Education

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్​ (ఇంగ్లిష్​ మీడియం) మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్​ జారీ చేసింది. తెలంగాణ స్టేట్​ రెసిడెన్షియల్​ జూనియర్​ కాలేజ్ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ – 2024 ​ (Telangana State Residential Junior College Common Entrance Test – 2024) (టీఎస్​ ఆర్జేసీ సెట్​ – 2024..TSRJC CET–2024) ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35 గురుకుల జూనియర్​ కళాశాలలు ఉన్నాయి. అందులో బాలికల కళాశాలలు 20, బాలుర కళాశాలలు 15 ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ(MPC), బీపీసీ(BPC), ఎంఈసీ(MEC) గ్రూపులలో ఇంగ్లిష్​ మీడియంలో ఉచితంగా విద్యా బోధన చేస్తారు. ఎంపీసీ గ్రూపులో 1,496 సీట్లు, బీపీసీ గ్రూపులో 1,440 సీట్లు, ఎంఈసీ గ్రూపులో 60 సీట్లు ఉంటాయి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్​ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

ఎవరు అర్హులు:

ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 2024 మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్​ అటెమ్ట్​లో పాస్​ కావాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు 6 జీపీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు 5 జీపీఏ సాధించాలి. అన్ని కేటగిరీల విద్యార్థులు ఇంగ్లిష్​ సబ్జెక్టులో 4 జీపీఏ సాధించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోనే చదివి ఉండాలి.

ప్రవేశ పరీక్ష:

  • ప్రవేశ పరీక్ష రెండున్నర గంటలు ఉంటుంది.
  • మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు అబ్జెక్టివ్​ టైపులో అడుగుతారు.
  • టెస్ట్​ ఓఎంఆర్​ షీట్​లో రాయాల్సి ఉంటుంది. పరీక్ష గ్రూపుల వారీగా నిర్వహిస్తారు.
  • ఎంపీసీ గ్రూపు టెస్ట్​లో ఇంగ్లిష్​, మ్యాథమెటిక్స్​, ఫిజికల్​ సైన్స్​ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • బీపీసీ గ్రూపు టెస్ట్​లో ఇంగ్లిష్​, బయో సైన్స్​​, ఫిజికల్​ సైన్స్​ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • ఎంఈసీ గ్రూపు టెస్ట్​లో ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​​, మ్యాథమెటిక్స్ ​ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • ప్రవేశ పరీక్ష ఏప్రిల్​ 21, 2024 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఉంటుంది.
  • పరీక్ష కేంద్రాలు ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఉంటాయి.
  • ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లో ఉంటుంది. పరీక్ష అనంతరం కౌన్సెలింగ్​ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

ఎలా అప్లై చేయాలి:

ఆసక్తి కలిగిన విద్యార్థులు http://tsrjdc.cgg.gov.in. వెబ్​సైట్​ నుంచి ఆన్​లైన్​ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ప్రాస్పెక్టస్, యూజర్​ మాన్యువల్​ పూర్తిగా చదివి.. అందులో సూచించిన విధంగా అప్లై చేసుకోవాలి. పరీక్ష ఫీజు నిమిత్తం రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్​లైన్​లో లేదా క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా కూడా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ముందుగా పరీక్ష ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ఆన్​లైన్​ అప్లికేషన్​ పూర్తి చేసి సబ్మిట్​ చేయాలి. ఆన్​లైన్​లో పూర్తి చేయాల్సిన ఫాంను ప్రాస్పెక్టస్​ లో (Prospectus – TSRJC CET-2024) ఇచ్చారు. ముందు దానిని నమూనాగా పూర్తిచేసి ఆ తర్వాత ఆన్​లైన్​లో నింపాలి. అలాగే, యూజర్​ మ్యాన్యువల్​ కూడా ఇచ్చారు. దాంట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు మార్చి 16, 2024 చివరి తేదీ.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : 16–03–2024
  • ప్రవేశ పరీక్ష తేదీ : 21–04–2024
  • తొలి విడత కౌన్సెలింగ్​ : మే, 2024

వెబ్​సైట్​ : https://tsrjdc.cgg.gov.in

‌‌‌‌- Admissions in Residential Junior Colleges

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago

Jobs in ESI Dispensaries and Diagnostic Centres

Jobs in ESI Dispensaries : తెలంగాణ ప్రభుత్వ బీమా వైద్య సేవల శాఖ (Government of Telangana Insurance…

1 year ago