Assistant Engineer Jobs in TSNPDCL

Assistant Engineer Jobs in TSNPDCL : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (Northern Power Distribution Company of Telangana Ltd-(TSNPDCL)) జనరల్, లిమిటెడ్ రిక్రూట్ మెంట్ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (Assistant Engineer (Electrical)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.01/2022) జారీ చేసింది. జనరల్ రిక్రూట్ మెంట్ ద్వారా 78 పోస్టులు, లిమిటెడ్ రిక్రూట్ మెంట్ ద్వారా 4 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేస్తారు. సంస్థ పరిధిలోని 18 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం, ఇతరులకు 5 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పరీక్ష నిర్వహిస్తారు.
వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, మహబుబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి.

Vacancies

General Recruitment
OC(G)-1 (5%), 16 (95%), (W)-11 (95%)
EWS(G)-6, (W)-2 (95%)
BC-A(G)-4, (W)-1 (95%)
BC-B(G)-1(5%), 5(95%),(W)-3(95%)
BC-D(G)-5, (W)-1 (95%)
BC-E(G)-3 (95%)
SC(G)-1(5%), 7(95%), (W)-3 (95%)
ST(G)-1(5%), 3(95%), (W)-1 (95%)
PH-3(95%)

Limited Recruitment
OC(G)-1
BC-A(G)-1
BC-D(G)-1
PH-VH-1

Qualifications

అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసి ఉండాలి.

Age

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (SC/ST/BC/EWS) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Scale of Pay

రూ.64295-2655-69605-3100-85105-3560-99345

Application and Examination Fee

ప్రతి అభ్యర్థి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు. ఫీజు మినహాయింపు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.

Application Procedure

అర్హులైన అభ్యర్థులు ముందుగా TSNPDCL వెబ్ సైట్ (http://tsnpdcl.cgg.gov.in) లోకి లాగిన్ కావాలి. అందులో Make Payment ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్ సైట్ లో Submit Application ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ జూన్ 27, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.

Scheme of Exam

  • రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
  • సెక్షన్-ఏ, సెక్షన్-బీ రెండు విభాగాలలో పరీక్ష ఉంటుంది.
  • సెక్షన్-ఏలో టెక్నికల్ సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బీలో జనరల్ అవేర్ నెస్, న్యుమరికల్ ఎబిలిటీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం, చరిత్ర నుంచి 20 ప్నశ్నలు ఇస్తారు.
  • రెండు గంటలలో పరీక్ష రాయాలి. ఒక్క ప్రశకు ఒక మార్కు ఉంటుంది.
  • క్వాలిఫై మార్కులు ఓసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం రావాలి.

అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో గానీ, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే సమయంలో గానీ ఏమైనా సమస్యలు తలెత్తితే హెల్ప్ డెస్క్ నెంబర్ (0870-2461030)కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది. అలాగే, టీఎస్ ఎన్పీడీసీఎల్ వెబ్ సైట్ (http://tsnpdcl.cgg.gov.in)లోని complaint box పై క్లిక్ చేసి కూడా సమస్యకు పరిష్కారం పొందవచ్చు.

Important Dates

ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 27 జూన్, 2022
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 11 జూలై, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 11 జూలై, 2022 (రాత్రి 11:59 వరకు)
హాల్ టికెట్లు డౌన్ లోడ్: 06 ఆగస్టు, 2022
రాత పరీక్ష : 14 ఆగస్టు, 2022 (ఆదివారం) (ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు)

– Assistant Engineer Jobs in TSNPDCL