Apprentice Jobs

Graduate and Technician Apprentices in TSRTC

Apprentice Jobs in TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation-TSRTC) గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) మరియు టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ షిప్ (Apprenticeship) శిక్షణ పొందేందుకు అర్హులైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా హోల్డర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Region Wise Vacancies

మొత్తం 300 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి టీఎస్ ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు రీజియన్ వారీగా ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ -51, సికింద్రాబాద్-36, మహబూబ్ నగర్-27, మెదక్-24, నల్గొండ-21, రంగారెడ్డి-21, ఆదిలాబాద్-18, కరీంనగర్-30, ఖమ్మం-18, నిజామాబాద్-18, వరంగల్-27, NOUs-09.

Educational Qualification

గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్ అప్రెంటిస్ పోస్టుకు బీ.ఈ (Bachelor of Engineering) లేదా బీ.టెక్ (Bachelor of Technology) పాసైన అభ్యర్థులు అర్హులు. అలాగే, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుకు ఇంజినీరింగ్ లో ఏ బ్రాంచ్ లోనైనా డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసినవారికి, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

Age Limit

అభ్యర్థుల వయసు జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దివ్యాంగులు ఈ పోస్టులకు అనర్హులు.

Duration & Stipend

అప్రెంటిస్ షిప్ వ్యవధి మూడు (03) సంవత్సరాలు. శిక్షణ కాలంలో గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) అప్రెంటిస్ కు మొదటి సంవత్సరం నెలకు రూ.18,000, రెండో సంవత్సరం రూ.20,000, మూడో సంవత్సరం రూ.22,000 స్టైపెండ్ చెల్లిస్తారు. అలాగే, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ కు మొదటి సంవత్సరం నెలకు రూ.16,000, రెండో సంవత్సరం రూ.17,500, మూడో సంవత్సరం రూ.19,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

How to Apply

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ (NATS) వెబ్ సైట్ (www.mhrdnats.gov.in) లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఆన్ లైన్ లో (User ID: STLHDS000005) టీఎస్ ఆర్టీసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Selection Procedure

ఇంజినీరింగ్ మరియు డిప్లొమాలో సాధించిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల జాబితా తయారు చేస్తారు. అనంతరం టీఎస్ ఆర్టీసీ రిజినల్
కార్యాలయాల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వచ్చే అభ్యర్థులకు టీఏ, డీఏ ఇవ్వబడవు.
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు NATS రిజిస్ట్రేషన్ ఫాంతో పాటు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.
వంద రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ సంతకం చేసి సంబంధిత రీజినల్ మేనేజర్ కు అందజేయాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థి ఒకవేళ ఏడాదిలోపు శిక్షణ నుంచి వైదొలిగితే ఆర్టీసీకి రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది.
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పొందుతున్న డిపో నుంచి తమ నివాసానికి సిటీ ఆర్డినరీ, సబ్ అర్బన్, జిల్లా ఆర్డినరీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు.
ప్రతి అప్రెంటిస్ కు వారానికి ఒకరోజు సెలవు (వీక్లీ ఆఫ్), సంవత్సరానికి 12 సీఎల్స్ ఉంటాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: 15 జూన్, 2022

– Apprentice Jobs in TSRTC

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago