Jobs in Army Ordnance Corps : భారత రక్షణ మంత్రిత్వ శాఖ(Ministry of Defence, Government of India) కు చెందిన సికింద్రాబాద్లోని సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ అర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (Central Recruitment Cell C/o Army Ordnance Corps Centre, Secunderabad) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్ మ్యాన్ మేట్ (Tradesman Mate) , ఫైర్ మ్యాన్ (Fireman) పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (AOC/CRC/2023/JAN/AOC-02) విడుదల చేసింది. మొత్తం 1,793 ( ట్రేడ్స్ మ్యాన్ మేట్ : 1,249, ఫైర్ మ్యాన్ : 544) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఫిజికల్ ఎండ్యూరెన్స్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ట్రేడ్స్ మ్యాన్ మేట్ (Tradesman Mate) - మొత్తం పోస్టులు : 1,249
అన్ రిజర్వుడ్(UR)-508, ఈడబ్ల్యూఎస్(EWS)-124, ఓబీసీ(OBC)-337, ఎస్సీ(SC)-187, ఎస్టీ(ST)-93. ఇందులో మాజీ సైనికులకు(ESM)-125, క్రీడాకారులకు(MSP)-62, దివ్యాంగులకు (PwBD)-49 పోస్టులు కేటాయించారు.
2. ఫైర్ మ్యాన్ (Fireman) - మొత్తం పోస్టులు : 544
అన్ రిజర్వుడ్(UR)-222, ఈడబ్ల్యూఎస్(EWS)-54, ఓబీసీ(OBC)-147, ఎస్సీ(SC)-81, ఎస్టీ(ST)-40. ఇందులో మాజీ సైనికులకు(ESM)-54, క్రీడాకారులకు(MSP)-27, దివ్యాంగులకు (PwBD)-20 పోస్టులు కేటాయించారు.
Southern :
Fireman-111, Tradesman Mate-206
States : Maharashtra, Telangana, Tamil Nadu
Eastern :
Fireman-69, Tradesman Mate-139
States : Assam, Arunachal Pradesh, Nagaland, Manipur
Western :
Fireman-71, Tradesman Mate-430
States : Delhi, Punjab, Himachal Pradesh, Haryana
Northern :
Fireman-119, Tradesman Mate-181
States : Jammu & Kashmir, Ladakh
South Western :
Fireman-89, Tradesman Mate-164
States : Rajasthan, Gujrat
Central West :
Fireman-39, Tradesman Mate-66
States : Madhya Pradesh, Uttar Pradesh, Uttarakhand
Central East :
Fireman-46, Tradesman Mate-63
States : West Bengal, Jharkhand, Sikkim
ట్రేడ్స్ మ్యాన్ మేట్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పాస్అయి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన పారిశ్రామిక శిక్షణా సంస్థ (Industrial Training Institute) నుంచి ఏదైనా ట్రేడ్లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఫైర్ మ్యాన్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ పాస్అయి ఉండాలి.
ట్రేడ్స్ మ్యాన్ మేట్ : రూ.18,000 నుంచి రూ.56,900
ఫైర్ మ్యాన్ : రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ అర్డినెన్స్ కార్ప్స్ కు చెందిన వెబ్ సైట్ (www.aocrecruitment.gov.in.) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Website : https://www.aocrecruitment.gov.in/
– Jobs in Army Ordnance Corps
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…