Admissions in SVV University : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో గల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (Sri Venkateswara Vedic University-Tirupati) సంప్రదాయ కోర్సులైన శాస్త్రి(బీఏ), ఆచార్య(పీజీ), విద్యావారిధి(పీహెచ్ డీ)లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. అభ్యర్థులకు సంస్కృత భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. శిక్షణ పూర్తిగా ఉచితం. అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు అందజేస్తారు. వీటితోపాటు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు.
Courses Details
Sastri (B.A.)
(వేదములలో క్రమాంతం)
కోర్సులు: 1.ఋగ్వేదం 2. కృష్ణయజుర్వేదం 3. శుక్లయజుర్వేదం (కాణ్వ/మాధ్యందిన) 4.అథర్వవేద (శౌనక శాఖ) 5.సామవేదంలో రహస్యాంతం (కౌథుమ/రాణాయనీయ
అర్హతలు: సంబంధిత వేదంలో మూలాంత అధ్యయనం (సంహిత + బ్రాహ్మణం + అరణ్యకం + ఉపనిషత్తులు)
వయసు: జూన్ 30 నాటికి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 15
(ఆగమంలో ప్రతిష్టాంతం)
కోర్సులు: 1. వైఖానస 2. పాంచరాత్ర 3. శైవ
అర్హతలు: సంబంధిత ఆగమములో బ్రహ్మోత్సవాంతం అధ్యయం చేసి ఉండాలి.
వయసు: జూన్ 30 నాటికి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 15
(పౌరోహిత్యాలలో షోడశ సంస్కారాంతం)
కోర్సులు: 1.ఆశ్వలాయన 2. ఆపస్తంబ 3. వైఖానస (అష్టాదశ సంస్కారం తం) 4. పారస్కర
అర్హతలు: సంబంధిత సూత్రంలో ఉపనయానాంతం అధ్యయనం చేసి ఉండాలి.
వయసు: జూన్ 30 నాటికి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 15
(వేదభాష్యం)
కోర్సులు: 1. ఋగ్వేదం 2. కృష్ణయజుర్వేదం 3. శుక్లయజుర్వేదం (కాణ్వ/మాదందిన) 4.సామ వేదం 5. అథర్వ వేదభాష్యం
అర్హతలు: సంబంధిత వేదంలో మూలాంత అధ్యయనం (సంహిత + బ్రాహ్మణం + ఆరణ్యకం + ఉపనిషత్తులు)
వయసు: జూన్ 30 నాటికి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 15
6. కల్పం(శ్రౌతం)
అర్హతలు: ఏదేని వేదంలో మూలాంత అధ్యయనం
వయసు: జూన్ 30 నాటికి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 15
7. మీమాంస
అర్హతలు: ఏదేని వేదంలో మూలాంత అధ్యయనం, సంస్కృత పరిజ్ఞానం.
వయసు: జూన్ 30 నాటికి 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: మూడేళ్లు
సీట్లు: 15
Acharya (M.A.)
(వేదములలో ఘనాంతం)
కోర్సులు: 1.ఋగ్వేదం 2.కృష్ణయజుర్వేదం 3. శుక్లయజుర్వేదం (కాణ్వ/మాధ్యందిన 4. సామవేదంలో సలక్షణాంతం (కౌథుమ/రాణాయనీయ) 5.అధర్వవేదంలో సలక్షణాంతం (శౌనక శాఖ)
అర్హతలు: సంబంధిత వేదంలో క్రమాంతం ఉత్తీర్ణత. సామవేదంలో రహస్యాంతం ఉత్తీర్ణత. అథర్వవేదంలో పదాంతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: జూన్ 30 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: రెండేళ్లు
సీట్లు: 15
(ఆగమమంలో ఘనాంతం)
కోర్సులు: 1.వైఖానస 2. పాంచరాత్ర 3.శైవ
అర్హతలు: సంబంధిత ఆగమమంలో ప్రతిష్టాంత భాగంలో ఉత్తీర్ణత.
వయసు: జూన్ 30 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: రెండేళ్లు
సీట్లు: 15
(పౌరోహిత్యంలో ఘనాంతం)
కోర్సులు: 1.ఆశ్వలాయన 2. ఆపస్తంబ 3. వైఖానస 4. పారస్కర
అర్హతలు: సంబంధిత సూత్రంలో షోడశ సంస్కారాంత భాగంలో ఉత్తీర్ణత. వైఖానస పౌరోహిత్యం కోసం అష్టాదశ సంస్కారాంత భాగంలో ఉత్తీర్ణత
వయసు: జూన్ 30 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండాలి.
