Constable Jobs in ITPBF : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (Indo Tibetan Border Police Force-ITBPF) హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Head Constable (Telecommunication)), కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Constable (Telecommunication)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 293 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇవి గ్రూప్-సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులు. ఈ పోస్టుల ముందుగా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
Head Constable (Telecommunication)
మొత్తం పోస్టులు – 126
పురుషులు – 107
అన్ రిజర్వుడ్ (UR) – 34
ఈడబ్ల్యూఎస్ (EWS) – 10
ఓబీసీ (OBC) – 44
ఎస్సీ (SC) – 15
ఎస్టీ (ST) – 04
మహిళలు – 19
అన్ రిజర్వుడ్ (UR) – 06
ఈడబ్ల్యూఎస్ (EWS) – 02
ఓబీసీ (OBC) – 08
ఎస్సీ (SC) – 02
ఎస్టీ (ST) – 01
Constable (Telecommunication)
మొత్తం పోస్టులు – 167
పురుషులు – 142
అన్ రిజర్వుడ్ (UR) – 58
ఈడబ్ల్యూఎస్ (EWS) – 14
ఓబీసీ (OBC) – 38
ఎస్సీ (SC) – 21
ఎస్టీ (ST) – 11
మహిళలు – 25
అన్ రిజర్వుడ్ (UR) – 10.
ఈడబ్ల్యూఎస్ (EWS) – 02
ఓబీసీ (OBC) – 07
ఎస్సీ (SC) – 04
ఎస్టీ (ST) – 02
పై మొత్తం పోస్టులలో 10 శాతం పోస్టులు మాజీ సైనికులకు (ఎక్స్ సర్వీస్ మెన్) కేటాయించారు.
Pay Scale
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) :
నెలకు రూ.25,500 – రూ.81,100 (పే మ్యాట్రిక్స్ లెవల్ 4, 7వ CPC ప్రకారం)
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) :
నెలకు రూ.21,700 – రూ.69,100 (వే మ్యాట్రిక్స్ లెవల్-3, 7వ CPC ప్రకారం)
Education Qualifications
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. లేదా గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కంప్యూటర్ లో రెండు సంవత్సరాల ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ సర్టిఫికెట్ తో గుర్తింపు పొందిన బోర్డులో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. అలాగే సైన్స్ (PCM) తో గుర్తింపు పొందిన బోర్డులో 10వ తరగతి ఉత్తీర్ణులై గుర్తి పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ ఇనుస్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్ లో మూడు సంవత్సరాల డిప్లొమా కలిగి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి సర్టిఫికెట్ లేదా డిప్లొమా కలిగి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Age Limit
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) ఉద్యోగానికి అభ్యర్థుల వయసు నవంబర్ 30, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి డిసెంబర్ 01, 1997కు ముందు, నవంబర్ 30, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) ఉద్యోగానికి అభ్యర్థుల వయసు నవంబర్ 30, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి డిసెంబర్ 01, 1999కు ముందు, నవంబర్ 30, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఇతర కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
Selection Procedure
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (IST), మెడికల్ టెస్టులు (DME), రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) నిర్వహిస్తారు. పై టెస్టులలో క్వాలిఫై అయిన అభ్యర్థులను రాత పరీక్షకు ఆహ్వానిస్తారు. అడ్మిట్ కార్డులు వెబ్ సైట్ లో పెడతారు. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
How to Apply
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ITBPF వెబ్ సైట్ (https://recruitment.itbpolice.nic.in/) లోకి లాగిన్ అయ్యి ముందుగా NEW USER REGISTRATION పై క్లిక్ చేసి అందులోని వివరాలన్నీ పూరించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత ఈ-మెయిల్ కు పాస్వర్డ్ వస్తుంది వాటితో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. అలాగే, రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ITBPF రిక్రూట్మెంట్ వెబ్ సైట్ (https://recruitment.itbpolice.nic.in/) లో మాత్రమే పొందుపరుస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాచారం కోసం తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
Important Dates
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 01, 2022
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2022 (రాత్రి 11:59 గంటల వరకు)
Website: https://recruitment.itbpolice.nic.in/
– Constable Jobs in ITPBF