Jobs in NMDC : భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ (Ministry of Steel, Government of India) పరిధిలోని నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (National Mineral Development Corporation-NMDC) మెడికల్ ప్రొఫెషనల్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 46 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
Details of Posts
1. Medical Officer (General Medicine)
2. Radiologist
3. Administrative Officer (Finance & Accounts) Trainee
4. Administrative Officer (Materials & Purchase) Trainee
5. Administrative Officer (Personnel & Administration) Trainee
Medical Officer (General Medicine)
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్ (జనరల్ మెడిసిన్)
పోస్టుల సంఖ్య : మూడు (03)
అర్హతలు : MBBS పాసై.. మెడిసిన్ లో MD లేదా DNB చేసి ఉండాలి.
అనుభవం : నాలుగు (04) సంవత్సరాల అనుభవం ఉండాలి
వయసు : 45 సంవత్సరాలు ఉండాలి
పే స్కేల్ : రూ.70,000 – రూ. 2,00,000
Radiologist
పోస్టు పేరు: రేడియాలజిస్ట్
పోస్టుల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : MBBS పాసై.. రేడియాలజీలో MD లేదా DNB లేదా డిప్లొమా చేసి ఉండాలి.
అనుభవం : పన్నెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి
వయసు : 45 సంవత్సరాలు ఉండాలి
పే స్కేల్ : రూ.1,00,000 – రూ. 2,60,000
Administrative Officer (Finance & Accounts) Trainee
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ
పోస్టుల సంఖ్య : మొత్తం పదకొండు (11) (డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఐదు (05), ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ ఆరు (06) )
అర్హతలు : CA (Inter) లేదా ICWA-CMA (Inter) తో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
వయసు : 32 సంవత్సరాలు ఉండాలి.
Administrative Officer (Materials & Purchase) Trainee
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ & పర్చేజెస్) ట్రైనీ
పోస్టుల సంఖ్య : మొత్తం పదహారు (16). (డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎనిమిది (08), ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ ఎనిమిది (08) )
అర్హతలు : ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ డిగ్రీ చేసి ఉండాలి.
వయసు : 32 సంవత్సరాలు ఉండాలి.
Administrative Officer (Personnel & Administration) Trainee
పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ
పోస్టుల సంఖ్య : మొత్తం పదిహేను (15) (డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఐదు (08), ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ ఏడు (07) )
అర్హతలు : సోషియాలజీ/సోషల్ వర్క్/ లేబర్ వెల్ఫేర్/ పర్సనల్ మేనేజ్మెంట్/ /IR/IRPM/HR/ HRM లో పడీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా చేసి ఉండాలి. లేదా Personnel
Management/HR/HRM లో రెండు సంవత్సరాల MBA కోర్సు చేసి ఉండాలి.
వయసు : 32 సంవత్సరాలు ఉండాలి.
పై పోస్టులకు పద్దెనమిది నెలలు (18) నెలలు) ట్రైనింగ్ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.37,000 స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత పే స్కేల్ రూ.37,000 నుంచి రూ.1,30,000 ఉంటుంది.
How to Apply Administrative Officer Posts
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ & పర్చేజెస్) ట్రైనీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ పోస్టులకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. NMDC కి చెందిన వెబ్ సైట్ (www.nmdc.co.in) నుంచి దరఖాస్తు చేసుకోవాలి. Careers లో ఆన్ లైన్ అప్లికేషన్ ఉంటుంది. దాని ద్వారా అప్లై చేసుకోవాలి. సంబంధిత వివరాలు నింపి సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.250 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మాజీ సైనికులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లో అప్లై చేస్తున్న సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 7044599061 నెంబర్ కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.02.2023 రాత్రి 11:59 వరకు
How to Attend Medical Officer, Radiologist Posts
మెడికల్ ఆఫీసర్ (జనరల్ మెడిసిన్), రేడియాలజిస్ట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. మొత్తం నాలుగు సెంటర్ల (విశాఖపట్నం, హైదరాబాద్, నాగ్పూర్, జబల్పూర్)లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ నాలుగు సెంటర్లలో ఎక్కడైనా హాజరు కావొచ్చు. అభ్యర్థులు బయోడేటా ఫాం, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ సెల్ఫ్ అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలు, రెండు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉదయం 9:30 గంటలకు ఎంచుకున్న సెంటర్ కు వెళ్లాలి. ఉదయం 11 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రెండో రోజు కూడా ఇంటర్వ్యూలు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు రెండోరోజు కూడా అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు ఏజీ 2 టైర్ ట్రెయిన్ చార్జీ చెల్లిస్తారు.
Date, Place, Venue of InInterview
17.02.2023 (Visakhapatnam)
Hotel Green Park,
Waltair Main Rd, Jagadamba Centre,
Visakhapatnam, Andhra Pradesh – 530002
20.02.2023 (Hyderabad)
Hotel Hyatt Place,
Opposite GVK Mall, Road No. 2,
Banjara Hills, Hyderabad, Telangana 500034.
24.02.2023 (Nagpur)
Hotel Le Meridien,
Wardha Road, Opp. Mihan Flyover,
Nagpur, Maharashtra 441108
26.02.2023 (Jabalpur)
Samdariya Hotel Pvt.Ltd,
Samdariya Hotel – Russell Chowk,
Jabalpur, Madhya Pradesh
Importanat Points
- పైన సూచించిన వయసు జనరల్ అభ్యర్థులకు మాత్రమే.
- ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) లకు మూడు సంవత్సరాల సడలింపు ఉంది.
- దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులు కి దేశ వ్యాప్తంగా ఉన్న NMDCకి చెందిన బ్రాంచ్లలో పనిచేయాల్సి ఉంటుంది.
– Jobs in NMDC