Jobs in LIC HFL : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India-LIC) కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (Housing Finance Ltd) లో అసిస్టెంట్ (Assistant), అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 80 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts & Vacancies
1. Assistant – 50
2. Assistant Manager – 30
(అసిస్టెంట్ మేనేజర్ పోస్టులలో కొన్ని డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (DME) విభాగానికి కేటాయించారు.)
Eligibility
- Assistant : 55 శాతం మార్కులతో ఏదైనా రెగ్యులర్ డిగ్రీ పాసైనవారు అర్హులు. కరస్పాండెన్స్, డిస్టెన్స్, పార్ట్ టైం విధానంలో చదివిన వారు అనర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి.
- Assistant Manager : 60 శాతం మార్కులతో ఏదైనా రెగ్యులర్ డిగ్రీ పాసైన వారు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. కరస్పాండెన్స్, డిస్టెన్స్, పార్ట్ టైం విధానంలో చదివిన వారు అనర్హులు.
- డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో 50 శాతం మార్కులతో ఏదైనా రెగ్యులర్ డిగ్రీ పాసైన వారు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. మార్కెటింగ్ ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- అలాగే, మార్చి 31, 2022 నాటికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లో డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మూడు సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ సమయంలో కంపెనీ లక్ష్యాలను సాధించి ఉండాలి. లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్/మార్కెటింగ్ మీడియేటర్ గా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వీటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
Salary
Assistant : రూ.33,960
Assistant Manager : రూ.80,110
( జీతంతో పాటు ఎల్ఐసీ నిబంధనల ప్రకారం లంచ్ అలవెన్స్, పీఎఫ్, మెడిక్లైమ్, గ్రాట్యుటీ, ఎల్ టీ సీ, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, హౌసింగ్ లోన్, ఫర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ తదితర బెనిఫిట్స్ కల్పిస్తారు.)
Age Limit
జనవరి 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
Selection Procudure
అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఆన్ లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా, డైరెక్ట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ
అభ్యర్థులను పని అనుభవం, అన్ లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ ఎగ్జామినేషన్ అబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. 200 మార్కులు ఉంటాయి. 120 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ప్రశ్నపత్రం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ (హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ) నుంచి 50 ప్రశ్నలు,
న్యుమరికల్ ఎబిలిటీ (అసిస్టెంట్), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (అసిస్టెంట్ మేనేజర్) నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
ఆన్ లైన్ ఎగ్జామినేషన్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తెలంగాణలో హైదరాబాద్ లో ఉంటాయి.
How to Apply
- ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్ సైట్ (https://www.lichousing.com/) లోకి లాగిన్ అయ్యి Careers పై క్లిక్ చేయాలి.
- తర్వాత To Apply Online Click here పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Click here for New Registration పై క్లిక్ చేసి అందులోని వివరాలన్నీ ఎంటర్ చేయాలి, ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- తర్వాత రూ.800 అప్లికేషన్ ఫీజు కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి.
- రాత పరీక్ష తేదీలు, హాల్ టికెట్ల డౌన్ లోడ్ తదితర సమాచారం ఈ-మెయిల్ కు పంపిస్తారు. అలాగే, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్ సైట్ లో పెడతారు.
- అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 25, 2022
Detailed Notification & To Apply Online – Click here