Food Safety Officer Jobs : హైదరాబాద్ లోని ఇన్సిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ లాబోరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ (Institute of Preventive Medicine Public Health Laboratories & Food (Health) Administration) లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (Food Safety Officer) ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.06/2022) జారీ చేసింది. మొత్తం ఇవరై నాలుగు (24) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ZONE-I (Kaleshwaram) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-II (Basara) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-III (Rajanna Sircilla) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-IV (Bhadradri) : OC(G)-02, (W)-01, BC(A)(W)-01, SC(W)-01
ZONE-V (Yadadri) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-VI (Charminar) : OC(G)-01, (W)-01, SC(W)-01
ZONE-VII (Jogulamba) : OC(G)-01, (W)-01, BC(A) (W)-01, SC(W)-01
నెలకు రూ.42,300 నుంచి రూ.1.15.270.
ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-2లో డిగ్రీ లెవల్ లో సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లీష్ తెలుగు భాషలలో ఉంటుంది. పేపర్-2 ప్రశ్నపత్రం కేవలం ఇంగ్లిష్ లోనే ఉంటుంది.
రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.
ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.80 చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, టీ-వాలెట్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు. TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration- OTR) చేసుకోవాలి.
ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 29, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 26, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 26, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
Website : https://www.tspsc.gov.in/
– Food Safety Officer Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…