Education

Admissions in Master of Public Health Course

Admissions in MPH Course : వరంగల్​లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of Health Sciences – KNRUHS) 2023-24 విద్యా సంవత్సరానికి గాను మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Master of Public Health – MPH) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 60 సీట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కులను బట్టి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Course

మొత్తం సీట్లు – 60
కాంపిటెంట్ అథారిటీ కోటా – 30 సీట్లు
మేనేజ్మెంట్ కోటా – 16 సీట్లు
ఫారిన్ నేషనల్స్ కోటా – 04 సీట్లు

Educational Qualification

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ ప్రదానం చేసిన విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీలో సభ్యత్వం కలిగి ఉండాలి.
డిస్టెన్స్ మోడ్ లో డిగ్రీ చేసినట్టయితే ఆ యూనివర్సిటీ యూజీసీ, ఏఐయూ తో పాటు దూర విద్యా మండలి (డీఈసీ) గుర్తింపు పొంది ఉండాలి.

Course Duration

కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఒక్కో సెమిస్టర్ ఆరు నెలలు ఉంటుంది. రెండో సెమిస్టర్ లో రెండు నెలల ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఇంటర్న్ షిప్ సమయంలో విద్యార్థులు రెండు నెలలు ఫీల్డ్ శిక్షణ పొంది నివేదిక అందించాల్సి ఉంటుంది.
కాంపిటెంట్ అథారిటీ కోటా మరియు మేనేజ్మెంట్ కోటాలో సీటు రావాలంటే అభ్యర్థులు ఎంట్రెన్స్ టెస్ట్ లో కనీసం 40 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 శాతం వచ్చినా సరిపోతుంది.

Age Limit

ఈ కోర్సుకు గరిష్ట వయోపరిమితి ఏమీ లేదు. పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యండా ఉండాలి.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీకి చెందిన వెబ్ సైట్ (https://www.knruhs.telangana.gov.in/) ద్వారా అప్లై చేసుకోవాలి.
దానిలోని వివరాలన్నీ నింపి, సంబంధిత డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత దానిని ప్రింట్ తీసుకొని సంబంధిత డాక్యుమెంట్లు జతచేసి నవంబర్ 19, 2022లోపు ఈ కింది చిరునామాకు పంపించాలి.
To
The Convener,
PG Admissions Committee,
KNR University of Health Sciences,
Warangal.
కవర్​పైన “KNRUHS MPH ET-2023” అని రాయాలి. దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఆన్ లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ కు ఆహ్వానిస్తారు.

Important Dates

దరఖాస్తుల సమర్పణ : ఆగస్టు 1, 2023 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 13, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
పూర్తిచేసిన దరఖాస్తు పంపించడానికి చివరి తేదీ : ఆగస్టు 14, 2023 సాయంత్రం 5 గంటల వరకు
హాల్ టికెట్ల డౌన్ లోడ్ : ఆగస్టు 21, 2023 నుంచి
కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్ : ఆగస్టు 27, 2023 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది.
అభ్యర్థులు 1:30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
ఫలితాల ప్రకట : సెప్టెంబర్ 02, 2023
పరీక్ష కేంద్రం హైదరాబాద్ లో ఉంటుంది.
ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే 9490823776 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.
అర్హతలు, నిబంధనల కోసం 9490585796 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.
– Admissions in MPH Course

Kautilya Creative

Recent Posts

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

3 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

5 months ago

Jobs in ESI Dispensaries and Diagnostic Centres

Jobs in ESI Dispensaries : తెలంగాణ ప్రభుత్వ బీమా వైద్య సేవల శాఖ (Government of Telangana Insurance…

8 months ago

Nursing Officer Jobs in All India Institute of Medical Sciences

Nursing Officer in AIIMS : ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(All India Institute of Medical…

9 months ago

Para Medical Jobs in Satish Dhawan Space Centre Shar

Para Medical Jobs in Shar : భారత ప్రభుత్వ (Government of India) స్పేస్ డిపార్ట్‌మెంట్ (Department of…

9 months ago

Free Long Term IIT Coaching for SC, ST Students

Long Term IIT Coaching : హైదరాబాద్​లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ…

10 months ago