ASI Constable Jobs : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India, Ministry of Home Affairs) కు చెందిన డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Directorate General Border Security Force)లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), కానిస్టేబుల్ గ్రూప్ – సీ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 26 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) (Assistant Aircraft Mechanic (Assistant Sub-Inspector))
2. అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) (Assistant Radio Mechanic (Assistant Sub-Inspector))
3. కానిస్టేబుల్ (స్టోర్‌మెన్) (Constable (Storeman))
Category Wise Vacancies
Assistant Aircraft Mechanic (Total-13) :
Rotary Wing :
Mechanical (Airframe & Engine) : ST-01
Avionics (Elect, Instrument, Radio/Radar) : UR-01, SC-01, ST-01
Fixed Wing :
Mechanical : UR-03, SC-02, ST-01, Ex-S/Man – 01
Avionics (Elect & Instrument) : UR-01, SC-01, ST-01
Assistant Radio Mechanic (Total-11) :
Rotary Wing :
Avionics (Radio/Radar) : UR-02
Fixed Wing :
Avionics (Radio) : UR-01
ALH/Dhruv :
Avionics : UR-05, OBC-03, Ex-S/Man – 01
Avionics (Elect & Instrument) : UR-01, SC-01, ST-01
Constable (Storeman) : UR-02
Salary
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) : రూ.29,200 – రూ.92,300
అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) : రూ.29,200 – రూ.92,300
కానిస్టేబుల్ (స్టోర్‌మెన్) : రూ.21,700 – రూ.69,100
Qualification
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు పొందిన మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జారీ చేసిన గ్రూప్ “X” సర్టిఫికెట్ కలిగి ఉండాలి. డిప్లొమా కోర్సు పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాల ఏవియేషన్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ గుర్తింపు పొందిన మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జారీ చేసిన గ్రూప్ “X” రేడియో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి. బార్డర్ సెక్కూరిటీ ఫోర్స్ కలిగి ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ లేదా హెలికాప్టర్లో అమర్చిన కమ్యూనికేషన్ లేదా నావిగేషన్ పరికరాల మెయింటనెన్స్ మరియు ఓవర్‌హాలింగ్‌లో రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
కానిస్టేబుల్ (స్టోర్‌మెన్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. ఏదైనా ప్రభుత్వ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్ లేదా ఏదైనా కంపెనీ లేదా ప్రైవేట్ సంస్థ లేదా ఇన్స్టిట్యూషన్లో స్టోర్ లేదా వేర్‌హౌస్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
Age limit
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్), అసిస్టెంట్ రేడియో మెకానిక్ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 28 సంవత్సరాలు, కానిస్టేబుల్ (స్టోర్‌మెన్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంటుంది.
How to Apply
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్ఎఫ్ (BSF) వెబ్సైట్ https://rectt.bsf.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.147.20 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 20, 2023, రాత్రి 11:59 గంటల వరకు.
– ASI Constable Jobs