Govt Job

How to Apply 5,204 Staff Nurse Posts

How to Apply SN Posts : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా 5,204 స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) బుధవారం ఆన్​లైన్​ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్​ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాలి.

How to Apply

అభ్యర్థులు ముందుగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్​సైట్​ https://mhsrb.telangana.gov.in/ ను ఓపెన్​ చేయాలి. అందులో Application for the post of Staff Nurse పై క్లిక్​ చేయాలి. అందులో Apply for Post of Staff Nurse అని వస్తుంది. దాంట్లో First Name, Last Name, E-Mail, Mobile Number, Security Code ఎంటర్​ చేస్తే మొబైల్​కు ఓటీపీ వస్తుంది. దానిని అందులో ఎంటర్​ చేస్తే E-Mailకు యూజర్​ నేమ్​, పాస్​వర్డ్​ వస్తాయి.

Applicant Login

ఆ తర్వాత మళ్లీ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్​సైట్​ https://mhsrb.telangana.gov.in/ ను ఓపెన్​ చేయాలి. అందులో Application for the post of Staff Nurse పై క్లిక్​ చేయాలి. అందులో Apply for Post of Staff Nurse అని వస్తుంది. అందులో APPLICANT LOGIN పై క్లిక్​ చేయాలి. దాంట్లో E-Mailకు యూజర్​ నేమ్​, పాస్​వర్డ్​ ఎంటర్​ చేసి Security Code ఎంటర్ చేసి Login పై క్లిక్​ చేయాలి.

Apply For th Post

Login పై క్లిక్​ చేయాలి. అందులో Apply For the Post పై క్లిక్​ చేయాలి. అప్పుడు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్​ నర్స్​ పోస్టులు కేటాయించిన విభాగాలు వస్తాయి. మొత్తం తొమ్మిది విభాగాలలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నది. Director of Medical Education/ Director of Public Health and Family Welfare, Telangana Vaidya Vidhana Parishad, MNJ Institute of Oncology & Regional Cancer Centre (MNJIO&RCC), Department for Disabled and Senior Citizens Welfare, Telangana Minorities Residential Educational Institutions Society, Mahatma Jyothiba Phule Telangana backward Classes Welfare Residential Educational Institutions Society, Telangana Tribal Welfare Residential Educational Institutions Society (Gurukulam), Telangana Social Welfare Residential Educational Institutions Society, Telangana Residential Education Institutional Society లలో పోస్టులు ప్రకటించింది. ఇందులో ఏ డిపార్ట్​మెంట్​లో చేరదలుచుకున్నారో దానికి ఫస్ట్​ ప్రిపరెన్స్​ ఇవ్వాలి. తర్వాత వాటికి రెండు నుంచి తొమ్మిది వరకు ఇవ్వాలి. అనంతరం Save & Continue పై క్లిక్​ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్​ ఫాం వస్తుంది. అందులో అడిగిన అన్ని వివరాలు నింపి, విద్యార్హతలు, అనుభవనంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.

Application Fee

ఈ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.200 ఆన్ లైన్ లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25, 2023 ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 15, 2023 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

Required Certificates

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఈ కింది సర్టిఫికెట్లు కచ్చితంగా కావాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ సర్టిఫికెట్లు స్కాన్​చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆప్షన్​ రాగానే వాటిని అప్​ లోడ్​ చేయాలి.

  • ఆధార్ కార్డు
  • ఎస్సెస్సీ మెమో (డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం)
  • జీఎన్ఎం లేదా బీ.ఎస్సీ(నర్సింగ్) సర్టిఫికెట్ (ప్రొవిజినల్)
  • తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
  • ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ అభ్యర్థులు)
  • స్టడీ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
  • ఒకవేళ ప్రైవేటు స్కూళ్లలో చదివినట్లయితే రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
  • కులం సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు)
  • నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ (బీసీ అభ్యర్థులు మాత్రమే)
  • ఆదాయం మరియు అసెట్ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే)
  • స్పోర్ట్స్ సర్టిఫికెట్ (స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కలిగిన వారు మాత్రమే)
  • సదరమ్ సర్టిఫికెట్ (దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే)
  • సర్వీస్ సర్టిఫికెట్ (ఎన్ సీ సీ అభ్యర్థులు మాత్రమే)
  • సర్వీస్ సర్టిఫికెట్ (ప్రస్తుతం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు)
  • అభ్యర్థి ఫొటో (జేపీజీ/జేపీఈజీ/పీఎనీ ఫార్మాట్లో)
  • అభ్యర్థి సంతకం (జేపీజీ/జేపీఈజీ/ పీఎన్ ఫార్మాట్లో)
  • పై సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్ కాపీలను మాత్రమే అప్ లోడ్ చేయాలి. క్లియర్ గా స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
  • ఇవే సర్టిఫికెట్లను వెరిఫికేషన్ సమయంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Important Points

  • నాన్ క్రీమీ లేయర్ పరిధిలోకి వచ్చే బీసీలు తప్పనిసరిగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
  • లేదంటే వారిని ఓసీలుగానే బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది.
  • ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసే అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాలి.
  • ఉమ్మడి ఏపీలో తీసుకున్న కులం సర్టిఫికెట్ చెల్లదు.
  • తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లనే అప్ లోడ్ చేయాలి.
  • కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారు, ఇంతకుముందు చేసిన వారు తాము పనిచేస్తున్న/చేసిన ఆస్పత్రులు, డీఎంహెచ్ వోల నుంచి ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ ను తీసుకొని అప్ లోడ్ చేయాలి.
  • ఆన్​ లైన్​ దరఖాస్తులో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-29550220 నెంబర్​కు ఆఫీస్​ టైంలో (ఉదయం 10:20 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ) కాల్​ చేసి పరిష్కారం పొందవచ్చు.

ఆన్​ లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 15, 2023 సాయంత్రం 5 గంటలకు

‌‌‌‌- How to Apply SN Posts

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago