Civil Assistant Surgeons Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్టోరేట్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (Directorate of Public Health and Medical and Family Welfare-DPH&FW) డిపార్ట్ మెంట్ లో రెగ్యులర్ ప్రాతిపదికన (Regular Basis) సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (Civil Assistant Surgeons) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Combined Notification No. 04/2022) జారీ అయింది. మొత్తం 823 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (Primary Health Centers), ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు (APVVP Hospitals), డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ (DME institutions) లో పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్హతల్లో మార్కుల మెరిట్, వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
డైరెక్టోరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (DPH&FW) – 635
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP) – 188
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలో ఎంబీబీఎస్ (Bachelor of Medicine Bachelor of Surgery-MBBS) ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే, మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Scale of Pay: 61,960-1,51,370
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జూలై 01, 2022 నాటికి నలభై రెండు (42) సంవత్సరాలు మించకూడదు.
మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
విద్యార్హతల్లో మార్కుల మెరిట్, వెయిటేజీ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 75 మార్కులు విద్యార్హతలకు, 25 మార్కులు వెయిటేజీకి ఇస్తారు. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి, కొవిడ్-19 డ్యూటీలు చేసిన వారికి వెయిటేజీ మార్కులు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు నిమిత్తం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఈ ఫీజు క్యాష్ డిపాజిట్ ద్వారా అలాగే, ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Bank Name : Axis Bank, Bhavanipuram
Account holder : Director of Public Health and Family Welfare
Account No. 913020053261532.
IFSC Code: UTIB0001900
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు ఏపీ డైరెక్టోరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్ సైట్ (hmfw.ap.gov.in) లో నిర్ణీత ఫార్మాట్
లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. అందులో DPHFW & APVVP, A.P – RECRUITMENT OF CAS – 2022 ON REGULAR BASIS పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ONLINE APPLICATION (SINGLE APPLICATION IS APPLICABLE FOR THE POST OF CAS IN BOTH DPHFW & APVVP. HENCE, THE APPLICANTS WE ARE REQUESTING TO SUBMIT THE ONLY ONE APPLICATION పై క్లిక్ చేయాలి. అక్కడ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులోని వివరాలన్నీ పూర్తిగా నింపాలి.
అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న తర్వాత ప్రింట్ తీసుకొని దానికి అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఒక ఎవలప్ లో పెట్టిన ఎనవల్ పైన “A.P Medical & Health Services Notification 04/2022 RECRUITMENT OF CAS – 2022” అని రాయాలి. ఆ కవర్ ను ఈ క్రింది అడ్రస్ కు పంపించాలి.
The Director of Public Health & Family Welfare,
Himagna Towers, 3rd Floor,
Saipuram Colony,
One Centre, Gollapudi, Vijayawada.
Andhra Pradesh,
PIN: 521 225.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 06, 2022 (సాయంత్రం 5:30 గంటల వరకు)
– Civil Assistant Surgeons Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…