Staff Nurse Jobs in TelanganaA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Staff Nurse Jobs in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,204 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. రాత పరీక్ష, వెయిటేజీ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Departments & Vacancies

1. Director of Medical Education/ Director of Public Health and Family Welfare – 3,823
2. Telangana Vaidya Vidhana Parishad – 757
3. MNJ Institute of Oncology & Regional Cancer Centre (MNJIO&RCC) – 81
4. Department for Disabled and Senior Citizens Welfare – 08
5. Telangana Minorities Residential Educational Institutions Society – 127
6. Mahatma Jyothiba Phule Telangana backward Classes Welfare Residential Educational Institutions Society – 197
7. Telangana Tribal Welfare Residential Educational Institutions Society (Gurukulam) – 74
8. Telangana Social Welfare Residential Educational Institutions Society – 124
9. Telangana Residential Education Institutional Society – 13

Qualifications

జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (General Nursing and Midwifery-GNM), లేదా బీ.ఎస్సీ(నర్సింగ్) (B.Sc (Nursing)) చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అలాగే, అభ్యర్థులు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నమోదు చేసుకొని ఉండాలి. సంబంధిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Age Limit

ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాజీ సైనికులు (Ex-Servicemen), ఎన్సీసీ (N.C.C) అభ్యర్థులకు మూడు (03) సంవత్స
రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (01) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.

Scale of Pay

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేలు రూ.36,750 – రూ.1,06,990 గా నిర్ణయించారు.

Selection Procedure

మొత్తం 100 పాయింట్ల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్ఠంగా 80 మార్కులు కేటాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆసుపత్రులు, వివిధ కార్యక్రమాలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి గరి
ష్ఠంగా 20 మార్కులు కేటాయిస్తారు.
గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 3 పాయింట్లు కేటాయిస్తారు.
కనీసం 6 నెలలు పనిచేస్తేనే ఈ మార్కులు కేటాయిస్తారు. అయితే, ఈ మార్కులకు సంబంధించి సంబంధిత విభాగం హెచ్పీడీ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

How to Apply

ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన వెబ్ సైట్ (https://mhsrb.telan-
gana.gov.in) లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు, అనుభవనంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
అలాగే, ఎగ్జామినేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.200 ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25, 2023 ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 15, 2023 సాయంత్రం 5 గంటల వరకు.

– Staff Nurse Jobs in Telangana