Graduate Apprentices in TSRTCA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Graduate Apprentices in TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transport Corporation-TSRTC) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో నాన్ ఇంజినీరింగ్ (Non Engineering) విభాగంలో అప్రెంటిస్ (Apprenticeship) శిక్షణ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 150 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలలో మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ అప్రెంటిస్ కి ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీలో అప్రెంటిస్

Region Wise Vacancies

ఖాళీల వివరాలు రీజియన్ వారీగా ఈ విధంగా ఉన్నాయి.

1.హైదరాబాద్-26 (Hyderabad)
2.సికింద్రాబాద్-18 (Secunderabad)
3.మహబూబ్ నగర్-14 (Mahaboobnagar)
4.మెదక్-12 (Medak)
5.నల్గొండ-12 (Nalgonda)
6.రంగారెడ్డి-12 (Ranga Reddy)
7.అదిలాబాద్-09 (Adilabad)
8.కరీంనగర్-15 (Karimnagar)
9.ఖమ్మం-09 (Khammam)
10.నిజామాబాద్-09 (Nizamabad)
11.వరంగల్-14 (Warangal)

Educational Qualification

బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఉత్తీర్ణులైనవారు అర్హులు.

Age Limit

అభ్యర్థుల వయసు జూలై 1, 2022 నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

Duration & Stipend

అప్రెంటిస్ షిప్ వ్యవధి మూడు (03) సంవత్సరాలు. మొదటి సంవత్సరం నెలకు రూ.15,000, రెండో సంవత్సరం రూ.16,000, మూడో సంవత్సరం రూ.17,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

How to Apply

అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ (NATS) వెబ్ సైట్ (www.mhrdnats.gov.in) లో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం అదే వెబ్ సైట్ లో టీఎస్ ఆర్టీసీసీని ఎంపిక చేసుకొని STLHDS000005 యూజర్ ఐడీతో దరఖాస్తు చేసుకోవాల్సి  ఉంటుంది. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సైతం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Selection Procedure

NATS అధికారులు గ్రాడ్యుయేషన్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా జాబితా తయారు చేస్తారు. ఆ జాబితాను సంబంధిత రీజినల్ మేనేజర్ లకు పంపిస్తారు. ఆ జాబితాను అర్ఎం, డీవీఎమ్, డిప్యూటీ సీపీఎం(జోన్) కమిటీ పరిశీలించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి, స్థానిక, నాన్ లోకల్ ప్రమాణాలు, రిజర్వేజన్లకు అనుగుణంగా అప్రెంటిస్ లను ఎంపిక చేస్తుంది. వంద రూపాయల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ సంతకం చేసి సంబంధిత రీజినల్ మేనేజర్ కు అందజేయాల్సి ఉంటుంది.

Important Points

అప్రెంటిస్ షిప్ వ్యవధి పూర్తయ్యే సమయంలో అభ్యర్థులకు టీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ పూర్తిచేసినట్టు సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2022

– Graduate Apprentices in TSRTC