
Electrician – 02 (UR)
Tax Collector 05 (UR-02, OBC-01, SC-01, ST-01)
Qualification
- అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా B.E/B.Tech (Electrical) చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
- ఎలక్ట్రిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలక్ట్రిషియన్ ట్రేడ్ లో ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సబ్ మెర్సిబుల్, హై కెపాసిటీ, మోటార్ వైండింగ్ పంపులకు మరమ్మతులు చేయగలిగే వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- ట్యాక్స్ కలెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
Pay Scale
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – రూ.31,460-84,970
ఎలక్ట్రిషియన్ – రూ.17,890-53,950
ట్యాక్స్ కలెక్టర్ – రూ.15,030-46,060
Age Limit
- అక్టోబర్ 06, 2022 నాటికి అన్ రిజర్వుడ్ (UR) అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ (OBC) అభ్యర్డుల వయసు 21 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంటుంది.
- ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు, మాజీ సైనికులకు (Ex-Service) కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ (CBESR) ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్ సైట్ (https://secunderabad-cantt.azurewebsites.net/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. విద్యార్హతలు, అనుభవంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Application Fee
జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుకు రూ.500, ఎలక్ట్రిషియన్ పోస్టుకు రూ.400, ట్యాక్స్ కలెక్టర్ పోస్టుకు రూ.300 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు రూ.200 చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 06, 2022 (రాత్రి 11:59 వరకు)
– Jobs in Secunderabad Cantonment Board