Apprentices Vacancies in ECIL : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited-ECIL) 2022-23 సంవత్సరానికిగాను గ్రాడ్యుయేట్ ఇంజినీర్/ టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ (Graduate Engineer/Technican (Diploma) Apprentices) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.27/2022) జారీ చేసింది. మొత్తం 212 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ (Engineering Graduates (GEA)) – 150
2. డిప్లొమా అప్రెంటిస్ షిప్ (Diploma Holders (TA)) – 62
1. ECE
2. CSE
3. MECH
4. EEE
5. EIE
6. CIVIL
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం AICTE ఆమోదించిన కళాశాలలు/ గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీ నుంచి ఏప్రిల్ 01, 2022 నాటికి పైన పేర్కొన్న ఇంజినీరింగ్ బ్రాంచ్ లలో B.E/B.Tech కోర్సులలో ఉత్తీర్ణులై ఉండాలి.
డిప్లొమా అప్రెంటిస్ కోసం పైన పేర్కొన్న ఇంజినీరింగ్ బ్రాంచ్ లలో ఏప్రిల్ 01, 2022 నాటికి మూడు (03) సంవత్సరాల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 25 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Engineering Graduates (GEA) నెలకు రూ.9,000
Diploma Holders (TA) నెలకు రూ.8000 చెల్లిస్తారు.
అప్రెంటిస్ షిప్ వ్యవధి : ఒక సంవత్సరం
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా
www.mhrdnats.gov.in వెబ్ సైట్ ద్వారా నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రెయినింగ్ స్కీమ్ (NATS) లో ఎన్ రోల్ చేసుకోవాలి.
ఆ తర్వాత ECIL వెబ్ సైట్ (www.ecil.co.in) లలోకి లాగిన్ కావాలి.
అందులో Careers లో Current Job Openings పైక్లిక్ చేయాలి.
ఆ తర్వాత అందులో Click here to apply పైక్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
సంబంధిత డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 26 డిసెంబర్, 2022 (రాత్రి 10 గంటల వరకు)
తాత్కాలిక సెలక్షన్ లిస్ట్ ప్రదర్శన : 28 డిసెంబర్, 2022
జాయినింగ్ ప్రక్రియ పూర్తి : 31 డిసెంబర్, 2022
అప్రెంటిస్ షిప్ ట్రెయినింగ్ ప్రారంభం: 02 జనవరి, 2023
– Apprentices Vacancies in ECIL
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…