Bank Jobs

Jobs in TS Co-operative Apex Bank

Jobs in Apex Bank : తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (Telangana State Co-operative Apex Bank Ltd-TSCAB) రాష్ట్రంలోని బ్యాంకు శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ (స్కేల్-1) (Manager (Scale-I)), స్టాప్ అసిస్టెంట్ (Staff Assistant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం నలభై (40) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్లు నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

Manager (Scale-I) :
Total Vacancies – 27
OC(G)-03, (W)-03
EWS(G)-02, (W)-01
BC(A)(G)-02
BC(B)(G)-02, (W)-01
BC(D)(G)-01, (W)-01
BC(E)(G)-01
SC(G)-02, (W)-02
ST(G)-04
PC-OH(G)-01
PC-ID(G)-01

Staff Assistant :
Total Vacancies – 13
OC(G)-01, (W)-01
EWS(G)-02
BC(B)(G)-01
BC(D)(G)-01
SC(G)-01, (W)-01
ST(G)-01
PC-HI(W)-01
PC-OH(W)-01
PC-ID(G)-01
EXS(G)-01

Salary

మేనేజర్ (స్కేల్-1) – రూ.36,000 – రూ.63,840
స్టాఫ్ అసిస్టెంట్ – రూ.17,900 – రూ.47,920

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు సెప్టెంబ‌ర్ 01, 2022 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబర్ 02, 1994న లేదా తర్వాత జన్మించి ఉండాలి. సెప్టెంబర్ 01 2002 తర్వాత జన్మించి ఉండకూడదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, జనరల్ కేటగిరీకి చెందిన దివ్యాంగులకు పది (10) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు పదిహేను(15) సంవత్సరాల సడలింపు ఉంది.

Eligibility

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రూపులో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు. కామర్స్ గ్రూపులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగులో రాయడం, చదవం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి.

Application Fee

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.950 చెల్లించాలి. ఈ ఫీజు ఒకసారి చెల్లిస్తే తిరిగి ఇవ్వరు.

Selection Procedure

ఆన్ లైన్ లో ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామినేషన్లు నిర్వహించి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. మేనేజర్ (స్కేల్-1) ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అబ్జెక్టివ్ విధానంలో, మెయిన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మాత్రం ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామ్స్ రెండు కూడా అబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల్లోని మెరిట్ ఆధారంగానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు. ఆన్ లైన్ పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉంటాయి.

How to Apply

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ కు చెందిన వెబ్ సైట్ (https://tscab.org/)ను ఓవెన్ చేయాలి. అందులో Careers లో Apex Bank పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Click here to apply for the posts of Manager (Scale-I) & Staff Assistant in TSCAB ఫై క్లిక్ చేయాలి. అందులో Click here for New Registration పై క్లిక్ చేయాలి. అందులో అడిగిన అన్ని వివరాలు ఎంటర్ చేసి ఫొటో, సంతకం, ధ్రువీకరణ పత్రాలు అప్ లోడ్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ప్రిలిమినరీ ఎగ్జామ్ కు ఆహ్వానిస్తారు.

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 28, 2022
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : అక్టోబర్ 16, 2022

దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-24685517, 040-24685559 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. ఈ నెంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఫోన్ చేయాలి.

– Jobs in Apex Bank

Kautilya Creative

Share
Published by
Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

3 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

12 months ago