వ్యవధి: రెండేళ్లు
సీట్లు: 15
(వేద భాష్యంలో ఘనంతం)
కోర్సులు: 1.ఋగ్వేదం 2.కృష్ణయజుర్వేదం 3. శుక్లయజుర్వేదం (కాణ్వ/ మాధ్యందిన) 4.సామ వేదం 5. అథర్వవేదభాష్యం
అర్హతలు: సంబంధిత వేదభాష్యంలో శాస్త్రి లేదా వేదభాష్యంలో తత్సమాన స్థాయి విద్యాభాస్వం. ప్రముఖ వేదభాష్య సభల ద్వారా నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత
వయసు: జూన్ 30 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండాలి
వ్యవధి: రెండేళ్లు
సీట్లు: 15
6.కల్పం(శ్రౌతం)
అర్హతలు: శ్రాతము నందు శాస్త్రి/తత్సమాన స్థాయి విద్యాభ్యాసం. ప్రముఖ శ్రౌత సభల ద్వారా నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత
వయసు: జూన్ 30 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: రెండేళ్లు
సీట్లు: 15
7. మీమాంస
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి శాస్త్రి లేదా మీమాంస శాస్త్రంలో తత్సమాన స్థాయి విద్యాభాస్యం. ప్రముఖ శాస్త్ర సభల ద్వారా నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: జూన్ 30 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
వ్యవధి: రెండేళ్లు
సీట్లు: 15
VidyaVaridhi (Ph.D)
కోర్సులు: 1. వేదం 2. వేదభాష్యం 3. పౌరోహిత్యం 4.అగమమం 5. మీమాంస
అర్హతలు: వేద విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ఏదైనా పాఠ్యాంశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో 55 శాతం మార్కులతో పీజీ కోర్సులో ఉతీర్ణత సాధించి ఉండాలి.
వయసు: అభ్యర్థి దరఖాస్తు చేసుకొనే నాటికి 22 సంవత్సరాలు నిండి ఉండాలి.
సీట్లు: యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ సిఫారుల ఆధారంగా సీట్ల సంఖ్య ఉంటుంది.
Diploma Courses in Veda
కోర్సులు: 1.ఋగ్వేదం 2.కృష్ణయజుర్వేదం 3. శుక్లయజుర్వేదం 4.సామవేదం 5. అథర్వవేదం 6. టెంపుల్ మేనేజ్ మెంట్
అర్హతలు: ఏదైనా వేద శాఖలో సంహితాంత అధ్యయనం. టెంపుల్ మేనేజ్ మెంట్ కోర్సుకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన స్థాయి విద్యాభ్యాసం. ఆగమ పరిజ్ఞానం.
వయసు: జూన్ 30, 2022 వరకు 16 సంవత్సరాలు నిండి ఉండాలి.
P.G. Diploma Courses
కోర్సులు:
1.కృష్ణయజుర్వేదీయ లక్షణశాస్త్రం
అర్హతలు: కృష్ణయజుర్వేదం నందు శాస్త్రి లేక క్రమాంత అధ్యయనం
2.పౌరోహిత్యం
అర్హతలు: శాస్త్రి లేక షోడశ సంస్కారాంత అధ్యయనం
3.వేదాంగం
అర్హతలు: ఏదైనా వేద శాఖలో మూలాంత అధ్యయనం
వయసు: జూన్ 30, 2022 నాటికి 20 సంవత్సరాలు నిండి ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు తిరుపతిలోని అలిపిరిచంద్రగిరి బైపాస్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా విశ్వవిద్యాలయం వెబ్ సైట్ (www.svvedicuniversity.ac.in) నుంచి దరఖాస్తు పత్రం, ప్రాస్పెక్టస్ పొందవచ్చు.
Cash Incentives
- రెగ్యులర్ సంప్రదాయ కోర్సులలో చేరిన విద్యార్థులకు ఈ కింది విధంగా నగదు ప్రోత్సాహకాలు అందజేస్తారు.
- శాస్త్రి (వేదం, మీమాంస) – రూ.3లక్షలు, ఆగమం, పౌరోహిత్యం – రూ.2 లక్షలు, కల్పం, భాష్యం – రూ.4లక్షలు
- ఆచార్య (వేదం, ఆగమం, పౌరోహిత్యం, మీమాంస) – రూ.1లక్ష, కల్పం, భాష్యం – రూ.1.50లక్షలు
- విద్యావారిధి (ప్రథమ సంవత్సరం) – ప్రతినెలా రూ.10 వేల స్టైపెండ్, ద్వితీయ సంవత్సరం – ప్రతినెలా రూ.12 వేల స్టైపెండ్, తృతీయ సంవత్సరం – ప్రతినెలా రూ.15 వేల స్టైపెండ్
Important Dates
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15, 2022 (విద్యావారిధి కోర్సుకు జూన్ 30)
కోర్సుల ప్రవేశ పరీక్ష: 24, జూన్ 2022 (పీహెచ్ డీ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తారు)
వోరల్ ఇంటర్వ్యూ: 25, 26 జూన్ 2022
ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం: Saradadhamam (Acad. Block), S.V.Vedic University, Alipiri-Chandragiri By-Pass Road, Tirupati- 517502.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 08772264651/9490184039
వెబ్ సైట్: www.svvedicuniversity.ac.in
– Admissions in SVV University