Jobs in MIDHANI : హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (Mishra Dhatu Nigam Limited-MIDHANI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No:MDN/HR/NE/3/22) జారీ చేసింది. మొత్తం 15 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, రాత పరీక్ష, పని అనుభవంను బట్టి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1.Junior Staff Nurse
2.Fireman
3.Refractory Mason
4.Junior Operative Trainee (JOT) – NDT Operator
5.Junior Operative Trainee (JOT) – Fitter – Cutting Machines
6. Junior Operative Trainee (JOT) – Turner
7. Junior Operative Trainee (JOT) – Fitter
8. Senior Operative Trainee (SOT) – Civil
9.Lab Technician
పోస్టుల సంఖ్య : నాలుగు (04) (UR-02, OBC-01, SC-01)
అర్హతలు : బీఎస్సీ (నర్సింగ్) లేదా జీఎన్ఎం. స్టేట్ లేదా నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ లేదా పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
వయసు : నవంబర్ 23 నాటికి 30 సంవత్సరాలు ఉండాలి.
అనుభవం : రెండు (02) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,130
పోస్టుల సంఖ్య : మూడు (03) (UR-02, OBC-01)
అర్హతలు:
ఎ) ఎస్సెస్సీ పాస్
బి) గుర్తింపు పొందిన సంస్థలో ప్రాథమిక మరియు అగ్నిమాపక ప్రాథమిక కోర్సు (6 నెలల కోర్సు) చేసి ఉండాలి.
సీ) లైట్ మోటార్ వెహికిల్ లేదా హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు
అనుభవం: నాలుగు (04) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.19,130
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (EWS)
అర్హతలు : ఎస్సెస్సీ పాసై ఉండాలి.
వయసు : 33 సంవత్సరాలు
అనుభవం : ఐదు (05) సంవత్సరాలు ఉండాలి.
నెలకు రూ.19,130
NDT Operator
పోస్టుల సంఖ్య: రెండు (02) (UR)
అర్హతలు : ఎస్సెస్సీ పాసై ఉండాలి. అలాగే, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లో ఐటీఐ చేసి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు
అనుభవం : రెండు (02) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000
Turner
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (UR)
అర్హతలు : ఎస్సెస్సీ పాసై ఉండాలి. అలాగే, ఐటీఐ(టర్నర్) చేసి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు
అనుభవం : రెండు (02) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000
Fitter
పోస్టుల సంఖ్య : ఒకటి (01) (EWS)
అర్హతలు : ఎస్సెస్సీ పాసై ఉండాలి. అలాగే, ఐటీఐ (ఫిట్టర్) చేసి ఉండాలి.
వయసు : 30 సంవత్సరాలు
అనుభవం : రెండు (02) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (EWS)
అర్హతలు : 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు
అనుభవం : రెండు (02) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.21,900
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (UR)
అర్హతలు : 60 శాతం మార్కులతో బీ.ఎస్సీ (కెమిస్ట్రీ/ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ (మెటలర్జీ)లో డిప్లొమా
ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : 35 సంవత్సరాలు
అనుభవం : మూడు (13) సంవత్సరాలు ఉండాలి.
జీతం: నెలకు రూ.22,950
అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా MIDHANI వెబ్ సైట్ (https://midhani-india.in) లోకి లాగిన్ కావాలి. అనంతరం E-Recruitment పై క్లిక్ చేసి అందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే ఉపయోగించాలి. రాత పరీక్ష ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం అన్ని వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్లకు మాత్రమే పంపిస్తారు. ఆ తర్వాత జనరల్ అభ్యర్థులు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లోనే రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అనంతరం అప్లికేషన్ ఫాంను అప్ లోడ్ చేయాలి.
అప్లికేషన్ ఫాంతో పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం పదో తరగతి సర్టిఫికెట్, విద్యార్హతలు, పర్సంటేజ్ ఫ్రూప్స్, కేటగిరీ, అనుభవం, పే స్కేల్ తదితర సర్టిఫికెట్లు కూడా అప్ లోడ్ చేయాలి. సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో అప్ లోడ్ చేయని దరఖాస్తులను రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫాం, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అప్ లోడ్ చేసిన అనంతరం ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 07, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
– Jobs in MIDHANI
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…