Head Constable Jobs in Delhi : దేశ రాజధాని ఢిల్లీలోని ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్ లెస్ ఆపరేటర్/ టెలీప్రింటర్ ఆపరేటర్) (Head Constable (Assistant Wireless Operator (AWO)/Tele Printer Operator (TPO)) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission – SSC) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 857 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుషులు (Male)-573:
Open (459) : Gen/UR-171, EWS-46, OBC-102, SC-86, ST-54
Ex-Serviceman-(57) : Gen/UR-21, EWS-6, OBC-13, SC-10, ST-7
Departmental-(57) : Gen/UR-21, EWS-6, OBC-13, SC-10, ST-7
మహిళలు (Female)-284:
Open (256) : Gen/UR-96, EWS-26, OBC-57, SC-47, ST-30
Departmental – (28) : Gen/UR-11, EWS-03, OBC-06, SC-05, ST-03
Qualifications
గుర్తింపు పొందిన బోర్డు ద్వారా సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులలో 10+2 (సీనియర్ సెకండరీ) పాసై ఉండాలి. లేదా మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) పొంది ఉండాలి. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
నెలకు రూ.25500 – 81,100 (పే లెవల్-4).
జూలై 1, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులు జూలై 2, 1995కు తర్వాత, జూలై
1, 2004 లోపు జన్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ క్రీడాకారులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ, మాజీ సైనికులకులకు మూడు (03) సంవత్సరాలు సడలింపు ఉంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో జబాబుకు ఒక మార్కు ఇస్తారు. పరీక్ష 90 నిమిషాలలో రాయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషలలో ఉంటుంది.
ప్రశ్నలు ఐదు విభాగాల నుంచి అడుగుతారు. పార్ట్-ఏలో జనరల్ అవేర్ నెస్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్-బీలో జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, పార్ట్-సీలో గణితం నుంచి 25 ప్రశ్నలు, పార్డ్-డీలో రీజనింగ్ నుంచి 20 మార్కులు, పార్ట్-ఈలో బేసిక్ కంప్యూటర్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు.
తెలుగు రాష్ట్రాలలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 29, 2022 (రాత్రి 11 గంటల వరకు)
అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జూలై 30, 2022 (రాత్రి 11 గంటల వరకు)
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: అక్టోబర్ నెలలో ఉంటుంది.
– Head Constable Jobs in Delhi
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…