Head Constable Jobs in DelhiA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Head Constable Jobs in Delhi : దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్ లెస్ ఆపరేటర్/ టెలీప్రింటర్ ఆపరేటర్) (Head Constable (Assistant Wireless Operator (AWO)/Tele Printer Operator (TPO)) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission – SSC) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 857 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Reservation Wise Vacancies

పురుషులు (Male)-573:
Open (459) : Gen/UR-171, EWS-46, OBC-102, SC-86, ST-54
Ex-Serviceman-(57) : Gen/UR-21, EWS-6, OBC-13, SC-10, ST-7

Departmental-(57) : Gen/UR-21, EWS-6, OBC-13, SC-10, ST-7

మహిళలు (Female)-284:
Open (256) : Gen/UR-96, EWS-26, OBC-57, SC-47, ST-30
Departmental – (28) : Gen/UR-11, EWS-03, OBC-06, SC-05, ST-03

Qualifications

గుర్తింపు పొందిన బోర్డు ద్వారా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో 10+2 (సీనియర్ సెకండరీ) పాసై ఉండాలి. లేదా మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) పొంది ఉండాలి. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

Pay Scale

నెలకు రూ.25500 – 81,100 (పే లెవల్-4).

Age Limit

జూలై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు జూలై 2, 1995కు తర్వాత, జూలై
1, 2004 లోపు జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ క్రీడాకారులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ, మాజీ సైనికులకులకు మూడు (03) సంవత్సరాలు సడలింపు ఉంది.

Selection Procedure

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో జబాబుకు ఒక మార్కు ఇస్తారు. పరీక్ష 90 నిమిషాలలో రాయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలలో ఉంటుంది.
ప్రశ్నలు ఐదు విభాగాల నుంచి అడుగుతారు. పార్ట్-ఏలో జనరల్ అవేర్ నెస్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్-బీలో జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, పార్ట్-సీలో గణితం నుంచి 25 ప్రశ్నలు, పార్డ్-డీలో రీజనింగ్ నుంచి 20 మార్కులు, పార్ట్-ఈలో బేసిక్ కంప్యూటర్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు.
తెలుగు రాష్ట్రాలలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.

How to Apply

  • అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి.
  • ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ (https://ssc.nic.in.) ను ఓపెన్ చేసి అందులో కుడివైపున కిందిభాగంలో కనిపిస్తున్న Register Now పై క్లిక్ చేయాలి.
  • అందులో వివరాలు నింపి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్, ఎస్సెస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి.
  • అలాగే, జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Importanat Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 29, 2022 (రాత్రి 11 గంటల వరకు)
అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జూలై 30, 2022 (రాత్రి 11 గంటల వరకు)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అక్టోబర్ నెలలో ఉంటుంది.

– Head Constable Jobs in Delhi