Agniveer Selections in TelanganaA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Agniveer Selections in Telangana : అగ్నిపథ్​ పథకం​ (Agnipath Scheme)లో భాగంగా సికింద్రాబాద్​ ఆర్మీ రిక్రూటింగ్​ ఆఫీస్ (Army Recruiting Office(ARO), Secunderabad) 2023–24 సంవత్సరానికి అగ్నివీరుల (Agniveer) నియామకానికి నోటిఫికేషన్​ జారీ చేసింది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ కంప్యూటర్​ బేస్డ్​ రాత పరీక్ష, రిక్రూట్​మెంట్​ ర్యాలీ, మెడికల్​ టెస్టులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ నిర్వహించి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఆర్మీలో నాలుగేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Categories

1. అగ్నివీర్ జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మ్స్) (Agniveer General Duty
(All Arms))
2. అగ్నివీర్ టెక్నికల్ (ఆల్ ఆర్మ్స్) (Agniveer Technical (All Arms))
3. అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ (ఆల్ ఆర్మ్స్) (Agniveer Clerk/ Store Keeper Technical)
(All Arms)
4. అగ్నివీర్ ట్రేడ్స్​మ్యాన్​(10th పాస్) (ఆల్ ఆర్మ్స్) (Agniveer Tradesman 10th pass (All Arms))
5. అగ్నివీర్ ట్రేడ్స్​మ్యాన్​ (8th పాస్) (ఆల్ ఆర్మ్స్) (Agniveer Tradesman 8th pass
(All Arms) )

పై పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల (ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, ములుగు, నారాయణపేట) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆర్మీలో నాలుగు (04) సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.

  • మొదటి సంవత్సరం నెలకు రూ.30 వేల జీతం చెల్లిస్తారు. ఇందులో రూ.9వేలు కార్పస్​ ఫండ్ లో జమ చేస్తారు. చేతికి రూ.21 వేలు అందుతుంది.
  • రెండో సంవత్సరం నెలకు రూ.33 వేల జీతం చెల్లిస్తారు. ఇందులో రూ.9,900 కార్పస్​ ఫండ్ లో జమ చేస్తారు. చేతికి రూ.23,100 అందుతుంది.
  • మూడో సంవత్సరం నెలకు రూ.36,500 జీతం చెల్లిస్తారు. ఇందులో రూ.10,980 కార్పస్​ ఫండ్ లో జమ చేస్తారు. చేతికి రూ.25,520 అందుతుంది.
  • నాలుగో  సంవత్సరం నెలకు రూ.40 వేల జీతం చెల్లిస్తారు. ఇందులో రూ.12 వేలు కార్పస్​ ఫండ్ లో జమ చేస్తారు. చేతికి రూ.28 వేలు అందుతుంది.
  • ఈ నాలుగేండ్లలో కార్పస్ ఫండ్ లో మొత్తం 5 లక్షల 2 వేలు జమ అవుతాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం మరో 5 లక్షల 2 వేలు అదనంగా జమ చేస్తుంది. నాలుగేళ్లు పూర్తయిన తర్వాత రూ.11 లక్షల 71 వేల రూపాయలు చెల్లిస్తారు.
  • ఈ డబ్బుకు ఇన్​కం ట్యాక్స్​ మినహాయింపు కూడా ఉంటుంది.

Qualification

  • జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మ్స్) : 45 శాతం మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులు వచ్చి ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ పోస్టులలో ప్రాధాన్యత ఇస్తారు.
  • టెక్నికల్ (ఆల్ ఆర్మ్స్) : సైన్స్‌ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) మ్యాథ్స్, ఇంగ్లిష్​ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.  లేదా 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై, రెండు సంవత్సరాల ఐటీఐ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
  • క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ (ఆల్ ఆర్మ్స్) : ఆర్ట్స్​, కామర్స్​, సైన్స్​ గ్రూపులలో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్​ పాసై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
  • ట్రేడ్స్​మ్యాన్​(10th పాస్) (ఆల్ ఆర్మ్స్) : ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి.
  • ట్రేడ్స్​మ్యాన్​ (8th పాస్) (ఆల్ ఆర్మ్స్) : ప్రతి సబ్జెక్టులో 33 శాతం మార్కులతో 8వ తరగతి పాసై ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అక్టోబర్​ 01, 2002 నుంచి ఏప్రిల్​ 01, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు.

Measurements

అగ్నివీర్​ జనరల్ డ్యూటీ / ట్రేడ్స్​ మ్యాన్​ అభ్యర్థుల ఎత్తు 166 సెం.మీ, టెక్నికల్​ అభ్యర్థులు 165 సెం.మీ, క్లర్క్​ / స్టోర్​ కీపర్​ టెక్నికల్​ అభ్యర్థుల ఎత్తు 162 సెం.మీ. ఉండాలి. ఛాతీ 77 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించాలి.

How to Apply

ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. www.joinindianarmy.nic.in ను ఓపెన్​ చేసి అందులో Agnipath పై క్లిక్​ చేసి అందులో ముందుగా ఎలిజిబిలిటీ చెక్​ చేసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్​ చేసుకొని అప్లై చేసుకోవాలి. పరీక్ష ఫీజు నిమిత్తం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 17 నుంచి ఆన్​లైన్​ కంప్యూటర్ బేస్డ్​ రాత పరీక్షలు ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్ధ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల వడపోత అనంతరం నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేస్తారు.

ఏమైనా సందేహాలు ఉంటే 040-27740059, 27740205 (Army Recruiting Office, Secunderabad) నెంబర్లకు కాల్​ చేసి తెలుసుకోవచ్చు.

– Agniveer Selections in Telangana