Jobs in AAI Southern RegionA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Jobs in AAI Southern Region : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airports Authority of India-AAI) సదరన్ రీజియన్ (Southern Region) పరిధిలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, లక్షద్వీప్ లలో గల విమానాశ్రయాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఆయా రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Advt. No. SR/01/2022) జారీ చేసింది. మొత్తం 156 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, వైద్య, శారీరక పరీక్షలు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. Junior Assistant (Fire Service) NE-4
2. Junior Assistant (Office) NE-4
3. Senior Assistant (Accounts) NE-6
4. Senior Assistant (Official Language) NE-6

Junior Assistant (Fire Service)

మొత్తం పోస్టుల సంఖ్య – 132
అన్ రిజర్వుడ్ (UR) – 88
ఈడబ్ల్యూఎస్ (EWS) – 13
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) OBC (NCL) – 11
ఎస్సీ (SC) – 20
ఇందులో 19 పోస్టులు మాజీ సైనికులకు (Ex Servicemen-ESM) కేటాయించారు.
స్కేల్ ఆఫ్ పే : రూ.31,000 – రూ.92,000

Junior Assistant (Office)

మొత్తం పోస్టుల సంఖ్య – 10
అన్ రిజర్వుడ్ (UR) – 05
ఈడబ్ల్యూఎస్ (EWS) – 01
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) OBC (NCL) – 02
ఎస్సీ (SC) – 01
ఎస్టీ (ST) – 01
ఇందులో ఒక (01) పోస్టు మాజీ సైనికులకు (ESM), మూడు (03) పోస్టులు దివ్యాంగులకు (Person With Disabilities-PWD) కేటాయించారు.
స్కేల్ ఆఫ్ పే : రూ.31,000 – రూ.92,000

Senior Assistant (Accounts)

మొత్తం పోస్టుల సంఖ్య – 13
అన్ రిజర్వుడ్ (UR) – 07
ఈడబ్ల్యూఎస్ (EWS) – 01
ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) OBC (NCL) – 03
ఎస్సీ (SC) – 01
ఎస్టీ (ST) – 01
ఇందులో రెండు (02) పోస్టులు మాజీ సైనికులకు (ESM), మూడు (03) పోస్టులు దివ్యాంగులకు (PWD) కేటాయించారు.
స్కేల్ ఆఫ్ పే : రూ.36,000 – రూ.1,10,000

Senior Assistant (Official Language)

మొత్తం పోస్టుల సంఖ్య – 01 (SC)
స్కేల్ ఆఫ్ పే రూ.36,000 – రూ.1,10,000

Qualification & Experience

Junior Assistant (Fire Service) :
10వ తరగతి పాసై, 50 శాతం మార్కులతో మెకానికల్/ ఆటోమొబైల్/ ఫైర్ లో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో 12వ తరగతి (రెగ్యులర్) పాసై ఉండాలి.
హెవీ/ మీడియం/ లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ కలిగి ఉండాలి.

Junior Assistant (Office) :
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా, 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

Senior Assistant (Accounts) :
B.Com ఉత్తీర్ణులై మూడు నుంచి ఆరు నెలల కంప్యూటర్ శిక్షణ తీసుకొన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అలాగే, సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

Senior Assistant (Official Language) :
గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా హిందీలో మాస్టర్స్ చేసిన వారు లేదా, గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీ ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్ లో మాస్టర్స్ చేసిన వారు అర్హులు. గ్రాడ్యుయేషన్ లో హిందీ మరియు ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ చేసిన వారు కూడా అర్హులే. అలాగే, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.

Age Limit

అభ్యర్థుల వయసు ఆగస్టు 25, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు, మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ప్రస్తుతం ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న వారికి అలాగే, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంటుంది.

Application Fee

అన్ రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు నిమిత్తం రూ.1000 చెల్లించాలి. ఇతర కేటగిరీల వారు చెల్లించాల్సిన అవసరం లేదు.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన వెబ్ సైట్ (https://www.aai.aero/) ను ఓపెన్ చేయాలి. అందులో CAREERS అప్షన్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 01 నుంచి ప్రారంభం అవుతుంది.
అప్లికేషన్ తో పాటు ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. అభ్యర్థి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
2. అభ్యర్థి సంతకం
3. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్
4. విద్యార్హతల సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు.
5. అనుభవం, కంప్యూటర్ ట్రెయినింగ్ సర్టిఫికెట్
6. కులం సర్టిఫికెట్
7. వైలకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
8. రెసిడెన్స్ సర్టిఫికెట్
9. ఆదాయం మరియు ఆస్తుల సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు)
10. డ్రైవింగ్ లైసెన్స్ (జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) అభ్యర్థులు)
11. డిశ్చార్జ్ సర్టిఫికెట్ (మాజీ సైనికులు)
12. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సీర్వీస్ అభ్యర్థులు)
13. ఏఏఐ ఐడెంటిటీ కార్డ్ (ఏఏఐ ఉద్యోగులు)
పై అన్ని సర్టిఫికెట్లు పీడీఎప్ లేదా జేపీజీ లేదా జేపీ ఈజీ, ఫార్మాట్ లో 100 ఎంబీ సైజ్ లోపు ఉండేలా చూసుకొని అప్ లోడ్ చేయాలి.

Important Points

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడలో నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పై వేతనంతో పాటు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం డీఏ, హెచ్ ఆర్
ఏ, సీపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ కల్పిస్తారు.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 01, 2022
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2022

దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే +919513166392 నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.

– Jobs in AAI Southern Region