Date Extension for SN Posts : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 5,204 స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) దరఖాస్తు తేదీని పొడిగించింది. ముందుగా ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించిన బోర్డు.. నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సింగ్ డిగ్రీల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌లో జరుగుతున్న ఆలస్యం వల్ల దరఖాస్తు తేదీని పొడిగించాలని స్టాఫ్ నర్స్ అభ్యర్థులు కోరడంతో ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. బుధవారం వరకు 5,204 పోస్టులకు 40వేల వరకు దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. బోర్డు దరఖాస్తు గడువు పెంచినందున దరఖాస్తు విధానం మరోసారి ఇస్తున్నాం.. పూర్తిగా చూసి అప్లై చేసుకోగలరు.
అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి. అందులో Application for the post of Staff Nurse పై క్లిక్ చేయాలి. అందులో Apply for Post of Staff Nurse అని వస్తుంది. దాంట్లో First Name, Last Name, E-Mail, Mobile Number, Security Code ఎంటర్ చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని అందులో ఎంటర్ చేస్తే E-Mailకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తాయి.
ఆ తర్వాత మళ్లీ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in/ ను ఓపెన్ చేయాలి. అందులో Application for the post of Staff Nurse పై క్లిక్ చేయాలి. అందులో Apply for Post of Staff Nurse అని వస్తుంది. అందులో APPLICANT LOGIN పై క్లిక్ చేయాలి. దాంట్లో E-Mailకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి Security Code ఎంటర్ చేసి Login పై క్లిక్ చేయాలి.
Login పై క్లిక్ చేయాలి. అందులో Apply For the Post పై క్లిక్ చేయాలి. అప్పుడు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ నర్స్ పోస్టులు కేటాయించిన విభాగాలు వస్తాయి. మొత్తం తొమ్మిది విభాగాలలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నది. Director of Medical Education/ Director of Public Health and Family Welfare, Telangana Vaidya Vidhana Parishad, MNJ Institute of Oncology & Regional Cancer Centre (MNJIO&RCC), Department for Disabled and Senior Citizens Welfare, Telangana Minorities Residential Educational Institutions Society, Mahatma Jyothiba Phule Telangana backward Classes Welfare Residential Educational Institutions Society, Telangana Tribal Welfare Residential Educational Institutions Society (Gurukulam), Telangana Social Welfare Residential Educational Institutions Society, Telangana Residential Education Institutional Society లలో పోస్టులు ప్రకటించింది. ఇందులో ఏ డిపార్ట్మెంట్లో చేరదలుచుకున్నారో దానికి ఫస్ట్ ప్రిపరెన్స్ ఇవ్వాలి. తర్వాత వాటికి రెండు నుంచి తొమ్మిది వరకు ఇవ్వాలి. అనంతరం Save & Continue పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో అడిగిన అన్ని వివరాలు నింపి, విద్యార్హతలు, అనుభవనంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
ఈ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.200 ఆన్ లైన్ లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25, 2023 ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 15, 2023 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఈ కింది సర్టిఫికెట్లు కచ్చితంగా కావాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ సర్టిఫికెట్లు స్కాన్‌చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆప్షన్ రాగానే వాటిని అప్ లోడ్ చేయాలి.
ఆధార్ కార్డు
ఎస్సెస్సీ మెమో (డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం)
జీఎన్ఎం లేదా బీ.ఎస్సీ(నర్సింగ్) సర్టిఫికెట్ (ప్రొవిజినల్)
తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అభ్యర్థులు)
స్టడీ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
ఒకవేళ ప్రైవేటు స్కూళ్లలో చదివినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
కులం సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు)
నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ (బీసీ అభ్యర్థులు మాత్రమే)
ఆదాయం మరియు అసెట్ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే)
స్పోర్ట్స్ సర్టిఫికెట్ (స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కలిగిన వారు మాత్రమే)
సదరమ్ సర్టిఫికెట్ (దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే)
సర్వీస్ సర్టిఫికెట్ (ఎన్ సీ సీ అభ్యర్థులు మాత్రమే)
సర్వీస్ సర్టిఫికెట్ (ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు)
అభ్యర్థి ఫొటో (జేపీజీ/జేపీఈజీ/పీఎనీ ఫార్మాట్లో)
అభ్యర్థి సంతకం (జేపీజీ/జేపీఈజీ/ పీఎన్ ఫార్మాట్లో)
పై సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్ కాపీలను మాత్రమే అప్ లోడ్ చేయాలి. క్లియర్ గా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
ఇవే సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.
నాన్ క్రీమీ లేయర్ పరిధిలోకి వచ్చే బీసీలు తప్పనిసరిగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
లేదంటే వారిని ఓసీలుగానే బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసే అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాలి.
ఉమ్మడి ఏపీలో తీసుకున్న కులం సర్టిఫికెట్ చెల్లదు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లనే అప్ లోడ్ చేయాలి.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారు, ఇంతకుముందు చేసిన వారు తాము పనిచేస్తున్న/చేసిన ఆస్పత్రులు, డీఎంహెచ్ వోల నుంచి ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ను తీసుకొని అప్ లోడ్ చేయాలి.
ఆన్ లైన్ దరఖాస్తులో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-29550220 నెంబర్‌కు ఆఫీస్ టైంలో (ఉదయం 10:20 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ) కాల్ చేసి పరిష్కారం పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 21, 2023 సాయంత్రం 5 గంటలకు
– Date Extension for SN Posts
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…