A female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Food Safety Officer Jobs : హైదరాబాద్ లోని ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబోరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ (Institute of Preventive Medicine Public Health Laboratories & Food (Health) Administration) లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (Food Safety Officer) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.06/2022) జారీ చేసింది. మొత్తం ఇవరై నాలుగు (24) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancies

ZONE-I (Kaleshwaram) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-II (Basara) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-III (Rajanna Sircilla) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-IV (Bhadradri) : OC(G)-02, (W)-01, BC(A)(W)-01, SC(W)-01
ZONE-V (Yadadri) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-VI (Charminar) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-VII (Jogulamba) : OC(G)-01, (W)-01, BC(A) (W)-01, SC(W)-01

Educational Qualifications

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫుడ్ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ఆయిల్ టెక్నాలజీ/అగ్రికల్చరల్ సైన్స్/వెటర్నరీ సైన్స్/బయో కెమిస్ట్రీ/మైక్రోబయాలజీలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
  • కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు, మెడిసిన్ లో డిగ్రీ చేసిన వారు కూడా అర్హులే.

Age Limit

  • జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • జూలై 1, 2004 తర్వాత, జూలై 2, 1978కి ముందు జన్మించి ఉండకూడదు.
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, మాజీ సైనికులు, NCC అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
  • ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.

Salary

నెలకు రూ.42,300 నుంచి రూ.1.15.270.

Selection Procedure

ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-2లో డిగ్రీ లెవల్ లో సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లీష్ తెలుగు భాషలలో ఉంటుంది. పేపర్-2 ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్ లోనే ఉంటుంది.
రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.

Application & Examination Fee

ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.80 చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, టీ-వాలెట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

How to Apply

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు. TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration- OTR) చేసుకోవాలి.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.

Important Points

  • రాత పరీక్ష నవంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
  • కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) గానీ, ఆఫ్ లైన్ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ గానీ ఉంటుంది.
  • హాల్ టికెట్లు రాత పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిలో కేటాయిస్తారు.
  • ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కు మాత్రమే పంపిస్తారు. కాబట్టి ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 29, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 26, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 26, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)

Website : https://www.tspsc.gov.in/

– Food Safety Officer Jobs