Assistant Proffessors Jobs in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో వివిధ విభాగాలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (Director of Medical Education-DME) ఆధ్వర్యంలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా పెద్ద సంఖ్యలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Proffessors) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Mediacl Health Services Recruitment Board-MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 1,147 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Departments & Vacancies
Anatomy – 26, Physiology – 26
Pathology – 31, Community Medicine (SPM) – 23
Microbiology – 25, Forensic Medicine & Toxicology – 25
Bio-chemistry – 20, Transfusion Medicine – 14
General Medicine – 111, General Surgery – 117
Paediatrics – 77, Anaesthesia – 155
Radiodiagnosis – 46, Radiation Oncology (Radiotherapy) – 05
Psychiatry – 23, Respiratory Medicine (T.B.& C.D.) (Pulmonary Medicine) – 10
Dermatology, Venereology and Leprosy (DVL) (Dermatology, STD) – 13
Obstetrics and Gynecology – 142
Ophthalmology – 08, Orthopaedics – 62
Oto-Rhino Laryngology-Head and Neck (E.N.T) – 15
Hospital Admn – 14
Emergency Medicine – 15
Cardiology – 17
Thoracic Surgery/Cardiac Surgery (C.T.Surgery) – 21
Endocrinology – 12
Medical Gastroenterology (Gastro Enterology) – 14
Neurology – 11, Neuro-surgery – 16
Plastic and Reconstructive Surgery (Plastic-surgery) – 17
Paediatric Surgery – 08
Urology – 17, Nephrology – 10
Medical Oncology – 01
Qualifications
సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీ ఎన్ బీ చేసిన వారు అర్హులు.
Age Limit
ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాజీ సైనికులు (Ex-Servicemen), ఎన్సీసీ (N.C.C) అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (01) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.
Scale of Pay (UGC Scales)
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.68,900 నుంచి రూ.2,05,500 చెల్లిస్తారు.
Selection Procedure
మొత్తం 100 పాయింట్ల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్ఠంగా 80 మార్కులు కేటాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆసుపత్రులు, వివిధ కార్యక్రమాలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయిస్తారు.
How to Apply
- ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీ సెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన వెబ్ సైట్ (https://mhsrb.telan-
gana.gov.in) లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. - విద్యార్హతలు, అనుభవనంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
- అలాగే, అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి.
- జనరల్ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.200 ఆన్ లైన్ లో చెల్లించాలి.
- ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 20, 2022 ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జనవరి 05, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
Important Points
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు.
- ఈ రిక్రూట్మెంట్ లో అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారు.
- అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరి జతచేయాలి.
- అభ్యర్థులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకొని ఉండాలి.
– Assistant Proffessors Jobs in Telangana